Publish Date:Sep 16, 2024
లక్ష్మీపార్వతి అలిగారు.. బుంగమూతి పెట్టుకున్నారు. జగన్ తనను చిన్నచూపు చూస్తున్నారని హర్టయ్యారు. ఇంత అనుభవం వున్న తనను పక్కనపెట్టి, ఎంతమాత్రం రాజకీయ అనుభవం లేని వాళ్ళకి పదవులు ఇచ్చారని తెగ ఫీలైపోతున్నారు. తన బాధనంతా సన్నిహితుల దగ్గర వ్యక్తం చేస్తూ, తనను అందరూ చిన్నచూపు చూస్తున్నారంటూ లబోదిబో అంటున్నారు. ఇంతకీ మేడమ్ గారు ఇంతలా ఫీలైపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇటీవల వైసీపీ పార్టీకి సంబంధించిన పదవులను జగన్ ప్రకటించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా తదితర పెద్ద తలకాయలకు పదవులు ఇచ్చారు. వాళ్ళతోపాటు ఒక చిన్న తలకాయ అయిన యాంకర్ శ్యామలకి కూడా ఒక పదవి ఇచ్చారు. అదికూడా ‘అధికార ప్రతినిధి’ లాంటి ప్రాధాన్యం వున్న పదవి ఇచ్చారు. ఇది లక్ష్మీపార్వతిని బాగా బాధపడుతున్నట్టు సమాచారం. చంద్రబాబు మీద విషం కక్కే విషయంలో జగన్ ఆశయాలకు అనుగుణంగా తాను పని చేస్తున్నప్పటికీ తనకు పదవి ఇవ్వకుండా, శ్యామలలాంటి రాజకీయానుభవం లేని వ్యక్తికి పదవి ఇవ్వడాన్ని లక్ష్మీపార్వతి జీర్ణించుకోలేకపోతున్నట్టు సమాచారం. ఈమధ్య కాలంలో లక్ష్మీపార్వతిని జగన్‌కి చెందిన టీవీ డిబేట్లకు కూడా పిలవటం లేదని తెలుస్తోంది. లక్ష్మీపార్వతి తిట్లు జనానికి రొటీన్ అయిపోయాయని, చంద్రబాబును లక్ష్మీపార్వతి విమర్శిస్తుంటే జనం ఎంతమాత్రం పట్టించుకోవడం లేదని ఆమెను జగన్ టీవీకి దూరంగా పెట్టాలరని తెలుస్తోంది. చంద్రబాబు విషయంలో అగౌరవంగా మాట్లాడుతున్నందుకు గతంలో లక్ష్మీపార్వతికి నెలనెలా ఇచ్చిన గౌరవ వేతనాన్ని కూడా జగన్ పార్టీ బంద్ చేసినట్టు తెలుస్తోంది. గౌరవ వేతనం ఆగిపోవడం, పదవి ఇవ్వకపోవడం, తనను పక్కన పెట్టేయడంతో లక్ష్మీపార్వతి ఫ్రస్టేషన్లో వున్నట్టు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lakshmi-parvathi-hurted-25-184926.html
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
Mahabubnagar ACB Raid, Telangana ACB, ACB Trap, Bribery Case, Rs 1 Lakh Bribe, Government Officials Arrested, Mahabubnagar Corruption, Youth and Sports Department, Jakkula Rajasekhar Reddy, Gorre Umesh, Telangana Anti Corruption Bureau, ACB Helpline 1064, Telangana Crime News
చలికాలం రాగానే మనలో చాలామంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు
అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!