పెద్దల సభకు లక్ష్మణ్ బీజేపే వ్యూహం ఏంటి ?
Publish Date:May 31, 2022
Advertisement
రాజ్య సభ ఎన్నికలు ఇంత రసవత్తరంగా సాగడం ఈమధ్య కాలంలో ఇదే మొదటిసారి కావచ్చును. ఒకే సారి 50 పైగా స్థానాలకు ఎన్నికలు జరగడం ఒకెత్తు అయితే, రానున్న రెండు సంవత్సరాల కాలంలో, జరగనున్న గుజారత్, కర్ణాటక, తెలంగాణ సహా మరొకొన్ని కీలక రాష్ట్రాల శాసన సభ ఎన్నికలు, ఆ వెంటనే వచ్చే 2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ పార్టీలు, ఆచి తూచి అభ్యర్ధుల ఎంపిక చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్’తో పాటుగా వివిధ రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్ష పాత్రను పోషిచున్న ప్రాంతీయ పార్టీలు, ఇక్కడి నేతలను అక్కడ అక్కడి నేతలను ఇక్కడ సర్దుబాటు చేయడంతో రాజ్యసభ రాజకీయం వేడెక్కింది. సాధారణంగా అంతగా చడీ చప్పుడు లేకుండా అయిపోయే, రాజ్యసభ ఎన్నికలు క్రతువు ఈసారి గట్టిగానే రాజకీయ వేడిని పుట్టిస్తోంది. ఇతర రాష్ట్రాల విషయం ఎలా ఉన్నా, తెలంగాణ నుంచి మూడు, ఏపీ నుంచి నాలుగు, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ఏడు స్థానాలు ఖాళీ అయితే, అన్ని స్థానాలను అక్కడి, ఇక్కడి అధికార పార్టీల అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎగరేసుకు పోయారు. అయితే, ఉన్నట్టుండి బీజేపీ ఉభయ తెలుగు రాష్ట్రాలలో అవకాశం లేకున్నా, తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు. మాజీ ఎమ్మెల్యే, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే. లక్ష్మణ్’ను ఉత్తర ప్రదేశ్ నుంచి బరిలో దించింది. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీకు ఉన్న సంఖ్యా బలంతో, లక్ష్మణ్’కు పెద్దల సభలో సీటు ఖరారు అయినట్లే అనుకోవచ్చును. ఏపీ విషయాన్ని పక్కన పెట్టినా తెలంగాణ నుంఛి, లక్ష్మణ్’తోపాటు రాజ్యసభ మాజీ సభ్యుడు, గరికపాటి మోహనరావు, సినీనటి విజయశాంతి, పార్టీ సీనియర్ నాయకుడు, ఇంతవరకు పోటీకి ఎప్పుడూ అవకాశం రాని, మురళీ ధర రావు, రెడ్డి, ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే,పార్టీ మాజే అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి వంటి కొందరి పేర్లు కూడా వినిపించాయి. అయితే, ఈ అందరినీ కాదని, ఇప్పటికే జాతీయ స్థాయి పార్టీ పదివిలో ఉన్న లక్ష్మణ్’ కు ఎందుకు అవకాశం ఇచ్చారనే చర్చ పార్టీ లోపల వెలుపల కూడా జరుగుతోంది. అయితే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో బీసీ ఓట్లను ఆకర్షించేందుకే లక్ష్మణ్’కు అవకాశం ఇచ్చారని పార్టీ నాయకులు పైకి చెపుతున్నారు. అయితే, అది నిజం కాదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో చక్రం తిప్పారని పార్టీ వర్గాల్లో మరో వాదన వినిపిస్తోంది. నిజానికి, ఒకప్పుడు, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ మధ్య అంత గొప్ప సంయోధ్యత లేదు. లక్ష్మణ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా, కిషన్ రెడ్డి బీజీపీ శాసనసభా పక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఇద్దరి మధ్య ఒక విధమైన కోల్డ్ వార్ ‘నడిచింది. లక్ష్మణ్ పార్టీ అధ్యక్షునిగా ఉన్న రోజులో కిషన్ రెడ్డి పార్టీ ఆఫీస్ గడప తొక్కలేదని, అంటారు. అది అక్షర సత్యం అయినా కాకపోయినా, ఇద్దరి మధ్య సయోధ్య లేదనేది మాత్రం కాదనలేని నిజం. అయితే, బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత, కొత్త ఈక్వేషన్స్’లో భాగంగా పాత మిత్రులు కిషన్ రెడ్డి,లక్ష్మణ్ చేతులు కలిపారని, ఈ నేపధ్యంలోనే, ఇప్పుడు రాష్ట్ర పార్టీపై తమ పట్టు సడలకుండా చూసుకునిందుకే కిషన్ రెడ్డి ఢిల్లీలో చక్రం తిప్పి, లక్ష్మణ్’ను పెద్దల సభకు పపంపడంలో కీలక భూమికను పోషించారని పార్టీ వర్గాల సమాచారం. అయితే రాష్ట్ర బీజేపీలో మొదటి నుంచి కూడా లీడర్ల కంటే, గ్రూపులు ఎక్కువ ఉన్నాయి అనేది ఎవరూ కాదనలేని నిజం. అందుకే, పార్టీకి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలలో ఇద్దరు అసంతృప్తితో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే, పార్టీ జాతీయ నాయకత్వం మాత్రం, సిద్ధాంత పునాదులున్న పాత కాపులను, పక్కకు తప్పించి, ఇతర పార్టీల నుంచి వచ్చిన మాస్ లీడర్లకు రాష్ట్ర పగ్గాలు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. లక్ష్మణ్’ను రాజ్యసభకు పంపడం కూడా అందులో భాగమే అంటున్నారు.
అయితే, పార్టీ జాతీయ నాయకత్వం, ఉభయ తెలుగు రాష్ట్ర్రాల నుంచి పోటీలో ఉన్న ఇతర నాయకులను కాదని లక్ష్మణ్’ను పికప్ చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
http://www.teluguone.com/news/content/lakshman-to-rajyasabha-what-is-bjp-strategy-25-136767.html





