యూపీ ఎన్నికలపై లఖింపుర్‌ ప్రభావం! బీజేపీకి గండం? 

Publish Date:Oct 6, 2021

Advertisement

మరో మూడు నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తర ప్రదేశ్ లో ఒక్క సారిగా రాజకీయాలు వేడెక్కాయి. హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రా పర్యటన సందర్భంగా లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటలు, ఒక్క సారిగా రాష్ట్ర రాజకీయాలను కొత్త మలుపు తిప్పాయి. ఈ దురదృష్టకర సంఘటనలో ఇప్పటివరకు తొమ్మిది మంది చనిపోయినట్లు సమాచారం. ఈ తొమ్మిది మందిలో  రైతులున్నారు. ఇతరులు ఉన్నారు. ఈ దుర్ఘటనకు సంబందించిన ఇతర వివరాలు ఎలా ఉన్నప్పటికీ, తొమ్మిది మంది ప్రాణాలు బలితీసుకున్న ఈ దుర్ఘటనకు, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు,ఆశిష్ మిశ్రా మూల కారణమని రైతులు, రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇదే విషయంగా విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, మిశ్రా మీద కత్తులు దూస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు లఖింపుర్‌ ఖేరికి బయలు దేరిన ప్రియాంకను పోలీసులు అరెస్ట్ చేయడం, రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించడంతో ఉద్రిక్తపరిస్థితి నెలకొంది. 

లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటలకు సంబందించి,ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రా,  మంగళ వారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. సుమారు అరగంటకు పైగానే మిశ్రా హోమ్ మంత్రితో సమావేశమయ్యారు. లఖింపుర్ సంఘటన పూపుర్వాపారాలను ఆయనకు వివరించినట్లు తెలుస్తోంది. అయితే సంఘటన జరిగి మూడు రోజులు అయినా, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు ఏమీ తీసుకోక పోవడం, అనేక అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. 

లఖింపుర్‌ హింసాకాండ నేపథ్యంలో మిశ్రాను కేంద్రమంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే, ఆయన కుమారుడు ఆశిష్‌ మిశ్రాపై హత్యా నేరం కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో మిశ్రా.. అమిత్ షాతో భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఈ ఘటనలో ఆశిష్‌ మిశ్రా పోలీసులకు లొంగిపోయే యోచనలో ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే తన కుమారుడిపై వస్తున్న వార్తలను అజయ్‌ మిశ్రా ఖండించారు. ఘటనకు కారణమైన వాహనం తమదేనని, అయితే అందులో తన కుమారుడు లేడని తెలిపారు. అంతేగాక, ఆందోళనకారులు రాళ్లు విసరడం వల్లే వాహనం అదుపుతప్పి రైతుల మీదకు దూసుకెళ్లిందని వెల్లడించారు. ఆ తర్వాత రైతులు జరిపిన దాడిలో వాహనంలో ఉన్న నలుగురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. 

అదలా ఉంటే, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఈ దుర్ఘటన ప్రభావం ఉంటుందని రాజకీయ పండితులు అంటున్నారు. అయితే సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చిన తర్వాత కానీ, ఎన్నికల పై సంఘటన ప్రభావం ఎలా ఉంటుంది అనేది, స్పష్టం కాదని మరో మాట కూడా వినవస్తోంది. 

By
en-us Political News

  
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.