లగడపాటి సర్వే...కూటమికే అనుకూలం

Publish Date:Dec 4, 2018

Advertisement

 

ఆంధ్ర ఆక్టోపస్ రాజగోపాల్ సర్వే కోసం అంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు లగడపాటి సర్వే తో డైలమాలో పడుతున్నాయి. తన సర్వే పూర్తిగా వెల్లడించకుండా రోజుకో ప్రకటన చేసి మరింత ఆసక్తి రేవుతున్నారు లగడపాటి. మొన్న 8  నుంచి 10 స్థానాల్లో స్వతంత్రులు గెలుస్తారని చెప్పి సంచలనం రేపిన లగడపాటి.. తాజాగా మీడియా తో తన అభిప్రాయాలను, సర్వే వివరాలను పంచుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం ప్రజానాడి హస్తం వైపే ఉందని లగడపాటి తెలిపారు. 2014లో పోలింగ్‌ శాతం 68.5గా నమోదైందని, అంతకుమించి నమోదైతే కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్‌కు విజయావకాశాలు ఎక్కువని ఆయన పేర్కొన్నారు. పోలింగ్‌ శాతం తగ్గితే మాత్రం హంగ్‌ రావొచ్చని జోస్యం చెప్పారు. పోలింగ్‌ శాతాన్ని బట్టి ఫలితాలు ఆధారపడి ఉంటాయని, పోలింగ్‌ పెరిగితే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని భావించాలన్నారు. గత ఎన్నికల్లోలాగానే 68.5 పోలింగ్‌ శాతం నమోదయితే ఎవరికి లబ్ధి చేకూరుతుందో ఆ వివరాలను 7వ తేదీసాయంత్రం 5 గంటల తర్వాత వెల్లడిస్తానని లగడపాటి చెప్పారు. 

ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ప్రజాఫ్రంట్‌ ఆధిక్యంలో ఉందని.. ఉమ్మడి వరంగల్‌, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ ముందంజలో ఉందని.. కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో మాత్రం హోరాహోరీ పోటీ ఉందని లగడపాటి వివరించారు. గతంతో పోలిస్టే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని, ఆ పార్టీ గ్రేటర్‌ పరిధిలోనే కాక, జిల్లాల్లోనూ కొన్ని స్థానాల్లో గెలుస్తుందని చెప్పారు. హైదరాబాద్‌లో ఎంఐఎం బలంగా ఉందని, మొత్తం 14 స్థానాల్లో ఏడు చోట్ల ఆ పార్టీ గెలుస్తుందని, మిగతా సీట్లను బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు పంచుకుంటాయని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, బెల్లంపల్లి నుంచి జి.వినోద్, మక్తల్‌ నుంచి జలంధర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా గెలవబోతున్నారని చెప్పారు. అందరూ ముందు నుంచి అనుకున్నట్టుగా తెలంగాణలో ఎన్నికలు ఏకపక్షంగా మాత్రం జరగడం లేదని తెలిపారు.  

తెలంగాణలోని 119 స్థానాలకుగాను 100 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించామని, ఒక్కో నియోజకవర్గంలో 1000 నుంచి 1200 నమూనాలు తీసుకున్నామని లగడపాటి వివరించారు. రెండు నెలల క్రితంతో పొల్చితే తెలంగాణ ప్రజల ఆలోచనల్లో చాలా మార్పు వచ్చిందని లగడపాటి అభిప్రాయపడ్డారు. అందుకు ప్రజాకూటమి అభ్యర్థుల ప్రచారం, ఇచ్చిన వాగ్దానాలు ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు. 100కుపైగా స్థానాలు గెలుస్తామన్న సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. ఎవరి అంచనాలు వారికి ఉంటాయని బదులిచ్చారు. గత నెల రోజులుగా తన పేరుతో సర్వే ఫలితాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయని.. కానీ, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని లగడపాటి స్పష్టం చేశారు. పలు ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోతుందనే విషయాన్ని ముందే ప్రకటించానని గుర్తుచేశారు. 2009 ఎన్నికల్లో సర్వేలన్నీ చంద్రబాబు అధికారంలోకి వస్తారని చెప్పగా.. తాను ముందుగా ప్రకటించినట్లుగానే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు గెలుస్తారని స్పష్టంగా చెప్పానని గుర్తు చేశారు. సర్వేలను నమ్మొద్దన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై స్పందించారు. రోజూ పలు సర్వేలు వెలువడుతున్న నేపథ్యంలో కేసీఆర్‌ ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని, తన సర్వేను లక్ష్యంగా చేసుకుని మాట్లాడినట్లు తాను భావించట్లేదని అన్నారు. సర్వేల విషయంలో రాజకీయ పార్టీలు, టీవీ చానళ్ల అంచనా వేరే ఉంటుందన్నారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్ గఢ్‌ మిజోరం సర్వే ఫలితాలనూ డిసెంబర్‌ 7నే వెల్లడిస్తానని లగడపాటి చెప్పారు.

By
en-us Political News

  
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు. ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ ఈ సవాల్‌ను స్వీకరించడం సంచలనం సృష్టించింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.