ఎవరిది ద్రోహం ఎవరిది నేరం ? ఎల్ రమణకు సోషల్ మీడియా చురకలు..

Publish Date:Aug 16, 2021

Advertisement

చెప్పేవాడికి వినేవాడు లోకువ ... లేదంటే నిన్న గాక మొన్న, ఉన్న పార్టీలో గౌరవ స్థానాన్ని వదలి అధికార పార్టీలో చేరిన ఎల్. రమణ కూడా ఈటల రాజేందర్ పార్టీ మారి తెరాసకు ద్రోహం చేశారని ఆరోపించడం ఏమిటి? తెలుగు దేశం పార్టీ, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనకు ఏ అన్యాయం చేశారని, రమణ పార్టీ వదలి వెళ్లారు? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే, తాను తెలుగు దేశం పార్టీకి చేసింది ద్రోహమా లేక మెడపట్టుకుని గెంటిన తర్వాత, గత్యంతరం లేక పార్టీ వదిలి పోయిన ఈటల రాజేందర్’ చేసింది  ద్రోహమా, అనేది ఆయనకే అర్థం అవుతుంది. 

నిజమే 2016 నుంచి 2021 వరకు పార్టీలో, ప్రభుత్వంలో అవమానాలు భరిస్తూ కూడా పదవి వదులుకోలేక ప్రగతి భవన్ గేట్లు పట్టుకు వేళ్లాడిన ఈటల రాజేందర్, ఇప్పుడు ఆత్మగౌరవం గురింఛి మాట్లాడితే, ఎంత విన సొంపుగా, ఎబ్బెట్టుగా ఉంటుందో, ఈటల పార్టీ మారడం గురించి ఎల్ రమణ మాట్లాడినా అలాగే ఉంటుంది. నిజానికి ఈటల తనంతటతాను పార్టీ మారలేదు, ముఖ్యమంత్రి కేసీఆర్ మెడపట్టి బయటకు గెంటిన తర్వాతనే మరోదారి లేక వెళ్లి బీజేపీలో  చేరారు. అంతేగాని, తెరాస సిద్దాంతం నచ్చకనో, బీజేపీ సిద్దాంతం తెగ నచ్చేసో ఆయన పార్టీ మారలేదు.ఇప్పటికి కూడా ఈటల రాజేందర్ ఎక్కడా కూడా గట్టిగా బీజేపీ గురించి మాట్లడ లేదు.అంతే కాదు, పార్టీని చూసి కాదు, నన్ను చూసి ఓటేయమనే ఓటర్లను అభ్యర్దిస్తున్నారు. నిన్నగాక మొన్న తెరాసలో చేరిన రమణ, గుడ్డొచ్చి పిల్లను ఎక్కిరించి నట్లు, పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో, ఉద్యమంలో. ప్రభుత్వంలో ఉండి కష్టసుఖాలు పంచుకున్న ఈటల పార్టీ మారడం పార్టీకి ద్రోహం చేయడమని మాట్లాడడం విడ్డూరంగానే కాదు, వికారంగా కూడా ఉందని ఎవరైనా అంటే, అది సబబే అనిపిస్తుంది. కాదనేందుకు కారణం కనిపించదు. 

తెలుగు దేశం పార్టీ  జాతీయ అధ్యక్షుడు, నారా చంద్రబాబు నాయుడు ఏనాడూ ఎల్.రమణను పల్లెత్తు మాట అనలేదు. ఒక సారి కాదు, రెండు సార్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుని చేశారు. పార్టీ టిక్కెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడ లేక పోయినా, పార్టీని బలోపేతం చేయడంలో విఫలమైనా,ఆయన్ని పార్టీ పదవి నుంచి తప్పించలేదు. అయినా, కేసేఆర్ ఏమి ఎరవేశారో, ఏ పదవి ఆశ చుపారో, ఏమోకానీ, కేసీఆర్ రమ్మనగానే, రమణ ఆ పిలుపు కోసమే వేయికళ్లతో ఎదురుచూస్తున్నట్లు వెళ్లి కారెక్కారు. ఒక విధంగా రాజకీయ పరిభాషలో చెప్పాలంటే, రమణ పదవులకు ఆశ పడి అమ్ముడు పోయారు. అమ్ముడు పోయిన నాయకుడు, అవమానాలకు గురై మరో మార్గం లేక పార్టీ వదిలిన ఈటలను ద్రోహిగా పేర్కొనడం, ఏదైతే వుందో అది, ఆయన్ని అయన అవమాన పరచుకోవడమే అవుతుంది. అందుకే, రమణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. 

ఈటల చేసింది పార్టీ (తెరాస) ద్రోహం అయితే, రమణ చేసింది ఏమిటో ... ఇంకేమనాలో ఆయనే చెపితే బాగుంటుందని సోషల్ మీడియాలో  రమణను నిలదీస్తున్నారు. అంతే కాదు, నమ్మి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు నాయుడుకి, తెలుగు దేశం పార్టీకి రమణ చేసింది ద్రోహం కాదా అని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు, ఈటల అవమానాలను భరిస్తూ తెరాసలో కొనసాగి ఉంటే, హుజూరాబాద్ ఉప ఎన్నికే వచ్చేది కాదు, రమణకు కారెక్కే అవకాశము ఉండేది అలాగే కౌశిక రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కినట్లుగా రేపు పొరపాటున రమణకు కూడా చిన్నదో, పెద్దదో ఎదో ఒక పదవి దక్కితే, అది కూడా ఈటల పుణ్యమే అవుతుందని నెట్జనులు చురకులు వేస్తున్నారు.  

నిజమే రాజకీయాలలోపరిశుద్ధంగా పవిత్రంగా ఉండడం ఎవరికి అయినా అయ్యే పని కాదు. కానీ, అద్దాల మేడలో కూర్చున్నవాళ్ళుఇతరుల మీద రాళ్ళేస్తే, ఏమవుతుందో తెలుసుకుని ప్రవర్తిస్తే బాగుటుందని హితవు పలుకుతున్నారు.అంతేకాదు, సుదీర్ఘ కాలం తెలుగు దేశం పార్టీలో కొనసాగిన ఎన్నికలలో గెలిచినా, ఒడి పోయినా రమణ ఎప్పుడూ ఇలా దిగజారుడు వ్యాఖ్యలు చేయలేదని గుర్తు చేస్తున్నారు. ఒక విధంగా రమణ జెంటిల్మెన్ పాలిటీషియన్ అనే మంచి పేరుంది,  పార్టీ మారి పట్టుమని నెలరోజులు కాకముందే, టీడీపీ  సంస్కారాన్ని వదిలి  కారు కల్చర్’లోకి జారిపోవద్దని మిత్రులు హితవు పలుకుతున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.