వైఎస్సార్ కు జగన్ కు పోలికే లేదా? కేవీపీ నోట షాకింగ్ నిజాలు.. 

Publish Date:Aug 23, 2021

Advertisement

కేవీపీ రామచంద్రరావు... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ బంధువు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన నేత. వైఎస్సార్ రాజకీయ ప్రస్థానంలో సలహాదారుడిగా ఆయన వెంట నడిచారు. ముఖ్యమంత్రిగా వైఎస్సార్ తీసుకున్న అన్ని నిర్ణయాల్లోనూ కేవీపీ పాత్ర ఉందని చెబుతారు. కాంగ్రెస్ పార్టీలోనూ ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారు కేవీపీ. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అటు ప్రభుత్వం, ఇటు పాలనలో నెంబర్ టు స్థానం కేవీపీదే. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కేవీపీ.. వైఎస్సార్ మరణం తర్వాత జగన్ కు సపోర్ట్ గా నిలిచారు. అయితే కొద్ది రోజులకే జగన్ కు ఆయన దూరమయ్యారు. జగన్ కొత్త పార్టీ పెట్టుకుంటే.. కేవీపీ మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఇద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చాయనే ప్రచారం అప్పట్లో జరిగింది.  

కేవీపీ రామచంద్రరావు ప్రస్తుతం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి దూరంగానే ఉంటున్నప్పటికి.. జగన్ గురించి ఆయనకు పూర్తిగా తెలుసుని అంటారు. వైఎస్సార్ ఆత్మ బంధువుగా చిన్నప్పటి నుంచి జగన్ ను దగ్గరగా చూశారు కేవీపీ. అందుకే జగన్ వ్యవహార శైలీ, ఆయన నైజం గురించి కేవీపీకి తెలిసినంతగా మరొవరికి తెలియదంటారు. అలాంటి కేవీపీ.. ఏపీ సీఎం జగన్ గురించి సంచలన విషయాలు బయటపెట్టారు. సాధారణంగా మీడియాకు దూరంగా ఉంటారు కేవీపీ. కాని ఇటీవల ఆయన ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో వైఎస్సార్ తో తన అనుబంధాన్ని పంచుకున్న కేవీపీ.. ఏపీ సీఎం జగన్ వైఖరిపైనా తనకు తెలిసిన విషయాలు బయటపెట్టారు. జగన్ తీరు ఎలా ఉంటుంది, వైఎస్సార్ ఎలా ఉండేవారు, వైఎస్ తో పోల్చితే జగన్ పరిస్థితి ఏంటన్న అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేవీపీ. 

ఏపీ సీఎం జగన్ ఎవరి మాట వినరనే అర్ధం వచ్చేలా మాట్లాడారు కేవీపీ. మంత్రివర్గ సమావేశాల్లో కీలక నిర్ణయాల్ని తీసుకోవాల్సిన సమయంలో సీనియర్ మంత్రులు.. సలహాదారులతో సమస్యలపై చర్చించి వైఎస్ నిర్ణయం తీసుకునేవారన్నారు. రోశయ్య లాంటి సీనియర్ల సలహాల్ని వైఎస్ తీసుకునే వారన్న విషయాన్ని కేవీపీ గుర్తు చేశారు. దీంతో  వైఎస్ మంత్రివర్గ సహచరులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే.. జగన్ మాత్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని పరోక్షంగా కేవీపీ చెప్పినట్లైంది. సమస్యల పరిష్కారానికి ముందు చర్చలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ ఎవరి మాట వినరన్న ఆరోపణ.. ఎవరి సలహాలు స్వీకరించే విమర్శలపైనా స్పందించేందుకు కేవీపీ ఇష్టపడలేదు. 

2024లో జరిగే ఎన్నికల్లో జగన్  తిరిగి అధికారంలోకి వస్తారా? అన్న ప్రశ్నకు సూటి సమాధానం చెప్పని కేవీపీ.. జగన్ కున్న బలం గురించి ప్రస్తావించారు. ఉమ్మడి రాష్ట్రంలో జగన్ కు మద్దతుగా కాంగ్రెస్ - టీడీపీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలతో ఉప ఎన్నికలు జరిగితే రెండు మినహా అన్ని స్థానాలు జగన్ గెలిచారని చెప్పారు. కడపలో ఆయనకున్న బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు.  రామచంద్రాపురం.. నర్సాపురం మినహా అన్నింటా జగన్ పార్టీ గెలిచిందని చెప్పారు. నెల్లూరు లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున సుబ్బిరామిరెడ్డిని బరిలోకి దింపితే.. జగన్ తన అభ్యర్థిగా మేకపాటిని దింపి అత్యధిక మెజార్టీతో గెలుపొందారని.. ఆ ఎన్నికల్లో టీడీపీ డిపాజిటివ్ కోల్పోయిందని కేవీపీ తెలిపారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల కాలం ఉన్నందున.. ఎవరు గెలుస్తారో ఇప్పుడే  అంచనా వేయలేమన్నారు. మంత్రులందరిని తీసి వేసి.. అంతా కొత్త వారితో కాబినెట్ ను సిద్ధం చేసుకుంటారన్న ప్రశ్నకు బదులిచ్చిన కేవీపీ.. గతంలోనే జగన్ ఈ విషయాన్ని చెప్పారని.. మంత్రివర్గంలో 90 శాతం మందిని తొలగిస్తానని చెప్పిన వైనాన్ని గుర్తు చేశారు. 

వైఎస్ హయాంలో చోటు చేసుకున్న అంశాలతో పాటు.. సీఎం జగన్ తో తనకున్న రిలేషన్ గురించి కేవీపీ సమాధానం ఇచ్చారు. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనతో తనకు నేరుగా సంబంధాలు లేవన్నారు. జగన్ తాను ఒకే పార్టీలో ఉన్నంత వరకు కష్టనష్టాల్ని.. సమస్యల్ని షేర్ చేసుకునే వాళ్లమని.. పార్టీ నుంచి వేరు పడినతర్వాత తమ మధ్య వ్యక్తిగత సంబంధాలు అలానే ఉన్నా.. అప్పటిలా సమస్యల్ని పంచుకునే విధానం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జగన్ ఎదుర్కొంటునన విమర్శల్నే గతంలోనూ వైఎస్ ఎదుర్కొనేవారని.. జగన్ వయసు ఉన్నప్పుడు వైఎస్ కు ఇలాంటి సమస్యే ఎదురయ్యేదన్నారు. పాదయాత్ర తరువాత ఆయనలో పూర్తిగా మార్పు వచ్చిందన్నారు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా.. మిత్రుల ద్వారా.. సన్నిహితుల ద్వారా తెలిసిన విషయాల మీదనే తాను స్పందిస్తున్నానని చెప్పారు కేవీపీ. 

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.