కాంగ్రెస్ దుస్థితిపై కెవిపి ఆవేదన
Publish Date:Apr 3, 2012
Advertisement
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ స్నేహితుడు కెవిపి రామచంద్రరావు ప్రస్తుతం అజ్ఞాతవాసంలో ఉన్నారు. ఆయన కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మీడియాకు ముఖం చూపించకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇంతకీ ఆయన ఏం చేస్తున్నట్లు అన్న అనుమానాలు రాష్ట్రప్రజలను వేధిస్తున్నాయి. తెలుగువన్.కామ్ పరిశీలనలో కెవిపి ప్రస్తుత కార్యక్రమాలపై అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. కెవిపి ఇప్పటికీ కేంద్ర నాయకత్వంతో ముఖ్యంగా ప్రణబ్ ముఖర్జీతో చాలా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఆయనతో తరచుగా కాంటాక్టులో ఉంటున్నారు. అంతేకాక రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై కూడా ఆయన తన దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. వైఎస్ కష్టపడి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి తెచ్చారని, ఆయన మరణానంతరం పార్టీ కుక్కలు చింపిన విస్తరిలా మారిందని కెవిపి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ఆయన ఒకవైపు కిరణ్ కు, మరోవైపు జగన్ కు వ్యతిరేకంగా కూడా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆర్ధిక వ్యవహారాల కారణంగా జగన్, కెవిపిల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. తన తండ్రి హయాంలో జరిగిన ఆర్ధిక లావాదేవీలన్నీ కెవిపి కనుసన్నల్లోనే జరిగాయని జగన్ కు తెలుసు. అయితే ఈ ఆర్ధిక లావాదేవీల్లో చాలా మొత్తం కెవిపి దగ్గరే చిక్కుకుని ఉందని జగన్ అనుమానం. దీనిపై జగన్ కు కెవిపికి మధ్య కొంత వాగ్వాదం కూడా జరిగినట్లు తెలిసింది. ఈ వాగ్వాదం అనంతరం కెవిపి కొంతకాలం గల్ఫ్ కు వెళ్ళిపోయారు. తిరిగి వచ్చిన తరువాత ఆయన తన సహజశైలిలో నిశ్శబ్ధంగా తన ప్రత్యర్థులకు వ్యతిరేకంగా వ్యూహాలు పన్నుతున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే ఆయన టి ఆర్ ఎస్ అధినేతకు కూడా అప్పుడప్పుడు సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత కిరణ్ ప్రభుత్వంపై కెవిపి కినుకుతో ఉన్నారు. ఇదే సమయంలో ఆయన బొత్స సత్యనారాయణపై కొంత సానుభూతిని చూపిస్తున్నారు. కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా రాష్ట్ర వ్యవహారాలపై ఎప్పటికప్పుడు కెవిపి నుంచి సమాచారం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కెవిపి హవా ఇంకా రాష్ట్రంలో కొద్దో గొప్పో కొనసాగుతూనే ఉంది. రాజేకీయ పరిణామాలు మారితే 2014 ఎన్నికల నాటికి కెవిపి కీలకపాత్ర వహించినా ఆశ్చర్యపోనక్కరలేదు.
http://www.teluguone.com/news/content/kvp-ramachadrarao-24-13136.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





