కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీకి బలమైన సవాల్ విరారు. గుజరాత్ లో బీజేపీని ఓడిస్తామని శపథం చేశారు. ఎక్కడో కాదు.. లోక్ సభ వేదికగా బీజేపీని ఉద్దేశించి రాసి పెట్టుకోండి ఈ సారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించి తీరుతాం అని సవాల్ విసిరారు. చక్కటి హిందీలో ఒకటికి రెండుసార్లు ఆప్ లిఖ్కే లేలో.. లిఖ్కే లేలో ఔర్ ఆప్ కో హమ్, గుజరాత్ మే హరాయింగే ఇస్ బార్ అని సవాల్ విసిరారు.
Publish Date:Mar 31, 2025
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. మంగళవారం (ఏప్రిల్ 1) తిరుమలేశుని దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.
Publish Date:Mar 31, 2025
కుప్పం గంగమ్మఆలయ పాలక మండలి చైర్మన్ గా బీఎంకే రవిచంద్రబాబును ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నియమించారు. ఆయనతో పాటు 10 మంది సభ్యులను కూడా నియమించారు.
Publish Date:Mar 31, 2025
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆలోచనలు, ఆచరణ అద్భుతం అంటూ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అరకు కాఫీ కేఫ్ లు విస్తరిస్తున్న తీరును ప్రస్తావిస్తూ ఆయనీ మేరకు ఎక్స్ వేదికగా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు.
Publish Date:Mar 31, 2025
వేసవి వేడి నుంచి తెలంగాణ వాసులకు ఉపశమనం కలగనుంది. ఈ మేరకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది.
Publish Date:Mar 31, 2025
గత ఏడాది ఏపీలో సాధారణ స్థాయి వర్షపాతం నమోదు కాలేదు అయినా కూడా గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కరువు మండలాల ప్రకటన సరిగా జరగలేదు.
Publish Date:Mar 31, 2025
ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాల్లో ఇన్‌యాక్టివ్ అయిన వైసీపీ నేతలు ఎవరి వ్యాపాకాల్లో వారు పడ్డారు. తమకు నచ్చింది చేసుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఆ క్రమంలో వైసీపీ కీలక నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. నయా అవతారం ఎత్తారు.
Publish Date:Mar 31, 2025
పరారీలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. పొడలకూరు మండలంలో జరిగిన అక్రమ మైనింగ్ కేసులో సోమవారం విచారణకు కాకాణి డుమ్మా కొట్టారు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చిన పోలీసులు.. మంగళవారం విచారణకు రావాలని ఆదేశించారు.
Publish Date:Mar 31, 2025
విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించి నానా హడావుడి చేసిన జగన్ సర్కారు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమాతో తన నివాసం కోసం రుషికొండను తొలిచి ప్రజాధనంతో ఒక భారీ ప్యాలెస్ మాత్రం జగన్ కట్టించారు. దాన్ని ఏం చేసుకోవాలో తెలియని స్థితిలో కూటమి సర్కారు ఉంది.
Publish Date:Mar 31, 2025
వరసగా పదేళ్ళ పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల్లో హరిత హారం కార్యక్రమం ఒకటి. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో, హరిత హారం ప్రాజెక్టుకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చింది.
Publish Date:Mar 31, 2025
వేసవి వేడి నుంచి తెలంగాణ వాసులకు ఉపశమనం కలగనుంది. ఈ మేరకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. మార్చి లోనే ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు, తీవ్రమైన ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న తెలంగాణ వాసులకు రాష్ట్రంలో మూడు రోజులు వాతావరణం చల్లబడనుందన్న చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ.
Publish Date:Mar 31, 2025
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములను వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెను వివాదానికి కారణమైన సంగతి తెలిసిందే. భూముల వేలానికి నిర్ణయం తీసుకున్న సర్కార్ భారీ పోలీసు బందోబస్తు నడుమ ఆ భూముల చదును కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
Publish Date:Mar 31, 2025
గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిని ఏఐజీ ఆస్పత్రి నుంచి ఇలా డిశ్చార్జ్ కాగానే అలా ఎయిర్ అంబులెన్స్ లో ముంబైలోని ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కు తరలించారు. ఈ నెల 26న కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే.