బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఈ ఫార్ములా కార్ రేసింగ్ కేసులో నిండా మునిగారా అంటే న్యాయ నిపుణులు ఔననే అంటున్నారు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను కోర్టు మంగళవారం (జవవరి 7) కొట్టి వేసింది. ఈ కేసులో కోర్టు తన క్వాష్ పిటిషన్ కు అనుకూలంగా తీర్పు వెలువరిస్తుందనీ, తనపై కేసు నిలవదనీ కేటీఆర్ నమ్మకంతో ఉన్నారు. అయితే కోర్టు ఆయన పిటిషన్ ను కొట్టివేయడమే కాకుండా, అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న ఆయన విజ్ణప్తిని కూడా తోసిపుచ్చింది.
దీంతో ఈ కేసులో కేటీఆర్ పాత్ర, ప్రమేయంపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టు భావిస్తున్నట్లు స్పష్టమైంది. అసలు కేటీఆర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తునకు గవర్నర్ ఆమోదం తెలిపిన రోజే ఫార్ములా ఈ కార్ కేసులో కేటీఆర్ కు చిక్కులు తప్పవన్న విషయం నిర్ధారణ అయ్యిందని పరిశీలకులు విశ్లేషించారు. ఇప్పుడు ఆయన దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడం, అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వడానికి కూడా నిరాకరించడంతో ఇక ఆయనను ఏసీబీ అరెస్టు చేస్తుందన్న చర్చ పోలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది. మరో వైపు ఈడీ ముందు ఆయన మంగళవారం (జనవరి 7) విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే తన క్వాష్ పిటిషన్ పై తిర్పు వెలువడుతుంది కనుక రాలేనని కేటీఆర్ ఈడీకి తెలపడంతో బుధవారం (జనవరి 8)న విచారణకు రావాల్సిందిగా మరోసారి నోటీసులు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో కేటీఆర్ అరెస్టు నుంచి మినహాయింపు కోసం సుప్రీంను ఆశ్రయించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. తన క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంను ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇదే కేసులో కేటీఆర్ పై ఈడీ నమోదు చేసిన కేసులో కూడా ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయంటున్నారు. దీంతో ఇప్పుడు కేటీఆర్ ఏం చేయబోతున్నారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ktr-what-to-do-25-190924.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.