సింగరేణి ఆస్తుల ధ్వంసం, మిలిటెంట్ తరహా పోరాటాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఈ నేపథ్యంలో బాల్క సుమన్‌ను పరామర్శించడానికి బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్వయంగా చంచల్ గూడా జైలుకు వెళ్లారు. గురువారం (జూన్ 4) ఉదయం చంచల్‌గూడ జైలు వద్దకు చేరుకున్న కేటీఆర్ వెంట మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు ఉన్నారు. జైలు నిబంధనల ప్రకారం ములాఖత్‌లో బాల్క సుమన్‌ను కలిసిన కేటీఆర్, ఆయనకు పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
బాల్క సుమన్‌పై బీఎన్ఎస్ సెక్షన్ 326 (జీ), 55, 61 (2), 351 (3), 353 (1), 152 తో పాటు ప్రభుత్వ ఆస్తుల నష్ట నివారణ చట్టం (పీడీపీపీ యాక్ట్) కింద కేసులు నమోదు చేశారు. ఇటు కేటీఆర్ కూడా సుమన్ ఆవేశంలో మాట్లాడిన మాటలు తప్పేనని అంగీకరిస్తూనే, ప్రభుత్వం కక్షసాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ కేసులు పెట్టిందని, దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామని బీఆర్‌ఎస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ktr-visits-chanchalguda-jail-36-221761.html
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్ స్టేజ్‌కు చేరాయి.
మాజీ మంత్రి, వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టాలంటూ ఆయన కుమార్తె సునీత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB)కి చెందిన ఇన్‌స్పెక్టర్ బి. మహేందర్‌కు సంబంధించిన ఎసీబీ (ACB) రిమాండ్ కాపీలో పలు సంచలన అంశాలు వెలుగుచూశాయి.
తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థను మరింత బలో పేతం చేసి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని SMS-1 విభాగంలో భారీ పేలుడు సంభవించింది.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో అత్యంత విచిత్రమైన, సమాజాన్ని నివ్వెరపరిచే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్‌లో ఆహార భద్రత, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్న H-FAST (Hyderabad Food Adulteration Surveillance Team) బృందం మృగశిర కార్తి రోజున భారీ ఆపరేషన్ నిర్వహించారు.
కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బీటెక్ విద్యార్థి అదృశ్యం కేసు విషాదాంతమైంది.
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది.
నేటి ఆధునిక కాలంలో ఐదెంకల జీతం వస్తే జీవితం ఎంతో విలాసవంతంగా ఉంటుందని చాలా మంది భావిస్తారు.
ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధాలు కలిగి ఉండటం చట్టప్రకారం నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల ఎంఎల్ఆర్ కాలనీకి చెందిన రసూల్ జాకబ్ 2024లో అల్వాల్‌కు చెందిన మేఘనను వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు భారీగా కట్నకానుకలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు తలెత్తడంతో పరిస్థితి దిగజా రింది. రోజురోజుకీ గొడవలు పెరిగిపోతూ ఉండడంతో మేఘన ఈ క్రమంలో జాకబ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.