సాధారణంగా ర్యాపిడో అంటే వేగంగా డెలివరీలు చేసే సర్వీస్... కానీ ఈసారి అదే రైడ్ ఒక పెద్ద డ్రగ్స్ రవాణా ప్రయత్నాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో గంజాయిని పార్సిల్ రూపంలో తరలించే ప్రయత్నాన్ని ఒక ర్యాపిడో రైడర్ అప్రమత్తతతో పోలీసులు అడ్డుకున్నారు.
గత నెల 31న మేడ్చల్ ప్రాంతం నుంచి గండిమైసమ్మకు ఒక పార్సిల్ ర్యాపిడో ద్వారా బుక్ చేయబడింది. ఈ పార్సిల్‌ను బీహార్‌కు చెందిన రూపేష్ కుమార్ బుక్ చేసినట్లు సమాచారం. ప్రారంభంలో ఇది సాధారణ డెలివరీలా కనిపించినప్పటికీ, రైడర్ ఆదర్శన్‌కు పార్సిల్ పై అనుమానం కలిగింది. పార్సిల్ బరువు, ప్యాకింగ్ తీరు.. అలాగే డెలివరీ డిటెయిల్స్ విషయంలో అసహజత కనిపించడంతో అతను జాగ్రత్తగా వ్యవహరించాడు.ఎలాంటి ఆలస్యం చేయకుండా రైడర్ ఆదర్శన్ దుండిగల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇది ఈ కేసులో కీలక మలుపుగా మారింది.
పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆ పార్సిల్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. అందులో గంజాయి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అక్రమ రవాణా ప్రయత్నం స్పష్టమైంది. పోలీసులు వెంటనే నిందితుడు రూపేష్ కుమార్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈ ఘటన వెనుక మరింత నెట్‌వర్క్ ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.ఈ కీలక సమయంలో అప్రమత్తత చూపిన ర్యాపిడో రైడర్ ఆదర్శన్‌ను పోలీసులు ప్రత్యేకంగా అభినందించారు.
అతని ధైర్యం మరియు సమయస్ఫూర్తిని గుర్తిస్తూ, కోటి రెడ్డి స్వయంగా ఆయనను సన్మానించారు. సందేహాస్పద పరిస్థితుల్లో ప్రజల అప్రమత్తతే నేరాలను అడ్డుకుంటుంది అని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనతో డెలివరీ సర్వీసుల ద్వారా జరుగుతున్న అక్రమ రవాణాపై పోలీసులు మరింత కఠిన నిఘా పెట్టారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/illegal-ganja-smuggling-in-dundigal-foiled-36-221759.html
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB)కి చెందిన ఇన్‌స్పెక్టర్ బి. మహేందర్‌కు సంబంధించిన ఎసీబీ (ACB) రిమాండ్ కాపీలో పలు సంచలన అంశాలు వెలుగుచూశాయి.
తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థను మరింత బలో పేతం చేసి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని SMS-1 విభాగంలో భారీ పేలుడు సంభవించింది.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో అత్యంత విచిత్రమైన, సమాజాన్ని నివ్వెరపరిచే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్‌లో ఆహార భద్రత, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్న H-FAST (Hyderabad Food Adulteration Surveillance Team) బృందం మృగశిర కార్తి రోజున భారీ ఆపరేషన్ నిర్వహించారు.
కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బీటెక్ విద్యార్థి అదృశ్యం కేసు విషాదాంతమైంది.
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది.
నేటి ఆధునిక కాలంలో ఐదెంకల జీతం వస్తే జీవితం ఎంతో విలాసవంతంగా ఉంటుందని చాలా మంది భావిస్తారు.
ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధాలు కలిగి ఉండటం చట్టప్రకారం నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల ఎంఎల్ఆర్ కాలనీకి చెందిన రసూల్ జాకబ్ 2024లో అల్వాల్‌కు చెందిన మేఘనను వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు భారీగా కట్నకానుకలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు తలెత్తడంతో పరిస్థితి దిగజా రింది. రోజురోజుకీ గొడవలు పెరిగిపోతూ ఉండడంతో మేఘన ఈ క్రమంలో జాకబ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
గర్భాలయం, అర్థమండపం, మహామండపలతో, కప్పుల వరకు ఉన్న ఆలయం, కాకతీయ వాస్తు శిల్పానికి అర్థం పడుతుందనీ, కప్పురాళ్లు, గోడలు కూలిపోయి, చుట్టూ చెట్లు పొదలు పెరిగి, ఆలయం ఉనికికే ప్రమాదం ఏర్పడిందని, ఆలయాన్ని ఊడదీసి, ఆధునిక పునాదులపై పునర్నిర్మించి, వారసత్వ సంపదగా కాపాడి, భవిష్యత్ తరాలకు అందించాలని గ్రామ ప్రజలకు, జిల్లా యంత్రాంగానికి శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
విమానాన్ని వెంటనే తిరిగి విమానాశ్రయానికి మళ్లించి, భద్రతా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ మహిళను అవుట్‌పోస్ట్ పోలీస్ సిబ్బందికి అప్పించారు. వారు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ప్రయాణికులకు, విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.