Publish Date:Jun 22, 2026
బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డిపైనా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. నేను కేసీఆర్ అంత మంచోడిని కాదు. వచ్చే ఐదేళ్ల చిట్టినాయుడు, అండ్ టీం'కు సినిమా చూపిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
గడిచిన కాలంలో తమను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరినీ, తమ పార్టీ నేతలపై కక్షపూరితంగా అక్రమ కేసులు బనాయించిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని కేటీఆర్ హెచ్చరించారు. కష్టకాలంలో పార్టీతో కలిసి నడిచిన ప్రతి ఒక్క కార్యకర్తను, నాయకుడిని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో ప్రతిపక్షాలను అణచివేయాలని చూస్తే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని, రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ శ్రేణులు మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళ్తాయని పిలుపునిచ్చారు.
ఈ రాజకీయ యుద్ధంలో తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, ప్రతి అక్రమ కేసును చట్టపరంగా మరియు రాజకీయంగా ఎదుర్కొంటామని కేటీఆర్ పునరుద్ఘాటించారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ప్రభుత్వం తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి కుతంత్రాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. రాబోయే ఐదేళ్ల కాలంలో ప్రతిపక్షంగా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేస్తామని, అధికార పక్షానికి చుక్కలు చూపిస్తామని కేటీఆర్ సవాల్ విసిరారు. వర్దన్నపేట వేదికగా కేటీఆర్ చేసిన ఈ సుదీర్ఘ, ఘాటైన ప్రసంగం బీఆర్‌ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా, అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ktr-sensational-comments-39-223780.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!