జారి పడి గాయపడ్డ కేటీఆర్.. మూడు వారాలు విశ్రాంతి

Publish Date:Jul 23, 2022

Advertisement

టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గాయపడ్డారు. ప్రగతి భవన్ లో ఆయన ప్రమాద వశాత్తూ జారి పడటంతో ఎడమ కలి మడమ వద్ద హెయిర్ లైన్ ప్రాక్చర్ అయ్యింది. దీంతో వైద్యులు మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని పేర్కొన్నారు.

ఆదివారం నాడు ఆయన జన్మదినం కావడంతో అభిమానులు క్యాడర్ ఘనంగా జరపాలని భావించినప్పటికీ ఆయన రాష్ట్రంలో భారీ వరదలు, వర్షాల నేపథ్యంలో జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించిన ఆయన గిఫ్ట్ ఏ స్మైల్ కింద బాధితులకు చేతనైన సహాయం చేయాలని కేడర్ కు, అభిమానులకు సూచించారు. జన్మదినానికి ముందు రోజు ఆయన గాయపడటంతో పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆయన త్వరగా కోలుకోవాలంటూ ట్విట్టర్ వేదికగా పలువురు పేర్కొన్నారు.

ఇలా ఉండగా తనకు అనుకోని విశ్రాంతి దొరికిందంటూ కేటీఆర్ సరదా ట్వీట్ చేసి..ఓటీటీలో మంచి సినిమాలు చూస్తాననీ నెటిజన్లకు చెప్పారు. మంచి సినిమాలూ, కార్యక్రమాలను సూచించాలని కోరారు. మొత్తం మీద ఓ మూడు వారాల పాటు కేసీఆర్ టెలికాన్ఫరెన్స్ లకు మాత్రమే పరిమితమౌతారు. ఆయన ప్రత్యక్షంగా ఎటువంటి కార్యక్రమాలకూ హాజరయ్యే అవకాశం లేదు. నిజానికి ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన నేపథ్యంలో కేటీఆర్ రాష్ట్ర వ్యవహారాలన్నీ తానై చేస్తున్నారు.

విపక్షాలపై విమర్శల దూకుడు పెంచారు. ప్రారంభోత్సవాలు, పార్టీ వ్యవహారాలూ అన్నిటినీ తన భుజస్కంధాలపై వేసుకుని చేస్తున్నారు. ఈ తరుణంలో ఆయన ఓ మూడు వారాలు ప్రత్యక్షంగా ఏ కార్యక్రమంలోనూ పాల్గొనకపోవడం టీఆర్ఎస్ కు ఒక విధంగా ఇబ్బందే అని చెప్పాలి.  కాగా మంత్రి హరీష్ రావు కేటీఆర్ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు.

By
en-us Political News

  
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.