క్రియాశీల రాజకీయాల్లో చేరాలని ఎంతో అనుకున్నా.. జస్టిస్ ఎన్వీ రమణ

Publish Date:Jul 23, 2022

Advertisement

క్రిశీలరాజకీయాల్లో చేరాలని ఒక దశలో ఎంతో అనుకున్నాననీ, అందుకోసం ఎంతో కష్టపడ్డాననీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. అయితే విధి మరోలా నడిపిందని చెప్పారు.  జార్ఖండ్ రాంచీలో నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ స్టడీ & రీసెర్చ్ ఇన్ లా నిర్వహించిన జస్టిస్ ఎస్‌బి సిన్హా స్మారక ఉపన్యాసంలో  లైఫ్ ఆఫ్ ఏ జడ్జి అన్న అంశంపై ఆయన మాట్లాడారు.

సరిగ్గా  నెల రోజులలో పదవీ వరమణ చేయనున్న జస్టిస్‌ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలు ప్రాథాన్యత సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మీడియా పోకడలపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియాల మధ్య స్పష్టమైన తేడాను ఆయన గుర్తించారు. ప్రింట్ మీడియా ఇప్పటికీ ఎంతో కొంత బాధ్యతగా వ్యవహరిస్తోందనీ, అయితే డిజిటల్ మీడియా మాత్రం తెలిసీ తెలియని తనంతో బాధ్యతల గురించి పట్టింపు లేకుండా వ్యవహరిస్తోందన్నారు. 

 గతంలో పలు సందర్భాలలో ఇన్వేస్టిగేటివ్ జర్నలిజం ఆవశ్యకతను గట్టిగా సమర్ధించిన ఆయన తాజాగా సోష‌ల్ మీడియా తీరుపై నిశిత విమర్శలు చేశారు. న్యాయమూర్తులకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమంలో జరగుతున్న ప్రచారం న్యాయ వ్యవస్థ స్వతంత్రత, పని తీరుపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.  సామాజిక మాధ్యమానికి వాస్తవమేదో, అవాస్తవమేదో, మంచి, చెడుల గురించి చెప్పే సామర్థ్యం కానీ, నైపుణ్యం కానీ ఇసుమంతైనా లేదని అభిప్రాయపడ్డారు.

ఈ మీడియా స్వయంగా విచారణ చేసేసి తీర్ులు కూడా ఇచ్చేస్తోందని, మిడిమిడి జ్ణానంతో చర్చలు నిర్వహించి వెల్లడి చేస్తున్న అభిప్రాయాల ప్రభావం ప్రజలపై కూడా పడుతుందని అన్నారు. ఇటువంటి వాటి వల్ల ప్రజాస్వామ్యానికి నష్టం వాటిల్లుతుందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.  

By
en-us Political News

  
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.