Publish Date:Nov 16, 2024
అమృత్ పథకంలో కుంభకోణంపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశానంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు చేసిందంతా ఒట్టుట్టి హడావుడేనా? ఆయనకు అసలు కేంద్ర మంత్రి అప్పాయింట్ మెంటే దక్కలేదా? అంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఔననే అంటున్నారు. ఒక్క కాంగ్రెస్ నేతలే కాదు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా అదే చెబుతున్నారు. ఆయన ఒక అడుగు ముందుకు వేసి కేటీఆర్ ది అంతా వట్టి బిల్డప్ మాత్రమేననీ, ఆయనకు అసలు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ అప్పాయింట్ మెంటే ఇవ్వలేదని డంకా బజాయించి మరీ చెబుతున్నారు.
ఒక ఎంపీగా ఈ విషయంలో తాను వాస్తవాలను తెలుసుకుని మరీ చెబుతున్నారని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. కేటీఆర్ ఒక బిల్డప్ బాబాయ్ లో అబద్ధాలు చెబుతూ, అతిశయోక్తులు మాట్లాడుతూ పార్టీ క్యాడర్ ను భ్రమల్లో ఉంచుతున్నారని విమర్శించారు. ఇటీవల ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కొండా విశ్వేశ్వరరెడ్డి కేటీఆర్ నిజంగా మనోహర్ కట్టార్ ను కలిసి అమృత్ పథకంలో కుంభకోణంపై ఫిర్యాదు చేశారా అన్న విషయంలో అనుమానం వచ్చి తాను స్వయంగా కేంద్ర మంత్రి పీఏతో మాట్లాడానని అప్పుడు వాస్తవం తెలిసిందని వివరించారు.
అయినా కేటీఆర్ నిజంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ తో భేటీ అయ్యి ఉంటే ఆ పొటో విడుదల చేయాలని సవాల్ విసిరారు. కేటీఆర్ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ అప్పాయింట్ మెంట్ కోరిన సంగతి వాస్తవమేననీ, అయితే కేటీఆర్ ను మంత్రి కలవలేదనీ, ఆయనను బయట నుంచే పంపించేశారనీ కొండా విశ్వేశ్వరరెడ్డి కుండబద్దలు కొట్టేశారు. అసలు ఢిల్లీలో కేటీఆర్ ఒక్క కేంద్ర మంత్రిని కూడా కలవలేదనీ, ఎవరూ ఆయనకు అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదనీ పేర్కొన్నారు. ఇంతకీ ఆయన ఢిల్లీలో కలిసింది ఎవరినయ్యా అంటే కాంగ్రెస్ నేతలను అని చెబుతున్నారు. వాస్తవానికి కేటీఆర్ ను అరెస్టు నుంచి కాపాడుతున్నది కాంగ్రెస్ నేతలేనని ఆయన అంటున్నారు. రేవంత్ సర్కార్ కేటీఆర్ ను అరెస్టు చేయాలని భావిస్తున్నప్పటికీ కాంగ్రెస్ హై కమాండ్ మాత్రం అందుకు అంగీకరించడం లేదనీ, వాస్తవానికి కేటీఆర్ ను అరెస్టు నుంచి కాపాడుతున్నది కాంగ్రెస్ అగ్రనాయకత్వమేననీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ktr-din-not-meet-union-minister-manoharlal-khatte-39-188478.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.