Publish Date:Nov 16, 2024
నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో హస్తిన పర్యటనకు వెళ్లారంటే.. కచ్చితంగా ఆయన కేంద్రం నుంచీ రాష్ట్రానికి ఏదో ఒక ప్రయోజనం సాధించుకు వస్తారు. ఇది ఆయన ప్రత్యర్థులు కూడా అంగీకరించే వాస్తవం. నిజానికి చంద్రబాబు కూడా హస్తిన పర్యటన అంటే ప్రధాని మోడీ, అమిత్ షాలతో భేటీ కంటే విత్త మంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కు మంత్రి కుమార స్వామి, జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిలతో భేటీ అవుతారు. ఆయా శాఖల నుంచి రాష్ట్రానికి ఏయే ప్రయోజనాలు అందే అవకాశం ఉందో వాటిపై వారికి వినతులు సమర్పిస్తారు. అలాగే ఆయన పర్యటన తరువాత ఆయా శాఖల నుంచి రాష్ట్రానికి కేటాయింపులపై ప్రకటన రావడం కద్దు.
అయితే తాజా చంద్రబాబు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో భేటీ అయ్యారు. చంద్రబాబు ఆయన వద్దకు వెళ్లి కలవడం కాకుండా స్వయంగా జయశంకర్ చంద్రబాబు నివాసానికి వచ్చారు. దీంతో చంద్రబాబు, జైశంకర్ భేటీ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అంతే కాకుండా వీరి భేటీ వైసీపీని వణికి పోయేలా చేస్తోంది. వీరి భేటీ జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించే అయి ఉంటుందన్న భయం వైసీపీలో వ్యక్తం అవుతోంది. ఎందుకంటే జగన్ అక్రమాస్తుల కేసుల్లో విదేశాల నుంచి రావలసిన సమాచారం కోసం గతంలోనే సీబీఐ విదేశాంగ మంత్రిత్వ శాఖకు పలు లేఖలు రాసింది. వాటికి సంబంధించిన సమాధానాలు వస్తే జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వేగం పుంజుకుంటుంది. చంద్రబాబు జైశంకర్ ల మధ్యా తాజాగా జరిగిన భేటీలో జగన్ అక్రమాస్తుల కేసుల గురించే చర్చ జరిగిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ భయంతో వణికి పోతున్నది. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ కొలువుదీరిన తరువాత గత ప్రభుత్వ అవినీతిపై, అక్రమంగా సొమ్ముతరలించిన వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
ఆ క్రమంలోనే రాష్ట్రం నుంచి అక్రమంగా విదేశాలకు తరలిపోయిన సొమ్ముపై రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు కేంద్ర సహకారం కోరేందుకే చంద్రబాబు విదేశాంగ మంత్రి జై శంకర్ తో భేటీ అయ్యారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విదేశాంగమంత్రితో చంద్రబాబు భేటీ వైసీపీని ఆందోళనకు గురి చేస్తోందని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbn-meet-foriegn-affaira-minister-jaishankar-39-188483.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.