హైదరాబాద్ మెట్రోపై సీఎం రేవంత్-కిషన్ రెడ్డి డ్రామాలు : కేటీఆర్

Publish Date:Jun 23, 2026

Advertisement

 

హైదరాబాద్ మెట్రో రైలు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి రాజకీయ డ్రామాలకు తెరలేపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శేరిలింగంపల్లిలో నిర్వహించిన పార్టీ శ్రేణుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రేవంత్ రెడ్డి కేంద్రాన్ని ఏదో అడిగినట్లు, కిషన్ రెడ్డి కేంద్రం నుంచి ఏదో సాధించినట్లు చూపిస్తూ ఢిల్లీలో కొత్త నాటకానికి శ్రీకారం చుట్టారని విమర్శించారు. హైదరాబాద్‌లో పరస్పరం విమర్శలు చేసుకుంటూ, ఢిల్లీలో మాత్రం కలిసి కనిపించడం ప్రజలను మభ్యపెట్టడానికేనని అన్నారు.

హైదరాబాద్ మెట్రో పరిధిలోని సుమారు 250 ఎకరాల భూములపై రాష్ట్ర ప్రభుత్వం కన్నేసిందని కేటీఆర్ ఆరోపించారు. దాదాపు రూ.30 వేల కోట్ల విలువైన ఆస్తులను కుటుంబ సభ్యులు, అనుచరులకు అప్పగించే భారీ కుంభకోణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని అన్నారు. ఈ ఉద్దేశంతోనే మెట్రో సంస్థ ఎల్‌అండ్‌టిని బ్లాక్‌మెయిల్ చేసి రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారని ఆరోపించారు.

ప్రైవేట్ సంస్థ అయిన ఎల్‌అండ్‌టి తీసుకున్న రూ.14 వేల కోట్ల అప్పును రాష్ట్ర ప్రజలపై మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని కేటీఆర్ విమర్శించారు. మెట్రోపై ప్రేమ ఉన్నట్లు చూపిస్తున్న రేవంత్ రెడ్డి చర్యల వెనుక భారీ ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు.

మెట్రో విస్తరణ విషయంలో కేంద్రం చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన లక్డీకాపూల్–పటాన్‌చెరు మెట్రో కారిడార్‌కు ఎందుకు ఆమోదం తెలపలేదని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో చిన్న నగరాలకు కూడా మెట్రో ప్రాజెక్టులు మంజూరు చేసిన కేంద్రం తెలంగాణ విషయంలో వివక్ష చూపిందని ఆరోపించారు.

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి విమానాశ్రయం వరకు భూసేకరణ అవసరం లేకుండా చేపట్టిన ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్టును రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిందని కేటీఆర్ అన్నారు. ఆ ప్రాజెక్టు కొనసాగి ఉంటే ఇప్పటికి పూర్తై లక్షలాది మంది ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనం లభించేదని పేర్కొన్నారు.

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినప్పటికీ, దాన్ని 70 శాతానికి పైగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని కేటీఆర్ గుర్తుచేశారు. నగరంలో మెట్రో విస్తరణ మళ్లీ వేగం అందుకోవాలంటే కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావాల్సిందేనని అన్నారు.

రేవంత్ రెడ్డి పరిపాలనకు తుగ్లక్, హిట్లర్ స్ఫూర్తిగా మారారని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ప్రారంభించిన పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయడం తుగ్లక్ పాలనను గుర్తు చేస్తోందన్నారు. మూసీ ప్రాజెక్టు పేరుతో లక్షలాది మందిపై ప్రభావం చూపే చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు.

మూసీ ప్రాజెక్టుకు లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, గ్యారంటీల అమలుకు మాత్రం నిధులు లేవని చెప్పడం విడ్డూరమని విమర్శించారు.

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ కార్యకర్తల కష్టంతో గెలిచి, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రూ.9,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరిగాయని, గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నిధులు తీసుకొచ్చిందో ఎమ్మెల్యే ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

మళ్లీ శేరిలింగంపల్లిలో గులాబీ జెండా ఎగరాలంటే కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)పై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే రోజుకోసం ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
 

By
en-us Political News

  
పట్టుమని పదో తరగతి కూడా చదవకపోయినా, మన భౌగోళిక పరిస్థితులు, చారిత్రక శాసనాలు, ప్రాచీన ఆధారాలపై ఆయన సాధించిన పట్టు అసాధారణమైనది.
సాధారణంగా పుట్టిన బిడ్డకు కుటుంబ సభ్యులు బంగారు ఆభరణాలు బహుమతిగా ఇవ్వడం ఆనవాయితీ. అయితే అదే సంప్రదాయాన్ని ప్రభుత్వ స్థాయిలో అమలు చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది.
ఉద్యోగులకు మేలు చేసేలా తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల్లో పని చేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62కు పెంపు, 2004 సెప్టెంబర్ కు ముందు నోటిఫికేషన్లతో నియామకమైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
టాటా మోటార్స్ (కమర్షియల్ వెహికల్స్) ఇన్వెస్టర్ డే 2026 ప్రకటనలతో షేర్ ధర 5% పెరిగి రూ. 420 కి చేరింది. జెఎమ్ ఫైనాన్షియల్, నోమురా వంటి ప్రముఖ బ్రోకరేజ్ సంస్థల రేటింగ్స్, సరికొత్త టార్గెట్ ప్రైస్ వివరాలు ఇక్కడ చూడండి.
భారతీయ స్టాక్ మార్కెట్లో లార్జ్ క్యాప్ రికవరీ, ఐటీ రంగ సవాళ్లు మరియు ఫార్మా, ఆటో యాన్సిలరీ రంగాల్లోని పెట్టుబడి అవకాశాలపై యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ హెడ్ శ్రేయాష్ దేవర్కర్ ప్రత్యేక విశ్లేషణ.
మీ ఆదాయం తక్కువగా ఉన్నా ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసులు వచ్చే అవకాశం ఉందా? విద్యుత్ బిల్లు, బ్యాంకు డిపాజిట్లు, విదేశీ ప్రయాణాల ఆధారంగా ఐటీఆర్ దాఖలు చేయాల్సిన తప్పనిసరి నిబంధనల గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
15 ఏళ్ల బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. సచిన్ టెండూల్కర్ 36 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొడుతూ ఐర్లాండ్ సిరీస్‌లో హిస్టరీ సృష్టించనున్న వైభవ్ క్రేజ్, ఐపీఎల్ రికార్డులు మరియు మాజీ క్రికెటర్ నరసింహారావు చేసిన ఆసక్తికర వ్యాఖ్యల పూర్తి వివరాలు.
మీ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ నుండి టిడిఎస్ (TDS) కట్ కాకుండా ఉండాలంటే ఫామ్ 15G, ఫామ్ 15H ఎలా సమర్పించాలో మరియు కొత్తగా రాబోతున్న ఫామ్ 121 నియమాలను ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
తెలంగాణ టీ20 (TG20) లీగ్‌లో మెదక్ ఫాల్కన్స్ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ అజేయ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. 259 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి జట్టుకు విజయాన్ని అందించిన తిలక్ వర్మ మ్యాచ్ హైలైట్స్ మరియు హెచ్‌డీ ఫోటోలు ఇక్కడ చూడండి.
అర్జెంటీనాలో లియోనెల్ మెస్సీ క్రేజ్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. పటగోనియాలో 26 మీటర్ల భారీ విగ్రహంతో పాటు బ్యూనస్ ఎయిర్స్‌లో 1300 మంది అభిమానుల సంతకాలతో కూడిన అద్భుతమైన మురళీ పెయింటింగ్‌ను ఏర్పాటు చేశారు. ఆ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) సీజన్-5 మంగళగిరిలో ఘనంగా ప్రారంభం కానుంది. పెద్ది విజయంతో జోష్‌లో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా రానుండటంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. పూర్తి షెడ్యూల్ మరియు మ్యాచ్ వివరాలు ఇక్కడ చూడండి.
2026లో భారత ఐటీ రంగంలో భారీ పతనం నమోదైంది. TCS, ఇన్ఫోసిస్, విప్రో సహా టాప్ 10 ఐటీ స్టాక్స్ ఏకంగా 38% వరకు కుప్పకూలాయి. విదేశీ ఇన్వెస్టర్లు ₹60,000 కోట్లను వెనక్కి తీసుకోవడానికి గల కారణాలు, ఏ షేరు ఎంత శాతం నష్టపోయిందో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఆదాయం తక్కువగా ఉన్నా ఐటీఆర్ ఫైల్ చేయాలా? విదేశీ ఆస్తులు, రూ. 50 లక్షల బ్యాంక్ డిపాజిట్లు, రూ. 1 లక్ష కరెంట్ బిల్లు వంటి 9 కీలక నిబంధనలు మరియు AY 2026 27 ఆదాయపు పన్ను మార్గదర్శకాలను ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.