Publish Date:Oct 30, 2024
జన్వాడ పార్టీ రేవ్ పార్టీ కేసులో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల బుధవారం పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ కేసులో మోకిలా పోలీసులు రాజ్ పాకాల, విజయ్ మద్దూరీ పై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే రాజ్ పాకాల హైకోర్టును ఆశ్రయించి తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు తెచ్చుకున్నారు. అయితే పోలీసుల విచారణకు హాజరు కావాలని రాజ్ పాకలను కోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు రాజ్ పాకాలకు బుధవారం (అక్టోబర్ 30) విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. పోలీసుల నోటీసు మేరకు రాజ్ పాకాల తన న్యాయవాదితో కలిసి పోలీసుల ఎదుట హాజరు కానున్నారు.
ఇలా ఉండగా ఇదే కేసులో విజయ్ మద్దూరి అనే వ్యాపార వేత్త నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోని విజయ్ మద్దూరి నివాసంలో మోకిల పోలీసులు సోదాలు నిర్వహించారు. జన్వాడ పార్టీలో విజయ్ మద్దూరి డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు తేల్చుకున్న పోలీసులు ఆయనక కొకైన్ ఎలా ఎక్కడ నుంచి వచ్చిందన్న విషయంలో ఆరా తీస్తున్నారు. విచారణలో విజయ్ మద్దూరి స్వయంగా తనకు కొకైన్ రాజ్ పాకాల ఇచ్చినట్లు చెప్పారని పోలీసులు ఎప్ఐఆర్ లో పేర్కొన్నారు. అయితే విజయ్ మద్దూరి ఆ విషయాన్ని ఖండించారు. ఈ నేపథ్యంలో విజయ్ మద్దూరి నివాసంలో పోలీసుల సోదాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ktr-bil-to-attend-police-inquiry-25-187657.html
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.