విద్యార్థినులపై లైంగిక వేధింపులు: కాంగ్రెస్ ఎంపీ, ప్రొఫెసర్‌పై వేటు.!

Publish Date:Oct 9, 2026

Advertisement

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం  లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, ప్రస్తుతం మణిపూర్ లోక్‌సభ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న అంగోమ్‌చా బిమోల్ అకోయిజమ్‌ను జేఎన్‌యూ యాజమాన్యం సర్వీసు నుంచి తక్షణమే డిస్మిస్ చేస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. క్యాంపస్‌లో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే తీవ్రమైన ఆరోపణలు రావడంతో విశ్వవిద్యాలయం ఈ కఠిన చర్యలు తీసుకుంది. ఈ మేకు వైస్ ఛాన్సలర్ శాంతి డి. పండిట్ సంతకంతో అధికారిక ఆదేశాలు వెలువడ్డాయి.

ఈ కేసుకు సంబంధించి జేఎన్‌యూలోని ఇంటర్నల్ కమిటీ (IC) అత్యంత లోతుగా విచారణ జరిపింది. ఈ విచారణలో భాగంగా మొత్తం 11 మంది మహిళా విద్యార్థినులు ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదులు చేశారు. ప్రొఫెసర్ అకోయిజమ్ క్యాంపస్‌లోని తన నివాసానికి సమావేశాలు లేదా ప్రత్యేక సమావేశాల పేరుతో విద్యార్థినులను ఆహ్వానించి, అక్కడ వారిపై వేధింపులకు పాల్పడ్డారని బాధితులు తమ ఫిర్యాదుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాకుండా, తరగతి గదుల్లోనూ, వైవా (viva) పరీక్షల సమయంలోనూ అసభ్యకరమైన, అశ్లీల వ్యాఖ్యలు చేస్తూ విద్యార్థినులను ఇబ్బంది పెట్టారని విచారణలో వెల్లడైంది.

ఇంటర్నల్ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా, సర్వీస్ నిబంధనలు  సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (వర్గీకరణ, నియంత్రణ మరియు అప్పీలు) నిబంధనల లోని రూల్ 11(ix) ప్రకారం ప్రొఫెసర్‌కు ప్రధాన శిక్షను ఖరారు చేశారు. అన్ని వాస్తవాలను, సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన తదుపరి విశ్వవిద్యాలయం ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పరిణామంతో విద్యా వర్గాలలోనూ, రాజకీయ వాతావరణంలోనూ ఒక్కసారిగా పెను ప్రకంపనలు రేగాయి. విద్యా సంస్థల్లో మహిళా భద్రత, పవిత్రతను కాపాడే దిశగా వెలువడిన ఈ కఠినమైన నిర్ణయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

 

 

 

[ JNU professor dismissed, Congress MP sexual harassment, Angomcha Bimol Akoijam, JNU sexual harassment inquiry, JNU news Telugu, Lok Sabha MP sacked JNU, Telugu One, Telugu News ]

By
en-us Political News

  
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.