రాజకీయాల్లోనూ రాజే.. కానీ.. స్టెప్పులే ప్చ్!

Publish Date:Sep 13, 2022

Advertisement

తెలుగు సినీ రంగం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన హీరోలు, నిర్మాతలు చాలా మందే ఉన్నారు. అందులో కొందరు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా అయ్యారు. అయినా, అందులో మంత్రులై ఓ వెలుగు వెలిగిన వారు మాత్రం అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఆ కొద్ది మందిలో రెబల్ స్టార్ గా సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన కృష్ణంరాజు ఒకరు. నిజానికి కృష్ణం రాజు కంటే ముందు ఆయన తర్వాత కూడా కొంగర జగ్గయ్య మొదలు మోహన్ బాబు , నిర్మాత రామానాయుడు   వరకు, నటశేఖర కృష్ణ మొదలు సత్యనారాయణ వరకు మురళీ మోహన్ మొదలు మెగాస్టార్ చిరంజీవి వరకు, జమున, ఊర్వశి శారద మొదలు విజయశాంతి, జయప్రద వరకు ఇలా పార్లమెంట్ గడప తొక్కిన సినీ ప్రముఖులు చాలా మందే ఉన్నారు. అయితే కేంద్రలో మంత్రి పదవికి చేరుకున్నది మాత్రం  కృష్ణం రాజు, ఆయన తర్వాత చిరంజీవి. ఈ ఇద్దరిని మాత్రమే మంత్రి పదవి వరించింది. 

అయితే, రెబెల్ స్టార్ సినిమా జీవితం ఆయన నటించిన సినిమాలు, చేసిన  పాత్రల విషయాన్ని పక్కన పెట్టి, రాజకీయ జీవితం విషయానికి వస్తే, కృష్ణం రాజు రాజకీయాల్లో ఎక్కడా స్థిరంగా నిలబడలేక పోయారు. సినిమాల్లో నవరసాలు, ముఖ్యంగా రౌద్ర రసాన్ని అద్భుత్వంగా పండించిన కృష్ణం రాజు, పాటలు స్టెప్పులు దగ్గర కొచ్చే సరికి తడబడి పోయేవారని, స్టెప్పులు సరిగా పడేవి కావని అంటారు. రాజకీయాల్లోనూ అంతే, ఆయన స్టెప్పులు సరిగా పడలేదు. నడక సరిగా సాగలేదు. ఏ పార్టీలోనూ స్థిరంగా నిలబడలేదు. అందుకే ఆయన రాజకీయ రంగంలో ఆశించిన పదవులను అందుకోలేక పోయారు. 

నిజానికి కృష్ణం రాజనే కాదు,సినిమా హీరోలు చాలా వరకు రాజకీయాల్లో అంతగా రాణించలేక పోవడానికి నిలకడలేని తనం కూడా ఒక కారణమని  విశ్లేషకులు అంటారు. కృష్ణం రాజు తర్వాత కేంద్ర మంత్రి స్థాయికి చేరిన హీరో చిరంజీవి విషయాన్నే తీసుకుంటే, ఆయనా అంతే... ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఒక్క ఎన్నికల్లో ఓడి పోగానే, పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ గంగలో కలిపేశారు. అఫ్కోర్స్, అలా కాంగ్రెస్ లో కలిపేశారు కాబట్టే మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఆయన మంత్రి అయ్యారనుకోండి అది వేరే విషయం. అదలా ఉంటే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన మెగా స్టార్, ఆ పార్టీలోనూ నిలవలేదు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత, ఆ పార్టీని వదిలేశారు. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నా మళ్ళీ అటుకేసి కన్నెత్తి అయినా చూడలేదు. వేషం మార్చి మళ్ళీ రంగుల ప్రపంచంలోకి వచ్చేశారు. 

కృష్ణం రాజు కూడా అంతే, 1991 సార్వత్రిక ఎన్నికలకు ముందు, రాజకీయ అరంగేట్రం చేశారు. నరసాపురం లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేశారు. తెలుగు దేశం పార్టీ అభ్యర్ధి భూపతిరాజు విజయ్ కుమార్ రాజు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చున్నారు. 1998లో కాకినాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి సమీప తెలుగుదేశం అభ్యర్ధి తోట గోపాలకృష్ణపై 67,799 ఓట్ల భారీ అధిక్యంతో గెలుపొందారు. అదే సమయంలో కేంద్రలో అటల్ బిహారీ వాజపేయి సారధ్యంలో బీజేపీ సంకీర్ణ ప్రభుతం ఏర్పడింది. అయితే, సంవత్సరం తిరగకుండానే మళ్ళీ ఎన్నికలు రావడంతో, ఆయన 1999 ఎన్నికల్లో నరసాపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై పోటీచేసి  1,65,948 ఓట్ల రికార్డు మెజారిటీతో విజయం సాధించారు. అంతే కాదు, కేంద్ర మంత్రి వర్గంలో స్థానం సంపాదించుకున్నారు.

ఆ విధంగా తెలుగు సినిమా రంగం నుంచి కేంద్ర మంత్రి వర్గంలో స్థానం సంపాదించిన తొలి హీరోగా మరో రికార్డ్ సొంతం చేసుకున్నారు. 2000 నుంచి 2004 వరకు అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. తొలుత కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా 2000 సెప్టెంబర్ 30 నుంచి 2001 జులై 22వరకు సేవలందించారు.ఆ తర్వాత 2001 జులై నుంచి 2002 జులై వరకు ఏడాది పాటు రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2002 జులై 1 నుంచి వినియోగదారుల వ్యవహరాలు, ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రిగా, 2003 జనవరి 29 నుంచి 2004 మే 22 వరకు కేంద్ర గ్రామీణాభివద్ధి శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు.  2004లో తిరిగి నరసాపురం లోక్ సభ నుంచి ఏంపీగా పోటీచేసి.. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ కు చెందిన చేగొండి వెంకట హరిరామ జోగయ్య చేతిలో ఓటమి చెందారు. 

ఆ తర్వాత కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్న కృష్ణం రాజు, 2009 మార్చిలో ప్రజారాజ్యం పార్టీలో చేరారు.  రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో తిరిగి ఆయన 2013లో అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. అయినా, ఆయన 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేయలేదు. గవర్నర్ పదవి ఆశించారు కానీ, అదీ దక్కలేదు. చివరకు ఆ కోరిక తీరకుండానే, లోకాన్ని విడచి వెళ్ళిపోయారు.

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.