కేసీఆర్ తో కొండా దంపతులకు గొడవ ఇదే?  హుజురాబాద్ పోటీపై క్లారిటీ..

Publish Date:Sep 9, 2021

Advertisement

కొండా దంపతులు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఫ్రైర్ బ్రాండ్ లీడర్లుగా ముద్ర పడిన వారు. కొండా సురేఖ మంత్రిగా... కొండా మురళీ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలను శాసించారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కొండా దంపతుల రాజకీయ జీవితం అనేక మలుపులు తిరిగింది. మొదట వైఎస్ జగన్ కు మద్దతుగా నిలిచారు. రాష్ట్ర విభజన తర్వాత వైసీపీకి గుడ్ బై చెప్పి.. ఎవరూ ఊహించని విధంగా టీఆర్ఎస్ లో చేరారు. 2014 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. కేసీఆర్ కేబినెట్ లో మంత్రి పదవి వస్తుందని భావించినా రాలేదు. తర్వాత కేసీఆర్ తో విభేదాలు రావడంతో 2018 ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్ లో చేరారు కొండా దంపతులు. కాని గత అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేసిన కొండా సురేఖ ఘోరంగా ఓడిపోయారు. 

2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంత కాలం రాజకీయాల్లో యాక్టివ్ గా పాల్గొనలేదు కొండా దంపతులు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియమాకం తర్వాత మళ్లీ స్పీడ్ పెంచారు. నిజానికి గతంలో రేవంత్ రెడ్డితో వాళ్లకు తీవ్ర విభేదాలుండేవి. కాని ప్రస్తుతం రేవంత్ రెడ్డికి ప్రధాన మద్దతుదారులుగా మారిపోయారు కొండా దంపతులు. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కొండాను బరిలోకి దింపి తన సత్తా చాటాలని యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తారంటూ తమపై జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు కొండా దంపతులు. అంతేకాదు సీఎం కేసీఆర్ తో తమకు గ్యాప్ ఎందుకు వచ్చిందో చెప్పారు. అంతేకాదు టీఆర్ఎస్ లో కేసీఆర్ వ్యవహారశైలిపై సంచలన వ్యాఖ్యలు చేశారు కొండా దంపతులు. 

టీఆర్ఎస్ నేతలు అంతా కేసీఆర్ కు ఊడిగం చేసేవారే  అన్నారు కొండా మురళీ. వరంగల్ దళితులకు కూడా దళితబంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే వందలారీల్లో జనాలను తీసుకెళ్లి హుజురాబాద్ లో నామినేషన్ వేయిస్తా అన్నారు. టీఆర్ఎస్ లో దళిత నేతలకు సిగ్గుంటే రాజీనామా చేయాలన్నారు. 2018లో కొండా సురేఖకు ఓడించేందుకు 500 కోట్లు కేసీఆర్ ఖర్చు చేశారని కొండా మురళీ ఆరోపించారు. ఇప్పుడు ఈటల రాజేందర్ ను ఓడించేందుకు వేలకోట్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు.  కేసీఆర్ దగ్గర బూట్లు విడవలేదనే తనపై  కక్ష కట్టాడంటూ సంచలన ఆరోపణలు చేశారు కొండా మురళీ. వరంగల్ కు చెందిన టీఆర్ఎస్ కార్పోరేటర్లు తన కాళ్ళు పట్టుకుని టికెట్ అడుక్కుని తన కాళ్లే లాగేశారన్నారు. కాంగ్రెస్ లో గట్టినేతలను డమ్మీ చేసేందుకే మమ్ములను అప్పుడు టీఆర్ఎస్ లో చేర్చుకున్నారని సురేఖ అన్నారు. కొండా సురేఖకు మంత్రి పదవి ఇస్తే గట్టిగా మాట్లాడుతుందని ఐదేళ్లు మంత్రి పదవి ఇవ్వకుండా దాటవేశారని ఆరోపించారు. కేసీఆర్ అసలు స్వరూపం తెలుసుకుని బయటకు వచ్చామని తెలిపారు.

హుజురాబాద్ ఉప ఎన్నికలో పోటీపైనా మురళీ క్లారిటీ ఇచ్చారు. హుజురాబాద్ లో కొండా సురేఖకు పోటీచేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం అడుగుతోందంటే తమపై ఎంత నమ్మకముందో అర్థం చేసుకోవాలన్నారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్, బీజేపీ కి గట్టీ పోటీ ఇవ్వాలంటే కొండా సురేఖ కరెక్ట్ అని  కాంగ్రెస్ నేతలు  అంటున్నారని సురేఖ చెప్పారు. ఒకవేళ తాను హుజురాబాద్ లో పోటీచేసినా... మళ్లీ వరంగల్ కే వస్తానని క్లారిటీ ఇచ్చారు. అలాంటి హామీ వస్తేనే హుజూరాబాద్ లో పోటీచేస్తానని పీసీసీ చెప్పానని తెలిపారు.  గత ఎన్నికల్లో పరకాలకు వెళ్లి తప్పుచేశామన్నారు కొండా సురేఖ. కానీ ఇకపై వరంగల్ లోనే ఉంటామని స్పష్టం చేశారు.   

By
en-us Political News

  
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.