కాంగ్రెస్ పార్టీతో కోమటిరెడ్డి తెగదెంపులు .. త్వరలో బిజెపి తీర్థం? 

Publish Date:Jun 25, 2024

Advertisement

తెలంగాణ  కాంగ్రెస్ పార్టీకి కోమటి రెడ్డి ఉద్వాసన పలుకుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజీనామా చేయబోతున్నారని త్వరలోనే బిజెపి తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు  కోమటిరెడ్డి వెంకటరెడ్డి  ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు.  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి మెజార్టీతో గెలుపొందింది. పార్లమెంటు ఎన్నికలలో బిజెపి 8 స్థానాల్లో గెలుపొందింది. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బిజెపి నుంచి కాంగ్రెస్ లో చేరి గెలుపొందారు. ఇక నేడు ఆయన ఫైనల్ డెసిషన్ తీసుకొని కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారని, కొద్ది రోజుల్లోనే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే గనుక జరిగితే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలినట్టే రాజకీయ విశ్లేషకులు. అంటున్నారు. 
రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ , బిజెపిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కాంగ్రెస్ మంత్రి కోమటి వెంకట్ రెడ్డి మర్యాదపూర్వకంగా ఢిల్లీలో కలుసుకున్నారు. కొద్ది సేపటి తర్వాత తెలంగాణ బిజెపి చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఒకే రోజు ఇద్దరు కేంద్ర మంత్రులను కులుసుకోవడం కాంగ్రెస్ మంత్రి కలుసుకోవడం చర్చనీయాంశమైంది. త్వరలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చేరనున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. 
ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్న కోమటిరెడ్డి కాంగ్రెస్ కు దూరమౌతున్నట్లు తెలుస్తోంది. 
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిగ్ షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర మనస్తాపంతో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీని వీడటం కోసం రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది.
గతంలో తెలంగాణ పిసిసి చీఫ్, ఏఐసిసి పదవులు ఆశించిన ఆయన తనకు పదవులు లభించకపోవడంతో భంగపడ్డారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని కోమటిరెడ్డి బాహాటంగా వ్యతిరేకించారు. రేవంత్ రెడ్డికి టీపీసీసీ ఇవ్వటంపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అప్పుడే ఆయన పార్టీ మారతారని ప్రచారం అరిగ్గింది. దీంతో పాటు సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బిజెపి తీర్థం పుచ్చుకున్న సమయంలో కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ మారతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
తమ్ముడిని గెలిపించటం కోసం పని చేస్తున్నారని ఆయన కాంగ్రెస్ శ్రేణుల నుండి కూడా పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదుర్కొన్నారు. ఆయన ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఆయన తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని తేల్చి చెప్పారు. అయినప్పటికీ తమ్ముడు ఎఫెక్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై తీవ్రంగా పడింది. కాంగ్రెస్ పార్టీ నేతలతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూరం మరింత పెరిగింది.

By
en-us Political News

  
పార్లమెంట్‌లో కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న వేళ ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు (83) కన్నుమూశారు.
హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ మాజీ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్‌ను హత్య చేసేందుకు జరిగిన భారీ కుట్రను బోరబండ పోలీసులు భగ్నం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది.
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచడం వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు చేపట్టిన నషా ముక్త్ భారత్ యాత్రకు ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
తమిళనాడులో సంచలనం సృష్టించిన మహిళా ఐఏఎస్ అధికారిణి వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.