ఆప్ సీఎం అభ్య‌ర్థిగా కోదండ‌రాం?.. కేసీఆర్‌కు బిగ్ షాక్‌!?.. సారొస్తారొస్తారా?

Publish Date:Mar 28, 2022

Advertisement

మోదీకే స‌వాల్ విసురుతున్న మొన‌గాడు కేజ్రీవాల్‌. బీజేపీకే కొరుకుడుప‌డ‌ని ఆమ్ఆద్మీ పార్టీ.. ఇప్పుడు హ‌స్తిన నుంచి యావ‌త్ దేశాన్ని త‌న చీపురుతో ఊడ్చేయాల‌ని చూస్తోంది. ఢిల్లీ త‌ర్వాత‌ పంజాబ్‌లో పాగా వేసింది. నార్త్‌లోనే కాదు సౌత్ ఇండియాపైనా ఫోక‌స్ పెట్టింది. ద‌క్షిణాదిలో ఆప్ మెయిన్ టార్గెట్ తెలంగాణ‌నే అంటోంది. 

ఇటీవ‌ల కేజ్రీవాల్‌ను క‌లిసేందుకు ఢిల్లీ వెళ్లిన కేసీఆర్‌కు చుక్క‌లు చూపించారు. రెండు మూడు రోజుల పాటు త‌ప్పించుకు తిరిగారు. ఇక లాభంలేద‌ని కేజ్రీవాల్‌ను క‌ల‌వ‌కుండానే కేసీఆరే ఢిల్లీ నుంచి ఉత్త‌చేతుల‌తో తిరిగొచ్చేశారు. ఆయ‌న అప్పుడు ఎందుక‌లా గులాబీ బాస్‌కు ముఖం చాటేశారో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. తెలంగాణ‌లో పాగా వేసేందుకు ప‌రిస్థితులు ఆమ్ఆద్మీ పార్టీకి అనుకూలంగా ఉన్నాయ‌ని కేజ్రీవాల్ భావిస్తున్నారు. అందుకే, ఉత్త‌రాది త‌ర్వాత ఆప్ ప్ర‌ధానంగా తెలంగాణ‌పైనే దృష్టి సారించింది. అందులో భాగంగానే కేజ్రీవాల్ త‌న ప్ర‌ధాన అనుచ‌రుడు, ఆప్ కీల‌క నేత సోమనాథ్ భార‌తికి తెలంగాణ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. త్వ‌ర‌లోనే కేజ్రీవాల్ సైతం తెలంగాణ‌లో పాద‌యాత్ర చేస్తారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. 

అస‌లే మాజీ ఐఆర్ఎస్ అధికారి. మోదీ-బీజేపీల‌కే ఢిల్లీలో ఢ‌క్కామొక్కీలు తినిపించిన లీడ‌ర్‌. బెస్ట్ సీఎంగా ప్ర‌జ‌ల మన్నన‌ పొందుతున్న మిస్ట‌ర్ క్లీన్‌. ఢిల్లీని అప్పులు లేని రాష్ట్రంగా మార్చిన సీఎం. న‌గ‌ర‌వాసుల‌కు ఉచితంగా నీళ్లు-క‌రెంట్‌ ఇస్తున్నారు. త్వ‌ర‌లోనే 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పిస్తామంటూ ఇటీవ‌ల విజ‌న్ కూడా ప్ర‌క‌టించారు. ఈ ఘ‌న‌చ‌రిత్ర చాల‌దా.. తెలంగాణ‌లో ఆప్ పాతుకుపోవ‌డానికి. తెలంగాణ రాష్ట్రం సాధించుకుందే నీళ్లు, నిధులు, నియామ‌కాల కోసం. ఆ మూడింటినీ ఢిల్లీలో చేసి చూపించారు సీఎం కేజ్రీవాల్‌. ఆ మూడు డిమాండ్ల‌నూ కాల‌రాసి.. ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ ప్ర‌జ‌ల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. ఆ లెక్క‌న ఈ ఇద్ద‌రు సీఎంల‌ను పోల్చి చూస్తే.. తెలంగాణ‌కు కావాల‌సింది కేజ్రీవాల్ లాంటి ముఖ్య‌మంత్రే. ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీనే.

మ‌రి, కేజ్రీవాల్‌ను చూసి తెలంగాణ‌లో ఓటు వేస్తారా? అంటే క‌ష్ట‌మే. ఆయ‌నెలాగూ ఢిల్లీకే సీఎంగా ఉంటారు కాబ‌ట్టి, ఆయ‌న‌తో నేరుగా తెలంగాణకు ఏం ప్ర‌యోజ‌నం అనే డౌట్ రావొచ్చు. అందుకే, ఉద్య‌మ రాష్ట్రంలో కేజ్రీవాల్ మాదిరే మిస్ట‌ర్ క్లీన్ ఇమేజ్ ఉన్న ఉన్న‌త విద్యావేత్త‌, సౌమ్యుడు, ఎలాంటి అవినీతి మ‌కిలి అంట‌ని నిఖార్సైన నాయ‌కుడిని ఆప్ త‌మ తెలంగాణ నేత‌గా ఎంచుకుంద‌ని తెలుస్తోంది. ఆయ‌నే ప్రొఫెస‌ర్ కోదండ‌రాం. టీజేఎస్‌ను ఆప్‌లో క‌లిపేసుకొని.. సార్‌ను చీపురు పార్టీ చీఫ్ మినిస్ట‌ర్ కేండిడేట్‌గా కేసీఆర్‌పై ప్ర‌యోగించాల‌నేది కేజ్రీవాల్ మాస్ట‌ర్ ప్లాన్‌గా తెలుస్తోంది. 

అవును, నిజ‌మే. ప్రొ. కోదండ‌రాంకు ఆమ్ఆద్మీపార్టీ గ్రాండ్ వెల్‌క‌మ్ చెప్పింద‌ని స‌మాచారం. ఉద్య‌మంలో ఏర్ప‌డిన రాష్ట్రానికి.. ఉద్య‌మ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కోదండ‌రాం అయితేనే క‌రెక్ట్ ప‌ర్స‌న్ అనేది ఆప్ లెక్క‌. కోదండ‌రాంకు ఉన్న‌ కేసీఆర్ స్థాయి ఇమేజ్.. మిస్ట‌ర్ క్లీన్ పాపులారిటీ.. ఆప్‌కు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అంచ‌నా. తెలంగాణ జ‌న స‌మితిని ఆప్‌లో విలీనం చేసి ముందుకొస్తే.. త‌మ పార్టీ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ముందుంచుతుంద‌ని.. కోదండ‌రాంకు ఇప్ప‌టికే కేజ్రీవాల్ నుంచి ఆఫ‌ర్ వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌తిపాద‌న బాగానే ఉండ‌టంతో సార్ త‌న స‌న్నిహితుల‌తో స‌మాలోచ‌న‌లు చేస్తున్నార‌ట‌. నార్త్ పార్టీకి తెలంగాణ‌లో ఏ మేర‌కు ఆధ‌ర‌ణ ఉంటుంది?  సొంత పార్టీ కాకుండా ఇలా వేరే పార్టీలో విలీనం అయితే త‌న‌కు ఏ మేర‌కు ప్రాధాన్యం ఉంటుంది? త‌దిత‌ర లాభ‌న‌ష్టాల‌ను బేరీజు వేసుకుంటున్నార‌ని అంటున్నారు. ఆప్‌లో విలీనంపై కోదండ‌రాం సార్‌ త్వ‌ర‌లోనే ఓ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.  

మ‌రోవైపు, కోదండ‌రాంతో పాటు ఉద్య‌మంలో ప‌ని చేసిన ప‌లువురు ప్రొఫెస‌ర్లు, ఉద్యోగ సంఘాల నేత‌లు, అప్ప‌టి విద్యార్థి నాయ‌కులనూ, త‌ట‌స్థుల‌నూ ఆప్ వ‌ర్గాలు సంప్ర‌దిస్తున్నాయి. ఎన్నారైలు, కార్మిక సంఘ‌ నేత‌లూ సోమ్‌నాథ్ భార‌తితో ట‌చ్‌లోకి వ‌చ్చార‌ని తెలుస్తోంది. ఒక‌వేళ ఆప్ ప్ర‌పోజ‌ల్‌కి కోదండ‌రాం ఓకే చెబితే.. మిగ‌తా వారూ ఆయ‌న వెంటే ఆప్‌లో చేరే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. కోదండ‌రాం సార్ సీఎం కేండిడేట్ అని ప్ర‌క‌టిస్తే.. మిగ‌తా పార్టీల్లోని ప‌లువురు అసంతృప్త నేత‌లూ కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా చీపురు ప‌ట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే, ఎవ‌రొస్తే వారిని పార్టీలో చేర్చుకోకుండా.. కాస్త గుడ్ ఫీడ్‌బ్యాక్ ఉండే నాయ‌కుల‌కే ఆప్ కండువా క‌ప్పాల‌నేది ఆ పార్టీ స్ట్రాట‌జీ. మొత్తానికి తెలంగాణ‌లో ఆమ్ఆద్మీల భ‌విత‌వ్యం కోదండ‌రాం గ్రీన్ సిగ్న‌ల్ మీద ఆధార‌ప‌డి ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇంత‌కీ సారొస్తారా..? సీఎం సార్ ప‌ని ప‌డ‌తారా? 

ఇప్ప‌టికే రేవంత్‌రెడ్డి, బండి సంజ‌య్‌ల నేతృత్వంలో కాంగ్రెస్‌, బీజేపీలు కేసీఆర్‌పై దండ‌యాత్ర చేస్తున్నాయి. ఇటు ష‌ర్మిల‌, అటు ప్ర‌వీణ్ కుమార్‌లు సైతం దొర‌పై కొట్లాడుతున్నారు. ఇప్పుడు ఆప్‌-కోదండ‌రాంలు సైతం ముందుకొస్తే.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు వీరంద‌రి మ‌ధ్య చీలిపోయి.. చివ‌రాఖ‌రికి మ‌ళ్లీ  కేసీఆర్‌నే ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ప‌ర్మినెంట్ చేస్తే..?

By
en-us Political News

  
బీఎస్పీ గతంలో నాలుగుసార్లు అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ ..2027 ఎన్నికలలో ప్రజలు మరోసారి బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని ఆశపడుతున్నారన్నారు. యూపీలో బీఎస్పీ ఐదో సారి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాను మాయావతి వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో టీడీపీకి ఒక బెర్త్ క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో టెండరింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందనీ, కేవలం మైనింగ్ మాత్రమే కాకుండా, విద్యుత్, ఇరిగేషన్, రోడ్లు ఇలా ప్రతి రంగంలోనూ నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెడుతూ అడ్డగోలు దోపిడీకి తలుపులు బార్లా తెరిచారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
జగన్ పాలనా వైఫల్యాలు అంటూ వైసీపీయులు కలలో కూడా అంగీకరించడానికి సాహసించని మాటలను పేర్ని నాని నోటి వెంట రావడం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. జగన్ పాలనా వైఫల్యం కారణంగానే 2019 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని పేర్ని నాని యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించేశారు.
రాజకీయాల్లో నాయకులపై విమర్శలు, ఆరోపణలు సహజం. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం అన్నది సాధారణంగా అధకారంలో ఉన్న వారిపై కంటే అధికారంలో లేని వారిపైనే ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఈ పద్ధతిని బ్రేక్ చేసి.. ఇది ప్రజాస్వామ్యం, తన, పర తేడా లేకుండా ఎవరిపై ఆరోపణలు వచ్చినా విచారణ జరుపుతామని,తప్పు చేశారని నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ చెబుతున్నారు.
ముంబైపై పట్టు సాధించడమే లక్ష్యంగా థాక్రే బదర్స్ కలవడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ-షిండే కూటమి విజయం సాధించే అవకాశం ఉందని తెలినప్పటికీ, థాక్రేల కలయిక నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ముంబై వాసులలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.
రాష్ట్రంలో మునిసిపోల్స్ దగ్గర పడుతున్న తరుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శుక్రవారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిర్మల్ జిల్లాలో సదర్ ఘాట్ బ్యారేజీకి, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కోరట పంప్ హౌస్ కు ప్రారంభోత్సవం చేయనున్నారు.
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.