గుడివాడలో షాడో మినిస్టర్.. నాని రైట్‌హ్యాండ్ ఓవరాక్షన్!?
Publish Date:Mar 28, 2022
Advertisement
గుడివాడ అంటే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఇలాకా. అలాంటి మంత్రిగారి ఇలాకాలో ఓ షాడో.. అన్నీ తానై చక్రం తిప్పుతుండడంతో నియోజకవర్గ ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మంత్రి కొడాలి నాని రైట్ హ్యాండ్ దుక్కిపాటి శశిభూషణ్.. అరాచకానికి గుడివాడ నియోజకవర్గం అడ్డాగా మారిందని.. నియోజకవర్గ ప్రజలే ఆరోపిస్తున్నారు. ఇటీవల గుడివాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆడపా బాబ్జీ మృతికి కూడా ఈ దుక్కిపాటి శశిభూషనే కారణమనే ఓ టాక్ అయితే గుడివాడలో వైరల్ అవుతోంది. ఆడపా బాబ్జీని తీవ్ర మానసిక వేదనకు గురి చేయడం ఈ దుక్కిపాటి శశిభూషణ్ వందకు వంద శాతం విజయం సాధించాడనే చర్చ అయితే గుడివాడ పట్టణంలో తాజా తాజాగా నడుస్తోంది. అంతేకాదు.. ఆడపా బాబ్జీ మృతికి సరిగ్గా వారం రోజుల ముందు... ఓ నిరుపేద కుటుంబం తమకు మాట సాయం చేయాలంటూ.. కొడాలి నాని ముఖ్య అనుచరుల్లో ఒకరైన బాబ్జీని కలిసింది. స్వతహాగా అందరికీ సాయం చేసే గుణమున్న బాబ్జీ.. ఎప్పటిలాగే గుడివాడ ఎమ్మార్వో వద్దకు ఆ కుటుంబాన్ని తీసుకు వెళ్లారు. మీరు వస్తే.. ఏ పని చేయద్దన్నారంటూ ఎమ్మార్వో చెప్పడంతో.. బాబ్జీ హతాశుడయ్యాడట. అందుకు సంబంధించి మంత్రిగారి కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు తమకు వచ్చాయని బాబ్జీకి ఎమ్మార్వో వివరించారని.. దీంతో ఆయన తీవ్ర కలవరానికి గురయ్యారట. ఇదే విషయంపై ఆయన మరో సారి ఎమ్మార్వోతో మాట్లాడబోతే.. మీరు వెళ్లి.. దుక్కిపాటి శశిభూషణ్‌తో మాట్లాడుకొండంటూ ఆ అధికారి .. బాబ్జీకి ఉచిత సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓ సామాజిక వర్గానికి నేతగా ఉన్న బాబ్జీ.. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడేంటిలా జరుగుతోందంటూ.. ఆయన ఆలోచనలో పడ్డారని.. ఆ క్రమంలో దీనిపై ఆయన కూపీ లాగడం మొదలు పెట్టగా.. చాలా విషయాలు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. కొడాలి నాని కోసం కోట్ల రూపాయిలనే కాదు.. మనుషులను సైతం పొగట్టుకున్నామని.. అలాంటిది ఇప్పుడు మంత్రి కొడాలి నాని ఇంత దుర్మార్గానికి ఒడి గడతారా? అంటూ ఆయన సామాజికవర్గంలోని పలువురు పెద్దలను కలిసి.. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలన్ని వారికి వివరించగా.. ఇదేదో మంత్రి నానితోనే స్వయంగా తేల్చుకోవాలంటూ వారు సూచించారని... దీంతో ఆ పంచాయతీ కాస్తా.. కొడాలి నాని వద్దకు చేరింది. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నానికి. బాబ్జీ పలు ప్రశ్నలు సంధించారని.. ఆ క్రమంలో దుక్కిపాటి శశిభూషణ్ అంశం కూడా ఈ సందర్భంగా బాబ్జీ తీసుకు వచ్చారని తెలుస్తోంది. ప్రభుత్వంలోని ఏ విభాగంలో కూడా తనకు పని చేయవద్దంటూ.. మీ కార్యాలయం నుంచే స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయనే టాక్ ఆయా కార్యాలయాల్లోనే కాకుండా బయట కూడా వినిపిస్తోందని కొడాలి నానిని బాబ్జీ నిలదీయగా.. ఊరుకో.. బాబ్జీ.. ఊరుకో అంటూ అయన్ని సముదాయించే ప్రయత్నం అయితే చేశారట మంత్రి నాని. అలా సీరియస్‌గా ఇంటికి వచ్చేసిన బాబ్జీ... ఈ కొడాలి నానిని నమ్ముకుని జీవితాన్ని ఆయన కోసం ధారపోశానని.. చివరకు ఇలా జరిగిందంటూ బాబ్జీ తీవ్ర మానసిక క్షోభకు గురైనట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఆయన తీవ్ర ఆనారోగ్యానికి గురై మరణించినట్లు సమాచారం. గుడివాడ పట్టణ రాజకీయంపై ఆడపా బాబ్జీకి మంచి పట్టు ఉంది. స్వతహాగా మంచి మనిషి.. అందరికీ సాయం చేసే గుణం ఆయన సొంతం. దీంతో ఆయన వైపు యువత అంతా ఆకర్షితులయ్యారు. అలా గుడివాడలో యువతను ఒకే తాటిపైకి తీసుకురావడంతో.. ఆయన మాటే.. ఆ యువతకు వేదవాక్కు అయింది. ఆ క్రమంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. కొడాలి నానికే ఓటు వేసేలా బాబ్జీ.. యువతను సమాయత్తం చేస్తుండేవారు. దీంతో కొడాలి నాని గెలుపు.. గత నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో అప్రతిహతంగా సాగుతూ వస్తోంది. కానీ కొడాలి నాని రాజకీయ అభ్యున్నతికి కారణమైన బాబ్జీ మృతికి మళ్లీ మంత్రి గారే కారణం అయ్యారంటూ ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. బాబ్జీ మృతి వల్ల రాజకీయంగా నష్టపోయిందీ..కొడాలి నాని మాత్రమేననే చర్చ అయితే గుడివాడలో బాగా వైరల్ అవుతోంది.
http://www.teluguone.com/news/content/gudiwada-ycp-leader-over-action-39-133617.html





