పవన్ కల్యాణ్ గంగిరెద్దు! రెచ్చిపోయిన ఏపీ మంత్రి..
Publish Date:Oct 10, 2021
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వ్యక్తిగత దూషణలు ఆపడం లేదు ఇరు పార్టీల నేతలు. జనసేన చీఫ్ టార్గెట్ గా ఏపీ మంత్రులు దాడి కొనసాగిస్తున్నారు. తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోఉండే కొడాలి నాని మరోసారి రెచ్చిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా అడ్రస్ లేదన్నారు కొడాలి నాని. భవిష్యత్ లోనూ ఉండదని హెచ్చరించారు. 'జగన్ మిమ్మల్ని చీల్చి చెండాడుతాడు' అంటూ కొడాలి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసిన చేసిన చంద్రబాబు.. స్థానిక ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారన్నారు నాని. బద్వేలు ఉప ఎన్నిక నుంచి పారిపోయాడన్నారు. పద్నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు.. తానిచ్చిన ఒక్క మాటను కూడా నిలబెట్టుకోలేని దద్దమ్మగా కొడాలి నాని విమర్శించారు. లోకేశ్ పై నమ్మకం లేకే దత్తపుత్రుడు పవన్ వైపు చంద్రబాబు చూస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబు చేతిలో పవన్ గంగిరెద్దు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. టీడీపీని జనసేనలో విలీనం చేస్తే మంచిదని సూచించారు. చంద్రబాబు, పవన్ కలిసి ఎన్ని నాటకాలు ఆడినా.. కుట్రలు చేసినా.. యువ సింహం జగన్ ను ఏమీ చేయలేరన్నారు. ఏ రాజకీయ పార్టీ అయిన బలహీన వర్గాలకు అండగా ఉంటుందని.. పవన్ మాత్రం కమ్మ సామాజిక వర్గానికి అండగా ఉంటానని చెప్పారని కొడాలి నాని అన్నారు. ఐటీ శాఖకు పన్నులు ఎగ్గొట్టి హెరిటేజ్ లో డబ్బులు పెట్టారని.. లేకుంటే రెండు ఎకరాల చంద్రబాబుకు రూ.2వేల కోట్లకు ఎలా ఎదిగారంటూ ప్రశ్నించారు. డ్రగ్స్ ను తీసుకునేది బాబు కుటుంబమేనని.. జగన్ మీద ఎన్ని నిందలు వేసినా.. నిరూపించటం సాధ్యం కాదన్నారు. మాఫియాతో సంబంధాలు ఉండేవి చంద్రబాబుకేనని.. ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఉత్తరాంధ్ర నుంచి గంజాయి స్మగ్లింగ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు కొడాలి నాని. డ్వాక్రా సంఘాల విషయంలోనూ చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారని నాని మండిపడ్డారు. పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్న సమయంలోనే డ్వాక్రా సంఘాల్ని ఏర్పాటు చేశారని చెప్పారు. వైఎస్సార్ హయాంలో ఆ సంఘాలకు పావలా వడ్డీ రుణాల్చి ప్రోత్సహించారని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా సంఘాలకు వెన్నుపోటు పొడిని వారి సొమ్ముల్ని దోచుకున్నారని ఆరోపించారు. మహిళల దృష్టిలో చంద్రబాబు మోసగాడిగా నిలిచిపోతాడన్నారు.
http://www.teluguone.com/news/content/kodali-nani-target-pawan-kalyan-chandrababu-39-124342.html





