కొడాలికి ఇక గడ్డుకాలమే!?

Publish Date:Apr 6, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో బూతుల మంత్రి ఎవరంటే.. ఎవరైనా ఠక్కున చెప్పేది పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అని. అంతలా ఉంటాయి మరి ఆయన మీడియాలో కూడా మాట్లాడే బూతులు. కొద్ది రోజుల క్రితం కొడాలి నాని.. ‘మంత్రి పదవి నుంచి తప్పిస్తే నా విశ్వరూపం చూపిస్తా’ అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. అంటే కేబినెట్ రీ షఫిల్ లో తనకు ఉద్వాసన తప్పదని కొడాలి నాని ఫిక్సయ్యారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వ్యాఖ్యల ద్వారా సీఎం వైఎస్ జగన్ రెడ్డికి కొడాలి నాని హెచ్చరిక చేశారా? అనే సందేహాలు కొందరి నుంచి వ్యక్తం అవుతున్నాయి.

అసలే బూతుల్లో ఆయన మాస్టర్.. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్నా తన సహజ ధోరణిని విడిచిపెట్టలేదు. ఎప్పుడు ఏ సమయం, సందర్భం వచ్చినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, టీడీపీ నేతలను బూతుపదాలు వాడకుండా మాట్లాడిన పాపాన పోలేదు. అలాంటి బూతుల మంత్రి ఇప్పుడు తనకు మంత్రి పదవి లేకపోతే విశ్వరూపం చూపిస్తాననడం వెనుక ఆయనలో పెరిగిపోతున్న అసహనమే కారణమా? అంటున్నారు. ఇంతకాలంగా మంత్రి పదవిని అనుభవిస్తున్న కొడాలి నానికి ఇప్పుడు ఉద్వాసన తప్పకపోవచ్చట.  అందుకే ఇంతకాలమూ టీడీపీ నేతలను తన ధోరణిలో నోటికొచ్చినట్లు మాట్లాడిన కొడాలిలో మరింతగా అసహనం పెరిగిపోతోందంటున్నారు.

నిజానికి గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని గతంలో కొంత పట్టు సాధించారు. సొంత వర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. అడపా బాబ్జీ కొడాలి నానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో ఇంతకాలం కొడాలి నానికి మద్దతుగా ఉన్న బాబ్జీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఇప్పుడు వ్యతిరేకం అయ్యారంటున్నారు. దాంతో పాటు ఇంతకాలం జూనియర్ ఎన్టీఆర్ అండ, ఆయన ఫ్యాన్స్ మద్దతు కొడాలికి ఉండేవి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నానిని పక్కన పెట్టారనే వార్తలు వస్తున్నాయి. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా కొడాలి నానికి సహజంగానే ఉండదంటున్నారు.

దానికి తోడు వచ్చే ఎన్నికల్లో కొడాలి నానికి వైసీపీ టిక్కెట్ వచ్చినా.. టీడీపీ నుంచి ఈసారి బలీయమైన కాపు సామాజికవర్గం నుంచి కానీ, నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న యాదవ వర్గానికి గానీ టిక్కెట్ వస్తే.. కొడాలి నానికి విజయావకాశాలు తగ్గిపోతాయంటున్నారు. దానికి తోడు ఈ సారి గుడివాడ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తన అభ్యర్థిని బరిలో దింపితే కాపు సామాజివర్గం ఓట్లు తప్పకుండా నానికి పడే అవకాశాలు ఉండదంటున్నారు. ఇలాంటి అంశాల వల్ల కూడా కొడాలి నానిలో ఫ్రస్టేషన్ మరింత పెరిగిపోయి ఉంటుందంటున్నారు. అందుకే.. తనను మంత్రి పదవి నుంచి తప్పిస్తే విశ్వరూపం చూపిస్తానంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడి ఉండొచ్చంటున్నారు. గుడివాడ నియోజకవర్గంలో తనకు తిరుగు ఉండదని భావించిన కొడాలి నానికి తాజాగా మారుతున్న పరిస్థితులతో అసహనం పెరిగిపోతోందంటున్నారు.

గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం ఆవిర్భావం నుంచీ తెలుగుదేశం పార్టీ కంచుకోట. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు ఈ నియోజకవర్గం నుంచే తొలిసారి ఎన్నికయ్యారు. గుడివాడ నియోజకవర్గంలో టీడీపీకి ఉన్న పట్టు కారణంగానే కొడాలి నాని గతంలో గెలిచారంటారు. గతంలో గుడివాడలో కొడాలి నాని పట్టు సాధించడం వెనుక సొంత బలం, వైఎస్ జగన్ ప్రభావం, జూనియర్ ఎన్టీఆర్ అండ కారణం అంటారు. వీటిని చూసుకునే ఎలాంటి వారిపైనైనా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడారంటారు. ఇప్పుడు కొడాలి నానికి ఒక్కొక్కరి నుంచీ మద్దతు చేజారిపోతోందంటున్నారు. అందుకే కొడాలిలో అసహనం, ఆవేశం పెరిగిపోతున్నాయి అంటున్నారు. దీనికి తోడు ఇప్పుడు తాజా పరిణామాల్లో మంత్రి పదవి కూడా పోతే ఇక తన మాట చెల్లుబాటు కాదని, నియోజకవర్గంలో పట్టు కోల్పోతాననే ఆందోళన కొడాలి నానిలో కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మొత్తం మీద బూతుల మంత్రికి గుడివాడ నియోజవర్గంలో భవిష్యత్ గడ్డుకాలం అవుతుందనే అంచనాలు రాజకీయ వర్గాలు, పొలిటికల్ పండితుల నుంచి వస్తున్నాయి.

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.