రాష్టానికి రానున్న6.4లక్షల కోట్ల పెట్టుబడులు:కిరణ్ కుమార్ రెడ్డి
Publish Date:Jan 13, 2012
Advertisement
హైదరాబాద్: హెచ్సిఐఐ భాగస్వామ్య సదస్సు(పార్టనర్షిప్ సమ్మిట్) ద్వారా రాష్ట్రానికి ఆరు లక్షల 40వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఒప్పందాలు కుదిరినట్లు చెప్పారు. ముగింపు సదస్సులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి సానుకూల పరిస్థితులు ఉన్నట్లు తెలిపారు. మొత్తం పెట్టుబడులలో లక్ష కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు ఉన్నట్లు చెప్పారు. ఆరు లక్షల మంది ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. పెట్టుబడులు ఫలప్రదం కావడానికి ప్రతి పెద్ద పరిశ్రమకు ఒక ఎస్కార్ట్ అధికారిని నియమిస్తామన్నారు.కార్పోరేట్ కంపెనీల ప్రాజెక్టుల అనుమతుల కోసం మూడు నెలల్లో ఒక వెబ్సైట్ని ప్రారంభిస్తామని చెప్పారు. అన్ని అనుమతులను ఈపోర్టల్ ద్వారానే తెలియజేస్తామని చెప్పారు. ప్రాజెక్టులకు మూడు నెలల్లో అనుమతులు మంజూరు చేస్తామన్నారు. ఈ విధంగా పారిశ్రామిక అనుమతుల కోసం ప్రత్యేక పోర్టల్ని ప్రారంభించడం దేశంలో మన రాష్ట్రంలోనే తొలిసారని ఆయన తెలిపారు. పారిశ్రామిక స్థితిగతులను ప్రతినెలా సమీక్షిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
http://www.teluguone.com/news/content/kiran-kumar-reddy-24-10935.html





