ఇరకాటంలో కిరణ్‌ సర్కార్‌ ?

Publish Date:Aug 14, 2012

Advertisement

వాన్‌పిక్‌ భూముల కుంభకోణం కాంగ్రెస్‌పార్టీని ఇరకాటంలో పడేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహనరెడ్డి సూచనల మేరకు ఈ వాన్‌పిక్‌ భూముల కొనుగోళ్లు జరిగాయి. దీనిలో మంత్రులు మోపిదేవి వెంకటరమణ, తాజాగా రెవెన్యూశాఖా మంత్రి ధర్మాన ప్రసాద రావు, మరికొందరు మంత్రులు జీఓల పేరిట ఇరుక్కున్నారు. వైఎస్‌ హయాంలో జరిగిన ఈ కుంభకోణం వల్లే పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ పేరు కూడా వెలుగులోకి వచ్చింది. అయితే మంత్రి మోపిదేవి వెంకటరమణ తనపేరును సిబిఐ తెరపైకి తీసుకురాగానే తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. అలానే ఇప్పుడు మంత్రి ధర్మాన ప్రసాదరావు ఢల్లీి నుంచి తిరిగి వచ్చిన వెంటనే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు.

 

ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌సర్కారులోనూ వీరు మంత్రులుగా కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ప్రతిపక్షాలన్నీ మంత్రులకు న్యాయసహాయం చేస్తూ ప్రభుత్వం దోషపూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మానప్రసాదరావుకు కూడా ప్రభుత్వం న్యాయసహాయం చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో బీసి సంఘాలన్నీ ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నాయి. కిరణ్‌ కుమార్‌ తన పదవిని కాపాడుకునేందుకు బి.సి.లను బలిపశువులుగా వాడుకుంటున్నారని విమర్శిస్తున్నారు.

 

తెలుగుదేశం పార్టీ పూర్వవైభవాన్ని సంతరించుకునేందుకు వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు బాటలో బీసి డిక్లరేషన్‌ చేసింది. ఈ బీసి డిక్లేరేషను వల్ల కులసంఘాలన్నీ తెలుగుదేశం పార్టీకి సంపూర్ణమద్దతును ప్రకటిస్తున్నాయి. అన్ని పార్టీల్లోని బీసి సంఘాలూ కూడా టిడిపికి వచ్చే ఎన్నికల్లో సంపూర్ణమద్దతును ముందు నుంచే ప్రకటిస్తున్నాయి. ఇప్పటి వరకూ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన సంఘాలన్నీ ఆల్‌రెడీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చేందుకు నిర్ణయించు కున్నాయి. ఈ దశలో మంత్రి పదవికి ధర్మానప్రసాదరావు చేసే రాజీనామా బీసి సంఘాలను కాంగ్రెస్‌పార్టీకి దూరం చేస్తాయన్నది నిర్వివాదాంశం. పైగా శ్రీకాకుళం లాంటి వెనుకబడిన జిల్లాల్లో వేళ్లతో లెక్కబెట్టదగిన వారే మంత్రులుగా ఉన్నందున ఆ ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీకి ఎదురీత తప్పదని రాజకీయవిశ్లేషకులు తేలుస్తున్నారు.

 

ఎందుకంటే రాజకీయంగా ఎదిగిన కుటుంబాల్లో ధర్మాన కుటుంబానికి అక్కడ పలుకుబడి ఉంది. అందుకే ప్రసాదరావు సోదరుడు రామదాసు ఇటీవల ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ తరుపున అక్కడ విజయం సాధించగలిగాడు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వాన్‌పిక్‌ భూములున్నాయి. ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి డిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఈ భూముల కుంభకోణం జరిగింది. దీని కోసం మంత్రులందరినీ వైఎస్‌ ఏకతాటిపై నడిపించి ప్రత్యేక జీఓలను విడుదల చేశారు. ఈ జీఓల విడుదల తరువాత రైతుల నుంచి వాన్‌పిక్‌ సంస్థ భూములను స్వాధీనం చేసుకుంది. అయితే ఇటీవల ఆ భూముల కుంభకోణాన్ని పరిశీలించిన రైతులు తిరిగి తమ భూములను సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్‌ పార్టీ నేతల సహకారంతో స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ భూములను అమ్మటం వల్ల తాము కూడుకు కూడా నోచుకోవటం లేదని రైతులు కూడా సెంటిమెంటుగా ఫీలయ్యారు.

 

అయితే విచిత్రమేమిటంటే అప్పట్లో కాంగ్రెస్‌లో ఉన్న బాలినేని ఈ కుంభకోణానికి కారణమైన జగన్‌ నెలకొల్సిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి మారి మళ్లీ మూడోసారి శాసనసభ్యునిగా గెలుపొందారు. అదే ఆయన కనుక కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా ఓటమిపాలయ్యేవారని, వాన్‌పిక్‌ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్‌పై దాని ప్రభావం పడిరదని పరిశీలకులు స్పష్టం చేశారు. ఈ కుంభకోణం నేపథ్యంలో కాంగ్రెస్‌కు ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కాంగ్రెస్‌కు తీవ్రమైన వ్యతిరేకత తప్పటం లేదు. దీన్ని ఎదుర్కొనేందుకైనా ఈ నాలుగుజిల్లాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం బీసి సంఘాలకు ఊరట కలిగించే కార్యక్రమాలు చేపట్టాలని సూచనలు వస్తున్నాయి. ధర్మాన రాజీనామా తరువాతైనా కాంగ్రెస్‌ బీసిల కోసం ప్రత్యేకంగా బ్యాంకర్ల సహాయంతో సబ్సిడీ రుణాలు వంటివి మంజూరు చేస్తుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏమైనా బీసి మంత్రుల రాజీనామా కాంగ్రెస్‌పార్టీని లొంగదీస్తోందన్నది అక్షరసత్యం.

By
en-us Political News

  
సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అంతే స్థాయిలో నేరగాళ్ల అక్రమ మార్గాలు కూడా పెరిగిపోతున్నాయి.
విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉంటూ.. ఎండ, వాన, పగలు, రాత్రి తేడా లేకుండా ప్రజల రక్షణ కోసం శ్రమించే పోలీసుల ఆరోగ్యంపై తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన ఒక అనూహ్య ఘటనలో, నకిరేకల్ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు పెను ప్రమాదం తృటిలో తప్పింది.
హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలుడిపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపింది.
బాధితుల కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారించిన  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి. భాస్కర్ రెడ్డి  చట్టాన్ని రక్షించాల్సిన బాధ్యతలో ఉన్న ఒక పోలీసు అధికారి  కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం గర్హనీయమని పేర్కొంటూ,  కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించిన సీఐకు శిక్ష  విధించింది.  
తెలంగాణ రాష్ట్రంలో యాదవ సోదరుల ఆత్మగౌరవ వేడుకగా భావించే చారిత్రక సదర్ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది.
కదులుతున్న బస్సులోంచి తోసేయడంతో విషాదం.. ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం.!
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన తాజా సంచలన చిత్రం ఇరుముడి చట్టపరమైన చిక్కుల్లో పడింది.
60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు అపహరణ.!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అవసరానికి ఆదుకుంటుందనే నమ్మకంతో ఓ వ్యక్తి ర్యాపిడో పార్సిల్ సేవలను ఆశ్రయించాడు.
బిగ్ బ్రదర్ ఆఫీసులో రియల్టర్‌కు ప్రత్యేక ఛాంబర్.. ఒక్క బిల్డర్ కోసం వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తారా?
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమాయక యువతులను లక్ష్యంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్న మరో అక్రమ ఫెర్టిలిటీ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.