జగన్‌ ఆర్థిక మేధావా? రాజకీయ నిపుణుడా?

Publish Date:Aug 14, 2012

Advertisement

అక్రమాస్తుల కేసులో సిబిఐ పుణ్యమా అని చంచల్‌గూడా జైలులో ఖైదీగా మిగిలిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి ఆర్థికమేథావా? లేక రాజకీయ నిపుణుడా అని విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు. రోజు రోజుకు మారుతున్న సమీకరణల్లో ఎక్కువ ప్లస్‌గా కనిపిస్తున్నది వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీకేనని అందరూ అంగీకరించక తప్పటంలేదు. ఒకవైపు తండ్రి సిఎం కావాలని బలమైన కోరిక ఉన్న కుమారుడిగా జగన్‌కు మొదట్లో ముద్రపడింది. ఆనాటి అధికార తెలుగుదేశం పార్టీ లోపాలు ఎత్తిచూపటంలో వైఎస్‌రాజశేఖరరెడ్డికి తన తెలివితేటలతో కొంత సమాచారం జగనే సేకరించి ఇచ్చేవారట.

 

ఆ సమాచారం ఆధారంగా వైఎస్‌ చేసిన ప్రకటనలు సంచలన మయ్యాయి. మొత్తం అన్ని పత్రికల్లోనూ పతాకశీర్షికలతోనూ, ఎలక్ట్రానిక్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గానూ రాజశేఖరరెడ్డి మిగిలేవారు. ఇలా రాష్ట్రవ్యాప్త సంచలనంగా మారిన రాజశేఖరరెడ్డిని పాదయాత్రకు పురికొల్పినది కూడా జగన్‌ అని అప్పట్లో ప్రచారం జరిగింది. ఎక్కడికి వెళ్లినా అక్కడి స్థానిక సమస్యలపై భరోసా ఇవ్వాలని తండ్రికి జగన్‌ చెప్పి పంపినట్లు ప్రచారం జరిగింది. రాజమండ్రిలో అస్వస్థతకు గురైన వై.ఎస్‌.ఆర్‌. ఒక దశలో పాదయాత్రను నిలిపివేయాలని భావించిటనట్లు తెలిసింది. అయితే జగన్‌ జోక్యం చేసుకుని ఈ స్దితితో పాదయాత్ర కొనసాగిస్తే సిఎం కావడం ఖాయమన్న నమ్మకాన్ని వై.ఎస్‌.లో కల్పించారని కాంగ్రెస్‌ శ్రేణులు అంటున్నాయి.

 

తన కుమారుడి మాటల ఫలితం అప్పటికే చవిచూసిన రాజశేఖరరెడ్డి కూడా దాన్ని అమలు చేయటంతో ఆయనకు అధికారపీఠం దక్కింది. దీంతో జగన్‌ మాటకు వైఎస్‌ఆర్‌ ఎక్కువ విలువ నివ్వటం అన్నదానికి బీజం పడిరదని వైఎస్‌ సన్నిహితులు చెబుతుంటారు. అలానే సిఎంగా రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు అక్రమాస్తులను కూడబెట్టగలిగిన జగన్‌ సిబిఐ ముందు ఆర్థికమేధావిలా కనిపించారు.ఇంటరాగేషన్‌లో జగన్‌ తెలివిగా సమాధానం ఇస్తున్నారని స్వయంగా సి.బి.ఐ. తరపు న్యాయవాదులు కోర్టుకు తెలపడం విశేషం. సిబిఐ తన దర్యాప్తులో జగన్‌ అక్రమాస్తులగురించి ఇప్పటి దాకా పెద్దగా ఆధారాలు సేకరించలేకపోయింది. విదేశాల నుంచి కూడా సమాచారం సేకరించలేకపోయింది. దీంతో జగన్‌ను ఆర్థికమేధావిగా రాష్ట్రవ్యాప్తంగా గుర్తించారే తప్ప ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో సిబిఐ చూపిన నేరగాడిగా అంగీకరించటం లేదు.

 

ప్రత్యేకించి వైఎస్‌ఆర్‌ ప్రతిపాదించిన పథకాల లబ్దిదారులు జగన్‌పై వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. ఇక ఉప ఎన్నికల్లో 18అసెంబ్లీ స్థానాలకు 15లో గెలుపుబావుటా ఎగురవేయటం ద్వారా జగన్‌ను రాజకీయనేర్పరిగా మారుమూలప్రాంతాల ప్రజలు, గ్రామీణులు గుర్తించారు. అందువల్లే ఆ పార్టీ చేరాలన్న క్రేజ్‌ రోజురోజుకు ఎక్కువ అవుతోంది. దీన్ని ఆపటం ఒకవైపు చంద్రబాబుకు, మరోవైపు అధికార కాంగ్రెస్‌కు సాథ్యం కావటం లేదు. పైగా, రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ముఖర్జీకి మద్దతు ప్రకటించి కాంగ్రెస్‌ శ్రేణుల్లోనూ జగన్‌ ఒక ప్రత్యేకముద్రను వేసుకున్నారు. కోర్టులు మాత్రమే ఆయన బయటకు రావటానికి అడ్డు పడుతున్నాయని వైకాపా ప్రచారం చేస్తున్నాయి. దీన్నే ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఫెరా చట్టం కింద జగన్‌ నేరస్తుడన్నది సిబిఐ ప్రకటిత అంశంగానే ప్రజలు భావిస్తున్నారు. జగన్‌ ఏ నేరమూ చేయలేదనీ, కడిగిన ముత్యంలా ఆయన బయటకు వస్తారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారాన్ని ఎక్కువమంది నమ్ముతున్నారు.

By
en-us Political News

  
సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అంతే స్థాయిలో నేరగాళ్ల అక్రమ మార్గాలు కూడా పెరిగిపోతున్నాయి.
విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉంటూ.. ఎండ, వాన, పగలు, రాత్రి తేడా లేకుండా ప్రజల రక్షణ కోసం శ్రమించే పోలీసుల ఆరోగ్యంపై తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన ఒక అనూహ్య ఘటనలో, నకిరేకల్ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు పెను ప్రమాదం తృటిలో తప్పింది.
హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలుడిపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపింది.
బాధితుల కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారించిన  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి. భాస్కర్ రెడ్డి  చట్టాన్ని రక్షించాల్సిన బాధ్యతలో ఉన్న ఒక పోలీసు అధికారి  కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం గర్హనీయమని పేర్కొంటూ,  కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించిన సీఐకు శిక్ష  విధించింది.  
తెలంగాణ రాష్ట్రంలో యాదవ సోదరుల ఆత్మగౌరవ వేడుకగా భావించే చారిత్రక సదర్ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది.
కదులుతున్న బస్సులోంచి తోసేయడంతో విషాదం.. ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం.!
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన తాజా సంచలన చిత్రం ఇరుముడి చట్టపరమైన చిక్కుల్లో పడింది.
60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు అపహరణ.!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అవసరానికి ఆదుకుంటుందనే నమ్మకంతో ఓ వ్యక్తి ర్యాపిడో పార్సిల్ సేవలను ఆశ్రయించాడు.
బిగ్ బ్రదర్ ఆఫీసులో రియల్టర్‌కు ప్రత్యేక ఛాంబర్.. ఒక్క బిల్డర్ కోసం వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తారా?
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమాయక యువతులను లక్ష్యంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్న మరో అక్రమ ఫెర్టిలిటీ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.