తల్లి, భార్యను చంపి.. పిల్లలతో సహా ఆత్మహత్య.. తిరుపతి జిల్లాలో ఘోర విషాదం

Publish Date:Apr 22, 2026

Advertisement

తిరుపతి జిల్లాలో  ఘోర విషాదం చోటు చేసుకుంది.  కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి ఉన్మాదిగా మారి,   కన్నతల్లిని, కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడు. అనంతరం తన ఇద్దరు చిన్నారులతో కలిసి  రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగుతోంది.

 తిరుపతి జిల్లా నారాయణవనం మండలం వెంకటకృష్ణపాలెంలో మోహన్ అనే  సాఫ్ట్ వేర్ ఇంజినీర్  కుటుంబంతో సహా నివాసం ఉంటున్నాడు, బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన మోహన్.. తన తల్లి చంద్రకళ , భార్య హరితను గొంతు నులిమి  హత్య చేశాడు. వారిద్దరూ ప్రాణాలు విడిచాక, తన ఇద్దరు పిల్లలు కౌశిక్ , హరిణి ని తీసుకుని ఇంటి నుంచి  వేపకుంట రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ వేగంగా వస్తున్న రైలు కింద పిల్లలతో సహా దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉదయం పట్టాలపై ఛిద్రమైన మృతదేహాలను గమనించిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను మోహన్,  పిల్లలుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు మోహన్ ఇంటికి వెళ్ళగా, అక్కడ తల్లి మరియు భార్య విగతజీవులుగా పడి ఉండటం చూసి విస్తుపోయారు.

ప్రాథమిక విచారణ ప్రకారం, కుటుంబంలో గత కొంతకాలంగా నెలకొన్న మనస్పర్థలే ఈ ఘోరానికి దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మోహన్ తన తల్లి, భార్యను చంపిన తర్వాత పిల్లలను కూడా బలితీసుకోవడం చూస్తుంటే అతను తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ వృత్తిలో ఉన్న మోహన్ ఇలాంటి అఘాయిత్యానికి ఎందుకు ఒడిగట్టాడనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కేవలం కుటుంబ కలహాలే కారణమా లేక ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనే అంశాలను కూడా పరిశీలిస్తున్నారు.  

By
en-us Political News

  
తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాయంత్రంతో ముగిసింది.
రాష్ట్రంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వ్యవహారం మరో మలుపు తిరిగింది.
చాయ్ అంటే ప్రాణం పెట్టే నగరం హైదరాబాద్. ఉదయం కప్పు నుంచి అర్ధరాత్రి స్టాల్ వరకూ చాయ్ లేకుండా రోజే కదలదు.
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వద్దు జగ్గారెడ్డి సంచలన పోస్ట్
ఇరాన్‌పై అగ్రదేశం అమెరికాతో కలిసి దాడి చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెనత్యాహూ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారంట
ఒక మత చిహ్నానికి ప్రాధాన్యతనిచ్చి, మరో మత సంప్రదాయాలను కించపరచడం సెలెక్టివ్ టార్గెటింగ్ అని నెటిజన్లు విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా లెన్స్ ‌కార్ట్ పట్ల వ్యతిరేకత పెచ్చరిల్లడంతో.. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే సూచనలు కనిపించడంతో.. సంస్థ సీఈఓ పేయుష్ బన్సల్ రంగంలోకి దిగారు.
తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేటలో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది.
ఒకటి.. హిజాబ్, టర్బన్ అనుమతి.. అంటే నల్లరంగు హిజాబ్, నల్ల టర్బన్ ధరించవచ్చు. హిజాబ్ ఛాతీ వరకు కవరేజ్ ఉండాలి, కంపెనీ లోగో కనిపించేలా ఉండాలి. అయితే బుర్ఖా మాత్రం స్టోర్లో అనుమతించబడదని గైడ్లో ఉంది. రెండు..బొట్టు, తిలకం చేతితాడుపై నిషేధం.. ఆ డాక్యమెంట్ లో మత చిహ్నం అయిన తిలకం, బింది, స్టిక్కర్ లకు అనుమతి లేదని స్పష్టంగా ఉంది. అలాగే మతపరంగా చేతికి కట్టుకుని తాడు కూడా నిషేధం అని విస్పష్టంగా ఉంది.
ఢిల్లీ హత్యాచార నిందితుడు క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ చూసి పోలీసులే నోరెళ్ల పెడుతున్నారు
ఒంటిమిట్ట అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. దేశ జనాభా పెరుగుదల రేటు కంటే విద్యార్థుల ఆత్మహత్యల రేటు వేగంగా పెరుగుతోంది. 15 నుండి 20 ఏళ్ల లోపు యువతలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది.
ర్యాంకు ఒక లక్ష్యం కాదు.. గుర్తింపుగా సమస్యగా మారుతుంది. పదమూడు ఏళ్ల వయసులోనే జేఈఈ చేయాలి అనే సందేశం బాల్యాన్ని ముందుగానే ముగిస్తుంది. దాని తరువాత వస్తున్న జీవితాన్ని ఎలా జీవించాలో మాత్రం ఎవ్వరూ నేర్పరు. ఫలితంగా, అడ్మిషన్ తర్వాత కలిగే శూన్యత, అపరాధ భావం, వెనుకబడిపోతానేమోనన్న భయం ఇవన్నీ కలిసి కలిసి మానసిక కృంగుబాటుగా మారతాయి.
డొనాల్డ్‌ ట్రంప్‌ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అగ్గి రాజేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.