తెలంగాణ పోలీస్ శాఖలో కీలక బదిలీలు
Publish Date:Dec 29, 2025
Advertisement
తెలంగాణ పోలీస్ శాఖలో విస్తృత పునర్వ్యవస్థీకరణ చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐపీఎస్ అధికారులను బదలీ చేసింది. అలాగే పోస్టింగ్‌లను ప్రకటించింది. పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏర్పడిన పోలీస్ కమిషనరేట్లకు కొత్త పోలీస్ కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, రాచకొండ పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న జి. సుధీర్ బాబును కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌కు పోలీస్ కమిషనర్‌గా నియమించింది. అలాగే సైబరా బాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న అవినాష్ మొహంతిని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పున ర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడిన మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌కు కమిషనర్‌గా నియమించింది. ఇక పోతే .ఇక, ప్రస్తుతం తెలంగాణ పోలీస్ శాఖలో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్స్), పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ మేనేజింగ్ డైరెక్టర్, అలాగే ఐజీపీ (స్పోర్ట్స్) బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ ఎం. రమేష్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు కమిషనర్‌గా నియమించింది. అదే విధంగా, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తున్న అక్షాన్స్ యాదవ్, ఐపీఎస్ (2019 బ్యాచ్) ను నియమించింది.
http://www.teluguone.com/news/content/key-transfers-36-211757.html





