ఏపీ గ్రూప్-2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లు కొట్టివేత
Publish Date:Dec 30, 2025
Advertisement
ఏపీ గ్రూప్-2 రిజర్వేషన్లపై దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్ల పాయింట్లను సవాలు చేస్తూ పలువురు అభ్యర్ధులు కోర్టును ఆశ్రయించారు. 2023లో ఇచ్చిన గ్రూప్-2 నోటీఫికేషన్ రద్దు చేయాలని, సుప్రీంకోర్టు మార్గదర్శికాలను అనుగుణంగా సర్వీసెస్ నోటిఫికేషన్‌లో మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు, క్రీడాకారులకు రిజర్వేషన్లకు సంబంధించి ప్రత్యేక రోస్టర్ పాయింట్లపై దాఖలైన అనుబంధ పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ఈ మేరకు ఆ పిటిషన్లను ధర్మాసనం కొట్టివేస్తున్నట్లుగా స్పష్టం చేసింది. 2023లో విడుదలైన గ్రూప్-2 నోటిఫికేషన్‌ను రద్దు చేసి, పాత నోటిఫికేషన్‌కు బదులు కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని అభ్యర్థులు కోరారు. రిజర్వేషన్ల పాయింట్లను సవాల్ చేస్తూ, ప్రభుత్వ నిర్ణయాలు సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ విషయంపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు, రిజర్వేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించింది.
http://www.teluguone.com/news/content/ap-group2-reservations-36-211783.html





