సోమేష్ కు ప్రభుత్వంలో కీలక పోస్టు.. కేసీఆర్ నిర్ణయం

Publish Date:Feb 16, 2023

Advertisement

ముందు నుంచీ అందరూ అనుకున్నట్లుగా నే జరిగింది. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కోర్టు తీర్పు కారణంగా తెలంగాణ బాధ్యతల నుంచి రిలీవ్ అయిన ఆయన  గత నెల 12న   అమరావతికి వెళ్లి ఏపీ కేడర్‌లో రిపోర్టు చేశారు.  అయితే అప్పుడే ఆయన స్వచ్చంద పదవీ విరమణ తీసుకుంటారన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే జరిగింది. వాస్తవానికి  సోమేశ్ కుమార్ తెలంగాణలో కొనసాగింపును రద్దు చేస్తూ గత నెలలో తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే సోమేశ్‌కుమార్‌ స్వచ్ఛంద విరమణకు మొగ్గు చూపుతారన్న ప్రచారం జరిగింది.

 అయితే సాంకేతిక కారణాల దృష్ట్యా సోమేష్ కుమార్ గత నెల 12న  ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేశారు.   ఇప్పుడు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఇప్పుడు ఆయనకు తెలంగాణ సర్కార్ ఏదో ఒక పదవి ఇచ్చి అకామిడేట్ చేస్తుందని పరిశీలకులు అంటున్నారు.   తెలంగాణ ముఖ్యమంత్రితో సత్సంబంధాల కారణంగా ఆయనకు ఏదో ఒక సలహాదారు వంటి పదవి, తేదా  బీఆర్ఎస్ లో చేరి క్రియాశీలంగా వ్యవహరించే అవకాశం ఉందనిపరిశీలకులు అంటున్నారు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు..

తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా దాదాపు మూడేళ్ల పాటు పనిచేసిన సీఎస్ సోమేశ్ కుమార్ కు తెలంగాణ సీఎం ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఎందుకంటే  తెలంగాణ సీఎస్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తించినంత కాలం ఎక్సయిజ్, కమర్షియల్ టాక్సెస్ కార్యదర్శిగానూ కొనసాగారు. ఇప్పుడు కూడా ఆయనకు ఆ బాధ్యతలను కేసీఆర్ అప్పగించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.  ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరుల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఈ శాఖల బాధ్యతలను సోమేశ్‌కు అప్పగిస్తారని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికీ.. సోమేష్ కుమార్ తెలంగాణ బాధ్యతల నుంచి రిలీవ్ అయి ఏపీకి వెళ్లిపోయిన తరువాత కూడా ఇప్పటి వరకూ ఆ శాఖల బాధ్యతలను ఇప్పటివరకు వేరే ఎవరికీ అప్పగించకపోవడంతో సోమేష్ అనుభవం దృష్ట్యా ఆయననే చూసుకోమనే అవకాశం ఉందని చెబుతున్నారు.  

ఎన్నికల సంవత్సరం కావడం, కేంద్రం నుంచి సహకారం కరవైన నేపథ్యం, కారణంగా సొంత ఆర్థిక వనరులపైనే రాష్ట్రం ఆధారపడాల్సిన పరిస్థితి.  దీంతో సోమేష్ కుమార్ కు రాష్ట్రానికి వనరులు సమకూర్చే బాధ్యత అప్పగిస్తారని అంటున్నారు. కీలక బాధ్యతలు అప్పగించడానికి కేసీఆర్ నిర్ణయించుకున్నారనీ, అందుకోసమే ఇప్పటికే ప్రస్తుతం సెక్రటేరియెట్ గా ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవన్ లోనే సోమేష్ కోసం ఛాంబర్ రెడీ అవుతోందని అధికారులలో జోరుగా చర్చ సాగుతోంది.  గతంలో సీఎస్‌గా పనిచేసి రిటైర్ అయిన రాజీవ్‌శర్మను ముఖ్య సలహాదారుగా, ఎస్‌కే జోషిని సాగునీటిపారుదల శాఖ సలహాదారుగా కేసీఆర్ నియమించిన సంగతిని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు.   
 

By
en-us Political News

  
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
దసరా, దీపావళి పండగ సీజన్‌ సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం దేశంలోని లక్షలాది మంది రైల్వే సిబ్బందికి అదిరిపోయే శుభవార్త అందించింది.
మహారాష్ట్రలోని పూణే నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతను విస్మరిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఆటో డ్రైవర్ ఉదంతం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.