అలో లక్ష్మణా అంటున్న ఏపీ ఆర్టీసీ ఉద్యోగులు

Publish Date:Feb 16, 2023

Advertisement

కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్లుగా తయారైంది ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులమయ్యాం అని సంబరపడినంత సేపు పట్టలేదు వారికి తాము పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామని తెలుసుకోవడానికి.  తమది ప్రభుత్వ ఉద్యోగం కాదు వెట్టి చాకిరీ అని వారు ఇప్పడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామంటూ ప్రభుత్వం ప్రకటించగానే సంబరాలు చేసుకున్న ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉన్న సదుపాయాలు కోల్పోయి  కుడితిలో పడ్డ ఎలుకలా తమ పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ప్రభుత్వోద్యోగం వస్తే ఇక జీవితం సెటిల్ అయినట్లే అని భావిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ ఉద్యోగులు కూడా అలాగే సంబరపడ్డారు. గత ఏడాది ఆర్టీసీని ఏపీ సర్కార్ ప్రభుత్వంలో విలీనం చేసింది. ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించేసింది. ఇంకే ముంది తమ జీవితాలు ధన్యమైపోయినట్లేనని ఆర్టీసీ ఉద్యోగులంతా సంబరాలు చేసుకున్నారు. సీఎం జగన్ కు క్షీరాభిషేకాలు చేశారు. పీఆర్సీ కోసం ఉద్యోగులు అప్పట్లో చేసిన ఆందోళన కు కూడా వారు దూరం జరిగారు. అయితే ఆ తరువాత కానీ వారికి తత్వం బోధపడలేదు.

జగన్ సర్కార్ తమకు అర చేతిలో వైకుంఠం చూపి నిలువునా ముంచేసిందని. ఆర్టీసీ పేరుకే ప్రభుత్వ సంస్థ కానీ, ఆ సంస్థలో ఉద్యోగులకు మాత్రం గతమే మేలు అని ఫీలయ్యే పరిస్థితి వచ్చింది. అప్పట్లో పేరుకే కార్పోరేషన్ ఉద్యోగులం కానీ.. తమకు రావలసిన వేతనాలు, వేతన బకాయిలు, టీఏలు, డీఏలు సమయానికి వచ్చేవనీ, ఏటేటా ఇంక్రిమెంట్లూ సవ్యంగా దఖలు పడేవనీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వాపోతున్నారు. గతంలో ఆర్టీసీ కార్పోరేషన్ గా ఉన్నప్పుడు ఉద్యోగులకు క్రమం తప్పకుండా రాయతీలు, అలవెన్సులూ అందేవి. ఇప్పడు ప్రభుత్వంలో విలీనం పేరు చెప్పి వాటిని నిలిపివేసింది జగన్ సర్కార్. అంతేనా ప్రభుత్వోద్యోగులు పీఆర్సీ కోసం చేసిన ఆందోళనలో పాల్గొనకుండా ప్రబుత్వానికి మద్దతుగా నిలిచినందుకు బోనస్ గా ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ కూడా ఇవ్వలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆందోళనకు దిగిడంతో ఇక తప్పదన్నట్లుగా జగన్ సర్కార్ గత ఏడాది జూన్ లో పీఆర్సీ అమలు చేస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది.

కానీ   ఆ పెరిగిన వేతనాలు ఆర్టీసీ ఉద్యోగులకు రెండు నెలల తరువాత కానీ అందలేదు.  అయితే గత ఆరు నెలలుగా ఆర్టీసీ ఉద్యోగులకు ఓటీ, ఇతర అలవెన్సులనూ సర్కార్ నిలిపివేసింది.  పోనీ ఓటీలు చేయడం మానేద్దామా అంటే వస్తున్న జీతం చాలదు. అయినా ఓటీ చేసినా డబ్బులు రావడం లేదు కనుక మానేద్దామంటే ఉద్యోగం ఊడిపోతుందన్న భయం వారిని వెంటాడుతోంది. ఎందుకంటే ఆర్టీసీలో గత పదేళ్లుగా కొత్త నియామకాలు లేవు. దీంతో రిటైరైన వాళ్లు రిటైరైపోతున్నారు. ఆ పని భారం కూడా ఉన్న వారి మీదే పడుతోంది.  దీంతో నిబంధనల ప్రకారం డ్యూటీ టైం 8 గంటలు అయినా 12 గంటల పాటు పని చేసి తీరాల్సిన అనివార్య పరిస్థితి ఉంది.  

ముఖ్యంగా గ్యారేజీలలో పని చేసే వారిపై ఈ భారం అధికంగా ఉంది. దీంతో ఏపీలో ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి పేరుకే ప్రభుత్వోద్యోగం చేస్తున్నది మాత్రం వెట్టి అన్నట్లుగా తయారైంది. ఇక ఆర్టీసీలో కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తున్న వారి పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. వారికి ఇచ్చే వేతనాలే అంతంత మాత్రం. ఆ మాత్రం వేతనాలతోనే అధిక గంటలు పని చేయిస్తూ.. ఎక్కువ సమయం పని చేస్తే ఇవ్వాల్సిన ఓటీకి కూడా ఎగనామం పెడుతూ జగన్ సర్కార్ వారి శ్రమను నిలువునా దోచుకుంటోంది.   

By
en-us Political News

  
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
దసరా, దీపావళి పండగ సీజన్‌ సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం దేశంలోని లక్షలాది మంది రైల్వే సిబ్బందికి అదిరిపోయే శుభవార్త అందించింది.
మహారాష్ట్రలోని పూణే నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతను విస్మరిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఆటో డ్రైవర్ ఉదంతం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.