ఏపీ మద్యం స్కాంలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే?

Publish Date:Jul 20, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో  కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో  అభియోగాలను ఎదుర్కొంటున్న  ఏపీఎస్‌బీసీఎల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డితో పాటు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్, రాజ్ కసిరెడ్డిలకు విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం వచ్చే నెల 3 వరకూ   జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది.  సిట్ అధికారులు సమర్పించిన విచారణ నివేదికలు, ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన   న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

దర్యాప్తు ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్‌లోని చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఈ ముగ్గురు నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు ప్రిజనర్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్‌పై ప్రత్యేక భద్రత నడుమ విజయవాడకు తరలించారు. విజయవాడలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వీరికి  వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం, స్థానిక ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు అధికారి తమకు సమర్పించిన వివరాల ఆధారంగా నిందితులకు రిమాండ్ పొడిగించాల్సిన అవసరం ఉందని ప్రాసిక్యూషన్ వాదించింది.

కోర్టు విచారణ సందర్భంగా నిందితుల తరఫు న్యాయవాదులు, ప్రాసిక్యూషన్ న్యాయవాదుల మధ్య తీవ్రస్థాయిలో వాదనలు జరిగాయి. నిందితులు ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  నమోదు చేసిన కేసుల్లో అరెస్టయి జైలులో ఉన్నారని, కాబట్టి వారికి  41ఏ నోటీసులు జారీ చేసి విచారించాల్సి ఉందని నిందితుల తరఫు న్యాయవాదులు వాదించారు.  నిందితుల కుటుంబ సభ్యులు కలవడానికి అనువుగా వారిని అమరావతి లేదా విజయవాడ జైళ్లకు మార్చకుండా, తిరిగి హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులోనే ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

దీనికి ప్రతిగా ప్రాసిక్యూటర్లు సిట్ సేకరించిన కీలక ఆధారాలను కోర్టు ముందు ఉంచారు. వైసీపీ హయాంలో ఏపీఎస్‌బీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన వాసుదేవ రెడ్డి   తన అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ టెండర్ల నిబంధనలను నిబంధనలకు విరుద్ధంగా సవరించారని వివరించారు. అర్హత కలిగిన సంస్థలను పక్కనబెట్టి, నిర్దిష్ట సంస్థలకు అనుకూలంగా నిబంధనలు మార్చడం ద్వారా మద్యం రవాణా చార్జీలను భారీగా పెంచారని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై తీవ్రమైన ఆర్థిక భారం పడిందని స్పష్టం చేశారు.

ఈ కుంభకోణంలో మాజీ మంత్రి కుమారుడైన కారుమూరి సునీల్   పాత్ర   క్రియాశీలంగా ఉందని సిట్ న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. తన తండ్రికి ఉన్న రాజకీయ ప్రాభవాన్ని, ప్రభుత్వంలో ఉన్న పలుకుబడిని అడ్డం పెట్టుకుని మద్యం రవాణా కాంట్రాక్టర్ల ఎంపికలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించింది. ఈ అక్రమ కేటాయింపుల ప్రక్రియలో సునీల్ సుమారు   16 కోట్ల రూపాయల మేర ముడుపులు స్వీకరించినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్యాంకింగ్ లావాదేవీల రికార్డులు, సందేశాలు, వాట్సాప్ చాటింగ్‌లతో కూడిన డిజిటల్ సాక్ష్యాలను కోర్టుకు అందజేశారు.

ఈ కేసులో గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం సరఫరా, రవాణా కాంట్రాక్టుల కేటాయింపుల్లో వ్యవస్థాగతమైన అవకతవకలు జరిగాయని సిట్ దర్యాప్తులో ప్రాథమికంగా నిర్ధారణ అయింది. మద్యం బాట్లింగ్ యూనిట్ల నుంచి డిపోలకు, డిపోల నుంచి విక్రయ కేంద్రాలకు సరుకును చేరవేసే రవాణా కాంట్రాక్టుల్లో అసలైన రేట్ల కంటే అధిక ధరలను ఆమోదించడం ద్వారా సుమారు రూ. 192 కోట్ల మేర ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగానికి గురైందని సిట్ ప్రాథమిక నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ మొత్తాన్ని వివిధ మార్గాల్లో అక్రమంగా మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఉభయ పక్షాల వాదనలను   విన్న విజయవాడ ఏసీబీ కోర్టు.. కేసు తీవ్రతను బట్టి నిందితులకు ఆగస్టు 3 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తున్నట్లు పేర్కొంటూ.. వారిని తిరిగి చంచల్‌గూడ జైలుకే తరలించాలని  అధికారులను ఆదేశించారు. కోర్టు ఉత్తర్వుల అనంతరం సిట్ అధికారులు  నిందితులను తిరిగి హైదరాబాద్‌కు తరలించారు.  

Vasudeva Reddy, Karumuri Sunil, Vijayawada ACB Court, APSBCL Tender Scam

By
en-us Political News

  
అలాగే బహ్రెయిన్‌లోని దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రధాన డేటా సెంటర్‌ను కూడా ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ దేశ పౌర వసతులపై అమెరికా దళాలు జరిపిన దాడులకు తగిన రీతిలో జవాబు చెప్పడానికే ఈ సాంకేతిక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఈ ఆరోపణలు, క్షిపణి దాడి ఘటనను అమెజాన్ కానీ, బహ్రెయిన్ ప్రభుత్వం కానీ ధ్రువీకరించలేదు.
బాబాయ్ త్వరగా కోలుకోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు క్షణాల్లో వైరల్ అయ్యింది. బాబాయ్ పట్ల ఎన్టీఆర్ చూపించిన ఈ ప్రేమాభిమానాల పట్ల నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో ఒప్పందం ఇవాళ సాకారమైంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో గత కొన్ని నెలలుగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ముంబై నటి కాదంబరి జత్వాని వ్యవహారం
తన ఆరోగ్యం, ఆసుపత్రి అనుభవాల గురించి తాజాగా నెట్టింట షేర్ చేసిన పోస్టు ఆయన అభిమానులను, సినీ వర్గాలనూ కలవరానికి గురి చేసింది. ఆసుపత్రి వాతావరణం, శస్త్రచికిత్స, అనంతరం ఐసీయూలో వైద్యుల నిరంతర పర్యవేక్షణ వంటి కష్టతరమైన దశలను ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జరుగుతున్న శ్రీ జగదాంబికా అమ్మవారి బోనాల మహోత్సవాల సందర్భంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు విస్తృత స్థాయిలో ట్రాఫిక్ బందోబస్తు చేపట్టారు.
ప్రధాని ఇంటి ఎదుట బైఠాయించిన రాహుల్, ఖర్గే..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జాతీయ రాజకీయం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛలో సంసద్ పార్లమెంట్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ఉత్తరాంధ్ర ప్రాంత ప్రగతికి ఊపిరి పోసేందుకు తమ జీవనాధారమైన భూములను ప్రభుత్వం సేకరించడానికి సహకరించిన రైతులకు కృతజ్ఞతగా, గౌరవంగా భోగాపురం విమానాశ్రయం నుంచి ఉచితంగా ఒకసారి విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించారు. ఈ మేరకు ఆయన అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
కాకినాడలో జరుగుతున్న NBK111 సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శిం చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొగాకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముడి పొగాకు (HSN 2401)పై ప్రస్తుతం అమలులో ఉన్న 40 శాతం జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలని
ట్రైనీ ఐపీఎస్‌కి న్యాయం జరగాలి..విచారణ పూర్తికాకముందే దోషిగా ప్రకటించడం సరికాదు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.