Publish Date:Mar 14, 2025
పాముకు పాలు పొయొద్దు.. పోస్తే అది తిరిగి మనల్నే కాటేస్తుంది. ఇదీ కొన్నాళ్ల క్రితం వైసీపీ నేతలను ఉద్దేశించి చంద్రబాబు తెలుగుదేశం నేతలకు చెప్పిన మాటలు.
Publish Date:Mar 14, 2025
రాజ్ కసిరెడ్డి. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి బుధవారం (మార్చి12) సీఐడీ విచారణకు వెళ్లి వచ్చిన తర్వాత నుంచి ఈ పేరు గురించే ఏపీ రాజకీయాల్లో తెగ చర్చ జరుగుతోంది. కాకినాడ పోర్టు అంశంలో విజయసాయి రెడ్డి విచారణకు హజరైనా.. మీడియా అడిగిన ప్రశ్నలకు విజయసాయి రెడ్డి బదులిస్తూ లిక్కర్ స్కాంలో కర్త, కర్మ, క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేనని తేటతెల్లంగా చెప్పేశారు.
Publish Date:Mar 14, 2025
అభివృద్ధి పేరుతో అడవుల నరికివేత కారణంగా వన్యప్రాణలు ఆవాసాలు కోల్పోతున్నాయి. జనావాసాలపై పడుతున్నాయి. ఆహార, నీటి కోసం అవి వనాలను వదిలి జనాల నివాసాలవైపు వస్తున్నాయి. ఈ పరిణామం అటు వన్యప్రాణులకు, ఇటు మనుషులకూ కూడా ప్రమాదకరంగానే మారుతోంది.
Publish Date:Mar 14, 2025
ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడుతూ జనం తెలుగుదేశం కూటమికి అద్భుత విజయాన్ని అందించి అధికారం కట్టబెట్టారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దివ్యంగా ఉంది. జనం స్వేచ్ఛగా, నిర్భయంగా, ప్రశాంతంగా బతుకుతున్నారు. సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాల్లా పరుగులు తీస్తున్నాయి. ప్రజలలో సంతృప్తి స్థాయి పెరుగుతోంది. అయినా ఎక్కడో ఏదో వెలితి.. తెలుగుదేశం శ్రేణుల్లో కించిత్తు అసహనం, అసంతృప్తి వ్యక్తం అవుతున్నాయి.
Publish Date:Mar 14, 2025
తన రాజకీయ భవిష్యత్ పై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. యనమల రామృకృష్ణుడు తొలిసారి 1983లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి టీడీపీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. మంత్రిగా, స్పీకర్‌గా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గా అనేక కీలక పదవులు నిర్వహించారు.
Publish Date:Mar 14, 2025
రాష్ట్ర ముఖ్యమంత్రులు తరచూ ఢిల్లీ వెళ్ళడం కొత్త విషయం కాదు. ఇప్పుడే కాదు గతంలోనూ వుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పడు, ముఖ్యమంత్రులు ఒక కాలు ఢిల్లీలో మరో కాలు హైదరాబాద్ లో అన్నట్లు ఇటూ అటూ చక్కర్లు కొడుతూ ఉండేవారని అంటారు.
Publish Date:Mar 13, 2025
తెలంగాణ రాజకీయాల్లో ఏమి జరుగుతోంది? ఓ వంక అధికార కాంగ్రెస్ పార్టీలో ఒక విధమైన
గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టి 14 నెలలు పూర్తయినా, ఆయనకు, పరిపాలనపై పూర్తి పట్టు చిక్కినట్లు లేదు.
Publish Date:Mar 13, 2025
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం, వరుస సెలవుల కారణంగా తిరమలేశుని దర్శనం కోసం భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు.
Publish Date:Mar 13, 2025
విజయసాయి రెడ్డి ప్రతి మాటా, ప్రతి కదలికా.. వైసీపీ కాళ్ల కింద భూమిని కదిలించేస్తోంది. విజయసాయి రెడ్డి ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడతాడా అన్న టెన్షన్ వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పేసి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేని వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించిన తరువాత ఆయన ప్రతి కదలికా వైసీపీని గాభరాపెడుతూనే ఉంది. వైసీపీకి గుడ్ బై చెప్పేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన తరువాత ఆయన మొదటిగా కలిసింది వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిలను. ఇది కచ్చితంగా జగన్ ను ఇబ్బంది పేట్టే చర్యేననడంలో సందేహం లేదు.
Publish Date:Mar 13, 2025
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆయనను ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Publish Date:Mar 13, 2025
ఈ నెల 13 నుంచి 18 వరకు తెలంగాణలో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. తెలంగాణలో గత కొన్ని రోజులుగా వింత వాతావరణం నెలకొంది. పగలు అధిక వేడి, రాత్రి చలి గాలులు, ఉదయం మంచు దుప్పట్లు కురవడం వంటి వాతావరణం ఉంది.
Publish Date:Mar 13, 2025
బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ పై సూర్యపేట పిఎస్ లో కేసు నమోదైంది. ఇటీవలె బెట్టింగ్ యాప్ ల ద్వారా యువత లక్షలాది రూపాయలను పోగొట్టుకున్నారు.
Publish Date:Mar 13, 2025
జగన్ హయాంలో పడకేసిన పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పుడు జోరందుకున్నాయి. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు తన మొదటి పర్యటన పోలవరం సందర్శనతోనే ప్రారంభించారు.