Publish Date:Mar 31, 2025
ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాల్లో ఇన్‌యాక్టివ్ అయిన వైసీపీ నేతలు ఎవరి వ్యాపాకాల్లో వారు పడ్డారు. తమకు నచ్చింది చేసుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఆ క్రమంలో వైసీపీ కీలక నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. నయా అవతారం ఎత్తారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే నేతల్లో కేతిరెడ్డి ఒకరు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు.. తన నియోజకవర్గం, పార్టీ సమావేశాలు, ఇతర కార్యక్రమాల గురించి .. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో తరచుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండేవారు. 2024 ఎన్నికల్లో కూటమి గాలికి కొట్టుకుపోయారు. ప్రస్తుతం ఆయన తన నియోజకవర్గానికే పరిమితం అయ్యారు.
కేతిరెడ్డి తాజాగా పైలట్ అవతారం ఎత్తారు. తానే స్వయంగా ప్రైవేట్ జెట్‌ని నడిపిన వీడియోని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కల నిజమయ్యింది అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. కల నిజమైంది. అధికారికంగా పైలట్ అయ్యా. ఇది ప్రారంభం మాత్రమే. ఈ ప్రయాణంలో నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఇలాంటి సాహసాలు మరెన్నో ఉన్నాయని ఆయన ట్వీట్ చేశారు. హైదరాబాద్ పరిసరాల్లో ప్రైవేట్ జెట్ నడిపి తన కల నెరవేర్చుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ketiredd-as-pilot-25-195337.html
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.