Publish Date:Mar 31, 2025
గత ఏడాది ఏపీలో సాధారణ స్థాయి వర్షపాతం నమోదు కాలేదు అయినా కూడా గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కరువు మండలాల ప్రకటన సరిగా జరగలేదు. ఎదో మొక్కుబడి తంతుగా జగన్ సర్కార్ నాడు కరువు మండలాలను ప్రకటించి ఊరుకుంది.అయితే కూటమి సర్కార్ రైతుల ఇబ్బందులు, సమస్యలు, అలాగే స్థానిక పరిస్థితులు అన్నిటినీ పరిగణనలోనికి తీసుకుని కరువు మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తాజాగా ఏపీలోని ఆరు జిల్లాల్లో 51 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది.
ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్ ఆర్పీ సిసోడియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రకటించిన 51 మండలాల్లో 37 మండలాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నట్లు పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా 2024-25 సంవత్సరానికి కరువు మండలాలను వెల్లడిస్తూ ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల రాష్ట్ర విపత్తుల నిర్వహణ కార్యాలయంలో నిర్వహించిన కరువు ప్రభావ కమిటీ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖలు సమర్పించిన నివేదికలను నిశితంగా పరిశీలించి వివిధ జిల్లాల నుంచి వచ్చిన నివేదికలను తాము దృష్టిలో ఉంచుకుని, వర్షపాతం లోటు, పంటల నష్టం, భూగర్భ జలాల స్థాయి, వ్యవసాయ స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని కరువు మండలాలను ప్రకటించింది కూటమి ప్రభుత్వం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/51-draught-mandals-in-ap-25-195339.html
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.