కేశినేని నాని బెంగటిల్లుతున్నారా? దెబ్బతీస్తున్నారా?

Publish Date:Sep 4, 2023

Advertisement

విజయవాడ ఎంపీ కేశినేని నాని తన రాజకీయ భవిష్యత్ పై బెంగటిల్లుతున్నారా? తన స్థాయిని మరిచి మరీ  సొంత పార్టీ తెలుగుదేశంపై, ఆ పార్టీ అధినాయకత్వంపై విమర్శలు గుప్పించిన కేశినేని నాని అదే సమయంలో అధికార వైసీపీ నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరగడమే కాకుండా వారిపై పొగడ్తల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. కేశినేని నాని వైఖరితో, వ్యవహరిస్తున్న తీరుతో విసుగెత్తిన తెలుగుదేశం ఆయన పార్టీలో ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే అని ఫిక్స్ పోయింది. విజయవాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా కేశినేని నాని సోదరుడిని నిలబెట్టి గెలిపించుకోవాలన్న నిర్ణయానికి వచ్చేసినట్లు విస్పష్ట సంకేతాలు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో  కేశినేని నాని వైసీపీ గూటికి చేరడం ఖాయమనీ, దీంతో బెజవాడ లోక్ సభ బరి అన్నాదమ్ముల సవాల్ గా మారుతుందనీ అంతా భావించారు. అంతలోనే ఏమైందో ఏమో కేశినేని నాని బెజవాడ లోక్ సభ బరిలో తెలుగుదేశం అభ్యర్థిగా తాను రంగంలో ఉంటానని తనకు తానే ప్రకటించేసుకున్నారు. 

టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా లేకపోతే రాజకీయాల నుంచి విరమించుకుంటా నంటూ నేల విడిచి సాము చేసిన చందంగా ప్రకటనలు గుప్పించిన కేశినేని నాని ఇప్పుడు తెలుగుదేశం వినా గత్యంతరం లేదన్నట్లు బేలగా మాట్లాడుతున్నారు.  విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా మూడోసారి పోటీ చేసి లోక్ సభలో అడుగుపెడతానని , వచ్చే ఎన్నికలలో 2024 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నుంచి తెలుగుదేశం అభ్యర్థి ఎంఎస్ బేగ్ విజయం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని  పిలుపునిచ్చేశారు. తనకు పార్లమెంట్ టిక్కెట్ ప్రకటించుకోవడమే కాకుండా… తనతో పాటు బేగ్ అనే నేతకూ  ఏకపక్షంగా తెలుగుదేశం టికెట్ ప్రకటించేయడం ద్వారా కేశినేని నాని  తన సోదరుడికి చెక్ పెట్టే వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

  లోకేష్ పాదయాత్ర బెజవాడలో సాగిన సందర్భంలో పార్టీ ఎంపీ అయి ఉండి కూడా కేశినేని నాని కనీసం అటువైపు చూడలేదనీ, ఇప్పుడు ఇలా ఏకపక్షంగా తనే తెలుగుదేశం అభ్యర్థినంటూ బాహాటంగా ప్రకటనలు గుప్పించడం వెనుక తెలుగుదేశం క్యాడర్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే వ్యూహం ఉందనీ తెలుగుదేశం శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి.  ఇప్పటికే బెజవాడలో కేశినేని నానికి ప్రత్యామ్నాయంగా ఆయన సోదరుడు కేశినేని చిన్నిని తెలుగుదేశం అధినేత ప్రోత్సహిస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించే  తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ   నియోజకవర్గాల్లో  తెలుగుదేశం రెబల్ అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా పార్టీని దెబ్బతీయాలన్న వ్యూహంతో కేశినేని నాని అడగులు వేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.