2018లోనే జమిలికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్!

Publish Date:Sep 4, 2023

Advertisement

జమిలీ ఎన్నికలు, లేదంటే కనీసం మినీ జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం ఇప్పుడు ఆసక్తి కనబరుస్తున్నది. ఇప్పటికే దీనికి సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా లోక్ సభ, శాసన సభలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించేందుకు గల అవకాశాలను పరిశీలించేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నెల 18 నుంచి 22 వరకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించి ఒకే దేశం-ఒకేసారి ఎన్నికల బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందన్న చర్చ దేశ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. అదే జరిగితే ఒకే దేశం..ఒకేసారి ఎన్నికలు అనేది చట్టరూపం దాలుస్తుంది. 

నిజానికి ఒకే దేశం ఒకే ఎన్నిక కొత్తదేమీ కాదు. కేంద్రంలో బి‌జే‌పి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వినబడుతూనే ఉంది. కేంద్రంలో లోక్‌సభ ఎన్నికలు, ఇటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే ఎన్నికల నిర్వహణ ఖర్చు భారీగా తగ్గడంతో పాటు సమయం కలిసొస్తుందని, అలాగే ఎన్నికల కోడ్ పేరిట ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలకు అడ్డు ఉండదంటూ కేంద్రం ఇప్పటి వరకూ చెప్పుకుంటూ వస్తున్నది. ఇప్పుడు ఏకంగా సాధ్యాసాధ్యాలపై దృష్టి పెట్టింది. దీంతో సహజంగానే   తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటన్న చర్చ సాగుతున్నది. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఈ ఒకే దేశం-ఒకే ఎన్నికల నినాదానికి ఒప్పుకుంటారా అన్న చర్చ  తెరమీదకు వచ్చింది.  షెడ్యూల్ ప్రకారం అయితే  ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. పార్లమెంటుకు వచ్చే ఏడాది ఎన్నికల జరగనున్నాయి. కేంద్ర ప్రతిపాదన ఒకే అయితే.. తెలంగాణ అసెంబ్లీకి, పార్లమెంటుకు కూడా ఒకేసారి ఎన్నికల జరగుతాయి.

తెలంగాణ అసెంబ్లీ గడువు 2024 జనవరి 16తో ముగిసిపోతుంది. ఆలోగా ఎన్నికలు పూర్తిచేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఆ లెక్కన చూస్తే ఈ ఏడాదిలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. అలా జరగలేదంటే అసెంబ్లీ గడువు పూర్తి అయినప్పటి నుంచి.. ఎన్నికలు జరిగేదాకా పరిపాలన గవర్నర్ చేతికి వెడుతుంది. ఒకవేళ ఈ ఏడాది ఎన్నికల జరపకుండా వచ్చే ఏడాదిలో అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికల జరపాలని కేంద్రం నిర్ణయం తీసుకుని ఆ మేరకు పార్లమెంటు ఆమోదం పొంది చట్టం చేస్తే..  తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలలో గవర్నర్ పాలన తప్పదు. అలా కాకుండా ఈ ఏడాదే పార్లమెంట్ రద్దు చేసి కలిసి వచ్చే రాష్ట్రాలతో మినీ జమిలీ ఎన్నికల జరిపితే తెలంగాణలో అసెంబ్లీతో పాటు పార్లెమెంట్ ఎన్నికల జరగుతాయి. దీంతో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఎన్నికల ఎప్పుంటాయా అన్నది తెలంగాణ రాజకీయాలలో ఆసక్తిగా మారింది. 

జమిలి ఎన్నికలు, లేదా మినీ జమిలీ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ నేతలు అనుకూలంగా ఉండగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లలో మాత్రం కాస్త కలవరపాటు వ్యక్తం అవుతోంది. డిసెంబర్‌ లోపే ఎన్నికలుంటాయని బీఆర్ఎస్ ఇప్పటికే  అభ్యర్థులను కూడా ప్రకటించేసింది. కాంగ్రెస్ కూడా హెవీ లోడింగ్ తో టికెట్ల పంపకంపై ప్రకటనకు సిద్దమవుతున్నది. వచ్చే ఏడాదికి ఎన్నికలు వాయిదా పడితే ఇప్పటి నుండి అప్పటి వరకూ ఈ నేతలను భరించడం సామాన్యమైన విషయం కాదు. ఈ క్రమంలో తెలంగాణలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది. నిజానికి అసెంబ్లీ, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికల జరపాలని గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంటే జమిలి ప్రతిపాదనకు కేసీఆర్ ఐదేళ్ల కిందటే అంటే 2018లోనే సై అనేశారు.

అసెంబ్లీ, లోక్‌సభలకు ఒకేసారి ఎన్నికలు జరపడమే ఉత్తమమని 2018లోనే సీఎం కేసీఆర్ కేంద్రానికి తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంటుకు విడివిడిగా ఎన్నికల జరపడం వలన ఐదేళ్లలో రెండుసార్లు ఎలక్షన్ కోడ్ రావడంతో అభివృద్ధి కుంటుపడుతుందని, ఐదేళ్లలో రెండుసార్లు ఎన్నికలతో జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ అధికారులు, మంత్రుల సమయం వృధా అవుతుందని, అన్నిటికీ మించి ప్రజా ధనం దుర్వినియోగం అవుతుందని.. అందుకే ఒకేసారి ఎన్నికలు ఉత్తమమని  కేసీఆర్ అప్పట్లో విస్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాదు, దేశమంతా ఒకేసారి ఎన్నికలపై తమ అభిప్రాయాన్ని కోరిన కేంద్రానికి కృతజ్ఞతలు కూడా తెలిపిన సీఎం కేసీఆర్..  అప్పుడు ఆ విధానాన్ని అమలు చేస్తారని ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. అప్పట్లో కేంద్రంలోని మోడీ సర్కార్ తో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో కేసీఆర్ కేంద్రానికి పూర్తి మద్దతు తెలిపారు.

మరి ఇప్పుడు మారిన పరిస్థితుల్లో అదీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు అవకాశం ఉన్న నేపథ్యంలో.. అలా కాకపోయినా.. కేంద్రంతో ఏ మాత్రం సత్సంబంధాలు లేని ప్రస్తుత తరుణంలో తెలంగాణలో అసెంబ్లీ పార్లమెంటుకు ఒకే సారి ఎన్నికల వల్ల బీఆర్ఎస్ కు తీవ్ర నష్టం వాటిల్లు తుందన్న అంచనాల నేపథ్యంలో కేసీఆర్ ప్రతిస్పందన ఎలా ఉంటుందన్నది తెలియాల్సి ఉంది.  అయినా మాట అనడం ఆ తరువాత మార్చడం ఈ తొమ్మిదేళ్లలో పలు మార్లు చేసిన కేసీఆర్.. ఇప్పుడు ఏ నిర్ణయం ప్రకటించినా అది తనకూ, తన పార్టీకీ ప్రయోజనకరంగా ఉండేలా చూసుకుంటారని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.