డీమ్డ్ వర్సిటీ చాన్సలర్ పదవి నుంచి గవర్నర్ తొలగింపు.. కేరళ సీఎం సంచలనం

Publish Date:Nov 10, 2022

Advertisement

 వ్యవస్థల మధ్య, వ్యక్తుల మధ్య విభేదాలు ఉంటే ఉండవచ్చును. కానీ ఆ విబేధాలు ఘర్షణాత్మక స్థాయికి చేరుకోవడం మాత్రం ఎంతమాత్రం అభిలషణీయం కాదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం. మూడు దక్షిణాది రాష్ట్రాలలో ఇప్పుడు గవర్నర్, ఆ రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య విభేదాలు ఘర్షణ స్థాయికి చేరుకున్నాయి. దీంతో ప్రభుత్వం, గవర్నర్ ల మధ్య విమర్శలు రాజకీయ ప్రత్యర్థుల మధ్య విమర్శల స్థాయికి దిగజారాయి.  

గవర్నర్ వ్యవస్థను మోడీ సర్కార్ దుర్వినియోగం చేస్తున్నదన్న విమర్శలు రోజు రోజుకూ తీవ్రమౌతున్న సంగతి విదతమే. పశ్చిమబెంగాల్, ఢిల్లీ, కేరళ, తమిళనాడు, తెలంగాణ వంటి బీజేపీ యేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో గవర్నర్లు, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. మరీ ముఖ్యంగా దక్షాణాది రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, తెలంగాణలలో గవర్నర్ల తీరు పట్ల ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో అయితే గవర్నర్ తమిళిసై, ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొని ఉంది. గవర్నర్ తమిళి సై విలేకరుల సమావేశాలు నిర్వహించి మరీ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు.

ఇక తమిళనాడులో స్టాలిన్ సర్కార్ అయితే ఆ రాష్ట్ర గవర్నర్ ను తొలగించాలని డిమాండ్ చేస్తోంది. కేరళ ప్రభుత్వం అయితే ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా డీమ్డ్ వర్సిటీ చాన్సలర్ పదవి నుంచి గవర్నర్ ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం వర్సటీ నియమనిబంధనలను కూడా మార్చింది. కేరళ గవర్నర్ మహ్మద్ ఆరిఫ్ ఖాన్ కొద్ది రోజుల కిందట రాష్ట్రంలోని వైస్ చాన్సలర్ లందరూ రాజీనామా చేయాలంటూ వర్సిటీల చాన్సలర్ హోదాలో ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి కేరళ ప్రభుత్వం రాష్ట్రంలోని వర్సిటీలపై గవర్నర్ పెత్తనం అవసరం లేదని చెబుతూ వస్తోంది.  అలాగే  తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ కు పంపిన యూనివర్సిటీ రిక్రూట్‌మెంట్‌ బిల్లుపై సంతకం చేయకుండా తన వద్దే పెండింగ్ ఉంచుకుని ఈ బిల్లుపై క్లారిఫికేషన్ ఇవ్వాలనీ, రాజ్ భవన్ కు వచ్చి తనతో చర్చించాలని ఆ రాష్ట్ర గవర్నర్ తమిళసై ప్రభుత్వానికి హుకుం జారీ చేశారు.  

 బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల గవర్నర్ లు బీజేపీ ప్రతినిథులుగా పని చేస్తున్నారనీ, రాజ్ భవన్ లను కాషాయ కార్యాలయాలుగా మార్చేస్తున్నారనీ విమరలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే  కేరళ సీఎం పినరయ్ విజయన్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ను డీమ్డ్ వర్సిటీ చాన్సలర్ పదవి నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు యూనివర్సిటీ నిబంధనలను ప్రభుత్వం మార్చింది.  వర్సటీ చాన్సలర్ గా గవర్నర్ ను తొలగిస్తున్నట్లు గురువారం ప్రభుత్వ ప్రకటన వెలువడింది. చాలా కాలంగా గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్,  పినయర్ సర్కార్ మధ్య విభేదాలు ఉన్నాయి. ప్రభుత్వం, గవర్నర్ మధ్య పరస్పర విమర్శలు కొనసాగుతున్నాయి. బుధవారం ఈ విమర్శలు ఒకింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అంతే కేరళ సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ ను డీమ్డ్ వర్సిటీ పదవి నుంచి తొలగిస్తు గురువారం కేరళ సర్కార్ ప్రకటించింది.  తాజాగా డీమ్డ్ వర్సిటీ చాన్సలర్ పదవి నుంచి గవర్నర్ ను తొలగిస్తూ కేరళ సీఎం పినరయ్ విజయన్ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇదే ఒరవడిని అనుసరించే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.  

By
en-us Political News

  
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యున్నత గౌరవం దక్కింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరో వాతావరణ గండం ఆందోళనకు గురిచేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.