గుజరాత్ బరిలో జడేజా భార్య.. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి బీజేపీ పాట్లు

Publish Date:Nov 10, 2022

Advertisement

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. యాంటీ ఇన్ కంబెన్సీ ఆ రాష్ట్రంలో బీజేపీకి పెను సవాల్ గా మారింది. దీంతో ఎన్నికలలో విజయంతో గట్టేక్కేదుకు బీజేపీ అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై భారీ కసరత్తు చేసింది. పాత ముఖాలకు చాలా వరకూ టికెట్ ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చింది.

కొత్త ముఖాలను బరిలోకి దింపడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను ఏదో మేరకు తగ్గించుకోవాలని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇందు కోసం వివిధ రంగాలలో పేరున్న, గుర్తింపు పొందిన వ్యక్తులకుటికెట్లు కేటాయించే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల తొలి జాబితాలో పలువురు కొత్తవారే ఉన్నారు.సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 38కి శూన్యహస్తం చూపింది. అంటే బీజేపీ వంద మంది అభ్యర్థులతో విడుదల చేసిన జాబితాలో 38 మంది ఇప్పటి వరకూ ఎన్నికల బరిలో నిలబడని వారే. బీజేపీ అభ్యర్థుల ఎంపికలో ఎంతగా కసరత్తు చేసిదో తెలుసుకోవాలంటే ఆ పార్టీ విడుదల చేసిన తొలి జాబితాలో ఉన్నకొత్తు ముఖాలను చూస్తే అర్ధమౌతుంది. క్రికెట్ లో తన ఆల్ రౌండ్ ప్రతిభతో ఎంతో మందికి అభిమాన క్రీడాకారుడిగా మారిన జడేజా భార్యను ఈ సారి బీజేపీ తన  అభ్యర్థిగా ఎన్నికల రంగంలో దింపేందుకు నిర్ణయించింది.

జడేజా భార్య రావాబా జడేజాను నార్త్ జామ్ నగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగారంగంలోకి దింపుతోంది. అలాగే కాంగ్రెస్ గూటి నుంచి వచ్చి చేరిన పలువురికి బీజేపీ టికెట్లు ఇచ్చింది. ఇక రివాబా విషయానికి వస్తే 2016లో ఆమెకు  జడేజాతో వివాహంజరిగింది. ఆమె మూడేళ్ల కిందటే బీజేపీ తీర్థంపుచ్చుకున్నారు.  

అలాగే ఇటీవలే బీజేపీలో చేరిన హార్థిక్ పటేల్ కు కూడా బీజేపీ టికెట్ ఇచ్చింది.ఇప్పటికే ఐదు సార్లు వరుసగా అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ  ఆరో సారి గెలిచి.. అధికారం చేపట్టాలన్న పట్టుదలతో ఉంది. అయతే ఆప్ రంగంలో ఉండటం, పంజాబ్ లాగే ఇక్కడ కూడా అధికార పగ్గాలను అందుకోగలమన్న ధీమాతో ఆ పార్టీ ఇప్పటికే జోరుగా ప్రచార రంగంలో ఉండటం బీజేపీని  ఒకింత కలవర పరుస్తోంది. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి ఇటీవలే ఏర్పాటు చేసిన భారత్ రాష్ట్ర సమితి కూడా పలు స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించడమే కాకుండా.. గుజరాత్ లో తెలుగువారు అధికంగా ఉండే సూరత్ ప్రాంతంపై ప్రత్యేక గురి పెట్టింది.  

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేంత బలంగా లేకపోయినా.. ఆ పార్టీ ప్రభావాన్ని కూడా తక్కువ అంచనా వేయలేమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాహుల్ భారత్ జోడో యాత్రకు వస్తున్న అశేష జనస్పందన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై ఏదో ఒక మేరకు ప్రభావం చూపుతుందంటున్నారు. ఆ మేరకు బీజేపీకి భారీ నష్టం వాటిల్లే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. 

By
en-us Political News

  
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యున్నత గౌరవం దక్కింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరో వాతావరణ గండం ఆందోళనకు గురిచేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.