సెక్యులర్ ఫ్రంటే శ్రీరామ రక్ష..  కామ్రేడ్ పినరయ్ జోస్యం 

Publish Date:Dec 15, 2021

Advertisement

దేశం నెత్తి మీద నుంచి ఓ పెద్ద బరువు దిగిపోయింది. కామ్రేడ్ పినరయ్ విజయన్ ఆ బరువును ఇట్టే దించేశారు. కేంద్రంలో ఏడేళ్ళుగా తిష్టేసుకు కూర్చున్న బీజేపీ ప్రభుత్వాని గద్దేదించడం ఎలా? మోడీ మూడోసారి ప్రధాని కుర్చీలో కూర్చోకుండా చేయడం ఎలా? అని అందరినీ వేధిస్తున్న ప్రశ్నకు పినరయ్ సింపుల్ గా సమాధానం ఇచ్చారు. వామపక్షాల సారధ్యంలో ఏర్పడే  సెక్యులర్ ఫ్రంట్ బీజేపీనే 
గద్దెదించుతుందని  విజయన్ ధీమా వ్యక్త పరిచారు.  

దేశంలో బీజేపీకి రాజకీయ ప్రత్యామ్నాయం ఏది అనే విషయంలో అనేక చర్చలు నడుస్తున్నాయి. కొందరు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కూటమి ఏర్పడుతుందని అంటున్నారు. కొందరేమో కాంగ్రెస్ లేని కూటమి, ఆత్మ లేని దేహం అంటున్నారు. మమతా బెనర్జీ అయితే కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ, ఈజ్ నో మోర్’ అంటున్నారు. కాంగ్రెస్ లేకుండా బీజేపీ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామని మమతా బెనర్జీ ఏకంగా శపథమే చేశారు. కొద్ది రోజుల క్రితం దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హడావిడి చేశారు కానీ, ఆ తర్వాత మెత్త బడ్డారు. ఇప్పుడు మళ్ళీ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల ఫ్రంట్ అంటూ ప్రయత్నాలు ప్రారంభించారు. 

ఈ మధ్యే కాంగ్రెస్ లేకుండా బీజేపీ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామని బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ శపథం చేస్తున్నారు. అయితే ఇవేవీ కావని, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా సెక్యూలర్ ప్రత్యామ్నాయం  లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలోనే ఏర్పడుతుందని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ అన్నారు. అయితే, విజయన్ కూడా ఎందుకనో  కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేసుకున్నారు. బీజేపీ  ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసే అవకాశం కాంగ్రెస్‌కు లేదని, ఒకవేళ ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలు ఆదరించరని ఆయన అన్నారు. జైపూర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రసంగంలో రాహుల్ ప్రసంగంలోని హిందూ, హిందుత్వ పదాలను ఉదహరిస్తూ ఆయన ఈ విషయాన్ని నొక్కి చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సెక్యూలరిజాన్ని కాకుండా సాఫ్ట్ హిందుత్వ గురించి మాట్లాడుతోందని, దీంతో ప్రజలకు ఇప్పటికి కాంగ్రెస్‌పై ఉన్న నమ్మకం సన్నగిళ్లిపోయిందని విజయన్ అన్నారు.

రాహుల్ గాంధీ మాటల్లోని సాఫ్ట్ హిందుత్వ స్టాండ్‌ను కాంగ్రెస్ ఎప్పటి నుంచో అనుసరిస్తూ వస్తోంది. కాకపోతే జైపూర్‌లో రాహుల్ గాంధీ ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించారంతే. కాంగ్రెస్ పట్ల ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారు. కార్యకర్తల్లో కూడా ఆ పార్టీపై నమ్మకం పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా ‘సెక్యూలర్ ప్రత్యామ్నాయం’ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయలేదు. సెక్యూలరిజం కాకుండా హిందూయిజం గురించి కాంగ్రెస్ మాట్లాడడం తన ఉనికిని మరింత తగ్గించుకోవడమే. కాంగ్రెస్‌కు ఇంతకంటే పెద్ద తప్పు అవసరం లేదని  విజయన్ అన్నారు. అయితే ప్రశాంత్ కిశోర్ పౌరోహిత్యంలో బీజేపీకి వ్యతిరేకంగా  ఉమ్మడి కూటమి ఏర్పాటుకు సాగుతున్న యజ్ఞం మూడు కూటములు,ఆరు ఫ్రంట్లుగా వర్ధిల్లుతోంది.  

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.