కేసీఆర్ వ్యూహాలేమిటి? ప్రగతి భవన్ లేదా ఫామ్ హౌస్ దాటి బయటకు రాకుండా ఆయనేం చేస్తున్నారు? టీఆర్ఎస్ శ్రేణుల్లోనే ఈ సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అయితే ఆయన తన జాతీయ రాజకీయ ప్రవేశంపై వ్యూహాలకు పదును పెడుతున్నారనీ, ఎన్ని అవాంతరాలెదురైనా, ఎదురు దెబ్బలు తగిలినా ముందుకే అడుగేయాలన్న కృత నిశ్చయంతో ఉన్నారనీ ఆయనను సన్నిహితంగా ఎరిగిన వాళ్లు చెబుతుంటారు. ఇటు రాష్ట్రంలోనూ టీఆర్ఎస్ ప్రభ మసకబారుతోంది. అటు జాతీయ స్థాయిలోనూ కేసీఆర్ రాకను స్వాగతించే వారెవరూ కనిపించడం లేదు. అయినా కూడా కేసీఆర్ నోరు మెదపడం లేదు. మరేం చేస్తున్నారు. ఈ ప్రశ్నకు సంపూర్ణంగా కాకున్నా.. ఏదో ఒక మేరకు బదులు అనిపించే ఉదంతం ఒకటి గురువారం సంభవించింది. మోడీ తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసనగా సుదీర్ఘ రైతు ఉద్యమానికి నాయకత్వం వహించిన రైతు ఉద్యమ నేత రాకేష్ తికాయత్, ఆయన అనుచరుడు యుధ్వీర్ సింగ్ లో కలిసి గురువారం సాయంత్రం కేసీఆర్ తో భేటీ అయ్యారు. శంషాబాద్ విమానాశ్రంయలో దిగిన వీరిరువురూ అక్కడ నుంచి నేరుగా ప్రగతి భవన్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆరే వీరిని స్వయంగా పిలిపించినట్లు విశ్వసనీయ సమాచారం. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ భేటీ వివరాలను అత్యంత గోప్యంగా ఉంచారు. భేటీ అనంతరం వీరిరువురూ సీఎం క్యాంప్ ఆఫీసులోనే బస చేసినట్లు సమాచారం.ఇంతకీ రెండున్నర గంటల పాటు అత్యంత రహస్యంగా జరిగిన భేటీలో ఏం చర్చించారు? ఆ వివరాలు, అసలు భేటీ వివరాలూ బయటకు రాకుండా ఎందుకు ఇంత గోప్యత పాటిస్తున్నారన్నది పరిశీలకులకు కూడా అంతుబట్టడం లేదంటున్నారు. ప్రగతి భవన్ వర్గాల నుంచి అత్యంత విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఈ భేటీలో రైతు సమస్యలపై రైతులతో చైతన్యం తీసుకురావడం, గతంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమలో అనుసరించిన పంథా, రైతులను మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఏకం చేయడం ఎలా అన్న విషయాలపై వీరి మధ్య విస్తృతంగా చర్చ జరిగినట్లు చెబుతున్నారు. మొత్తంగా మోడీకి వ్యతిరేకంగా ఇతర రాజకీయ శక్తులు కలిసి రాకున్నా రైతులను చైతన్య వంతులను చేసి వారిని ఉద్యమోన్ముఖులను చేసి వారికి నాయకత్వం వహించేలా కేసీఆర్ వ్యూహాలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రైతు ఉద్యమ నేత రాకేశ్ తికాయత్, యుధ్వీర్ సింగ్ లను పిలిపించుకుని మరీ కేసీఆర్ వారితో రహస్యంగా భేటీ అయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా శుక్రవారం సాయంత్రం కూడా కేసీఆర్ తో వీరు చర్చించినట్లు సమాచారం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-secreat-meeting-with-rakesh-tilayat-and-yudveersingh-in-pragati-bhawan-39-139353.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.
అయితే ఆయన తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో కలకలం రేపింది.
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం.