కాళీ వ్యాఖ్యల వివాదం.. తృణమూల్ కు మహువా గుడ్‌బై

Publish Date:Jul 8, 2022

Advertisement

కాళీమాతపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు రగిల్చిన వివాదం ఇంకా రగులుతూనే వుంది. వివాదస్పద దర్శకురాలు, రచయిత్రి, నటి లీనా మణి మేగలై నిర్మించిన 'కాళీ' సినిమాకి సంబంధించిన  వివావదస్పద పోస్టర్‌ పై మహువా చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం తోడైంది అన్నట్లుగా, ‘పోస్టర్’ వివాదాన్ని రాజకీయ వివాదంగా చేసింది. 

కాళీమాతను మాంసాహారి, మద్యం సేవించే దేవతగా తాను నమ్ముతున్నానంటూ మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలపై ఒక్క పశ్చిమ బెంగాల్ లోనే కాదు, దేశంలో ఇంకా అనేక చోట్ల నిరసనలు వ్యక్తం వుతున్నాయి. మహువా వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, బీజేపీ,ఇతర సంఘ్ పరివార్ సంస్థలు ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఆమె పై పోలీసు కేసులు కేసులు  నమోదయ్యాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో పరిస్థితి అదుపు తప్పుతున్న సకేతాలు స్పష్టమవుతున్నాయి. 

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా మహువా వ్యాఖ్యలు తీవ్రంగా తప్పుబట్టారు. కాళీమాతపై ఆమె చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని, హిందూ దేవతలను అవమానిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ మహువాపై మధ్యప్రదేశ్ భోపాల్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే మహువా వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తృణమూల్ కాంగ్రెస్ స్పష్టం చేసింది. అయినా ఆమెను పార్టీ సస్పెండ్ చేయాలనీ, బీజేపీ డిమాండ్ చేయడమే కాకుండా బెంగాల్’లో ఆందోళనకు పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్  ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమ పార్టీ ఎంపీ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు.  మనుషులు తప్పులు చేస్తారని.. వాటిని సరిదిద్దుకోవచ్చని హితవు పలికారు. అలాంటి, తప్పులు చేసి సరిదిద్దుకున్న అనుభవాలు తనకూ ఉన్నాయని చెప్పుకొచ్చారు. కొందరు మంచి పనిని సహించక వివాదాలు సృష్టించవచ్చును. కానీ, ప్రతికూల ఆలోచనలు మెదడుకు మంచిది కాదు. అందుకే సానుకూల దృక్పథంతో అలోచించండి, అంటూ మమతా బెనర్జీ పేర్కొన్నారు. 

అయితే, మహువా మాత్రం, తగ్గేదేలే’ అంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్‌ తమ వ్యాఖ్యలను  ఖండిస్తూ ట్వీట్ చేసిన వెంటనే, ఆమె పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాను అన్‌ఫాలో చేశారు. ఇక ఇప్పుడు ఏకంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకే గుడ్‌బై చెప్పేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. బీజేపీ వత్తిళ్ళకు తలొగ్గి మమతా బెనర్జీ తనపై చర్యలు తీసుకుంటే, పార్టీని వదిలేందుకు కూడా వెనకడేది లేదని ఆమె పార్టీ నాయకులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

అయితే, ముఖ్యమంత్రి మమత బెనర్జీ మాత్రం, మత ఉద్రిక్తలకు దారితీసీ పరిస్థితులు తలెత్తకుండా చూసేందుకు మహువాపై చర్యలు తప్పవని బావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, మహువా వ్యాఖ్యలతో సంబంధం ఉన్న లేకున్నా ఒకే రోజు ముగ్గురు తృణమూల్ కార్యకర్తలు హత్యకు  గురైన నేపధ్యంలో, పరిస్థితి మరింతగా దిగజారి పోకముందే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని మమతా బెనర్జీ భావిస్తునట్లు తెలుస్తోంది. అదే జరిగితే, మహువా పార్టీకి గుడ్‌బై చెప్పడం ఖాయమని అంటున్నారు.

By
en-us Political News

  
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.