మీ  బ‌డిని అలా వదిలేస్తారా  సీఎం సార్! 

Publish Date:Jul 13, 2022

Advertisement

చ‌దువుకుని ఉన్న‌తోద్యోగాల్లో స్థిర‌ప‌డిన‌వారిలో చాలామంది త‌మ వూరికి ఏదో చేయాల‌న్న ఆకాంక్ష బాగా వ్య‌క్తం చేస్తున్నారు. నిజంగానే చాలామంది వూళ్ల‌లో రోడ్డు వేయించ‌డ‌మూ, చ‌దువుకున్న పాఠశాలకు ఆర్ధిక సాయం చేయ‌డం, వీల‌యితే భ‌వ‌నాన్ని బావుచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇది ఇటీవ‌ల  బాగా జ‌రుగుతోన్న హ‌ర్షించ‌ద‌గ్గ ప‌ని. ఈ జాబితాలోకి  తెలంగాణా ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా వ‌చ్చారు. ఆయ న దుబ్బాక‌లో చ‌దువుకున్న ఉన్న‌త పాఠ‌శాలను పున‌ర్నించ‌డానికి పూనుకున్నారు. అంతేకాదు 2016 లో  ఏకంగా కొత్త భ‌వ‌నాన్నేనిర్మించారు. ఇంత‌వ‌ర‌కూ హ‌ర్ష‌ణీయ‌మే. కానీ అక్క‌డితో చేతులు  దులి పేసుకు న్నారు సీఎం. భ‌వ‌నం దిట్టంగా బావుండ‌డంతో ఇంకా ఆరంభోత్స‌వ‌మూ కాక‌పోవ‌డంతో దుబ్బాకలో మందుబాబుల‌కు పైసా చెల్లించ‌కుండానే అది స‌రికొత్త బార్‌గా మారింది! 

కేసీఆర్‌ దుబ్బాక ఉన్నత పాఠశాలలో 1974-78 మధ్య చదువుకొన్నారు. ఆ బడి శిథిలావస్థకు చేరడంతో పునరుద్ధరించాలని నిర్ణయించారు. అధికారులను ఆదేశించారు. 2016లో బడిని కూలగొట్టి  కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జూనియర్‌ కాలేజీని కూడా అదే భవనంలో నిర్వహించాలన్న ఉద్దేశంతో మూడంతస్తుల భవన నిర్మాణం ప్రారంభించారు. 2018లో నిర్మాణం పూర్తైంది. అప్పటి దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పర్యవేక్షణలో గెలాక్సీ సంస్థ ఈ భవనాన్ని నిర్మించింది. 

 పది కోట్ల రూపాయలు పెట్టి కట్టిన భవనం పేకాటకు స్థావరమైంది. రాజమహల్‌ను తలపించే  రీతిలో రెండేళ్ల  క్రితం నిర్మించిన భవనం నిరుపయోగంగా మిగిలిపోయింది. కేసీఆర్‌ చేతుల మీదుగా కొత్త  భవనా న్ని ప్రారంభించాలని దుబ్బాక నేతలు భావించడం.. భవన నిర్మాణం పూర్తై రెండేండ్లైనా బడిని  ప్రారం భించకపోవడమే ఈ దుస్థితికి కారణమైంది. సీఎం కేసీఆర్‌ పాఠశాలను ప్రారంభిస్తారని రామలింగారెడ్డి అప్పట్లో ప్రకటించారు. అయితే,  ఆ ప్రకటన చేసిన నెల రోజులకే రామలింగారెడ్డి కరోనా తో 2020 ఆగస్టు లో చనిపోవ‌డంతో  పాఠశాల ప్రారంభోత్సవం ఆగిపోయింది.
 
సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తే నియోజకవర్గానికి  ఏమైనా అభివృద్ధి ప్రాజె క్టులు రావొచ్చని స్థానిక నేతలు భావిస్తున్నారు. దీంతో కార్పొరేట్‌ స్థాయిలో కట్టిన బడి  నిరుపయోగంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు కిటికీలకు ఉన్న అద్దాలను ధ్వంసం చేశారు. బడిలో ఖాళీ మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి. 2016లో బడిని కూల్చివేయడంతో దుబ్బాక పాత జూనియర్  కాలేజీ భవనం లోనే బడిని కూడా నిర్వహిస్తున్నారు. కొత్త భవనం ప్రారంభించకపోవడంతో ఇరుకు గదుల్లోనే  విద్యా బోధ న చేస్తున్నారు.  ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్ 18,787 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించా రు. బడి కోసం 14 గదులు, జూనియర్‌ కాలేజీ కోసం 14 గదులు కేటాయించారు. సిబ్బంది, ప్రయోగశాలలు, స్టోర్‌ రూమ్‌, ఆడిటోరియం వీటికి అదనం. బడికి, కాలేజీకి వేర్వేరుగా వాటర్‌ ట్యాంకులు, కరెంటు కోసం ప్రత్యేకంగా ట్రాన్స్ ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. 250 మంది ఒకేసారి వినియోగించుకొనేలా మరుగుదొడ్లు నిర్మించారు. అన్నీ బాగానే వున్నాయి.  కానీ  తాను చ‌దువుకున్న బ‌డిని అలా పేకాట‌రాయుళ్ల‌కి వ‌దిలే య‌డం ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బు అని దుబ్బాక ప్ర‌జ‌లు విచారం వ్య‌క్తం చేస్తున్నారు. 

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.