ఈసారీ తెలంగాణ వాదాన్నే నమ్ముకున్న కేసీఆర్!

Publish Date:Nov 7, 2023

Advertisement

బీఆర్ఎస్ కాదు.. టీఆర్ఎస్సే అని కేసీఆర్ ప్రజలను నమ్మించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. దేశం మొత్తం తెలంగాణ మోడల్ తీసుకువస్తామంటూ ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చేసి జాతీయ రాజకీయాలలోకి దూకేసిన కేసీఆర్.. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ముందు.. తన జాతీయ రాజకీయ ఆకాంక్షల గురించి ఎక్కడా  మాట్లాడటంలేదు. తెలంగాణ వాదాన్నే నమ్ముకున్నారు. తెలంగాణ సాధించిన పార్టీగా మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.  తన ఎన్నికల ప్రచార సభలలో కూడా ఎక్కడా జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావించకుండా... తెలంగాణ సాధించిన పార్టీగా మరో సారి ఎన్నుకోండంటూ వేడుకుంటున్నారు. 

ఇదే కేసీఆర్ కొంత కాలం కిందట పిడుక్కి బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లు కేంద్రంలో మోడీ సర్కార్ ను గద్దె దింపే సత్తా తనకు మాత్రమే ఉందని గల్లీ మీటింగులలో కూడా ఊదరగొట్టారు. ఇప్పుడిక తెరాస కేవలం తెలంగాణకు చెందిన పార్టీ మాత్రమే కాదనీ, బీఆర్ఎస్ గా రూపాంతరం చెంది జాతీయ పార్టీ అయ్యిందనీ, ఇక తాను జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతాననీ చెప్పుకునే వారు.  అయితే అదంతా గతం..
ఆయన జాతీయ అడుగులు తడబడ్డాయి. ఆ దిశగా ఆయన వేసిన ప్రతి అడుగులోనూ అడ్డంకులూ, అవాంతరాలూ ఎదురయ్యాయి. బీజేపీ వ్యతిరేక కూటమిలో ఆయనకు స్థానమే లేకుండా చేసింది. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీయేతర పార్టీలన్నీ జాతీయ స్థాయిలో ఏక తాటిపైకి వస్తుంటే.. అదే బీజేపీని గట్టిగా వ్యతిరేకించిన  బీఆర్ఎస్ ను మాత్రం ఆ పార్టీలేవీ నమ్మడం లేదు. ఇక  ఆయన జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ ప్రకటనలు గుప్పించడంతో.. తెలంగాణ సెంటిమెంటు మాయమైంది. దీంతో కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలలాగే బీఆర్ఎస్ కూడా ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ. తెలంగాణ  ప్రజల సెంటిమెంటుతో పెనవేసుకున్న టీఆర్ఎస్ కాదు. 

విషయం ఆలస్యంగా గ్రహించిన కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాల ఊసెత్తడం లేదు. ఇప్పుడున్న  పార్టీ పేరుకు బీఆర్ఎస్ అయినా పూర్తిగా తెలంగాణ ప్రయోజనాలు, ఆకాంక్షల కోసమే పని చేస్తుందని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రాలకు బలం ప్రాంతీయ పార్టీలేనని నమ్మబలుకుతున్నారు.  అయినా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తరువాత కేసీఆర్ ఇతర రాష్ట్రాలలో చేసిన రాజకీయం.. ఇక్కడ సమయానికి ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోయినా.. ఇతర రాష్ట్రాలలో బాధితులకు నష్టపరిహారం పందేరం చేయడానికి ఆర్భాటంగా చేసిన యాత్రలు, ఇతర రాష్ట్రాలలో బీఆర్ఎస్ శాఖలను ఏర్పాటు చేయడం.. మహా  స్థానిక ఎన్నికలలో పోటీ, ఆయా రాష్ట్రాలలో ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరికలకు ప్రోత్సహించడం తదితర సంఘటలను గుర్తు తెచ్చుకుంటూ... ఇంతలో కేసీఆర్ మాట ఎందుకు మారిందంటూ జనం ఆలోచిస్తున్నారు.  చర్చించుకుంటున్నారు. 

ఇక కేసీఆర్ గత రెండు అసెంబ్లీ ఎన్నికలలోనూ తనను గెలిపించిన తెలంగాణ వాదాన్ని వదులుకుంటే రాష్ట్రంలో అధికారం జారిపోతుందన్న విషయాన్ని గ్రహించారా అన్నట్లుగా జాతీయ రాజకీయాల ఊసు వదిలేసి పూర్తిగా తెలంగాణ వాదాన్నే నమ్ముకున్నారు. తనకు జాతీయ అంశాలు కాదు, తెలంగాణ సమాజమే ముఖ్యమని పదేపదే చెబుతున్నారు. తెలంగాణ సాధించిన పార్టీగా తమనే గెలిపించాలని చెప్పుకుంటున్నారు. సావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించుకువచ్చానని పదేపదే చెప్పుకుంటున్నారు.  మరి మారిన కేసీఆర్ ధోరణిని తెలంగాణ ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుం టారన్నది చూడాల్సిందే. 

By
en-us Political News

  
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
బంగారం ప్రియులకు ఇది నిజంగానే ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పవచ్చు
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హానీట్రాప్ ఉచ్చులో పడిన వాయుసేన అధికారి.. షాకింగ్ నిజాలు వెల్లడించిన ఛార్జ్‌షీట్.!
మినీ బస్‌ను ఢీకొన్న ట్రక్కు.. 23 మంది మృతి.!
రాష్ట్రంలో 25 పారిశ్రామిక ఎకోసిస్టమ్ లను అభివృద్ధి చేస్తాం: లోకేష్
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
1999లో ఎయిర్‌పోర్టుల గురించి ఎవరూ పెద్దగా ఆలోచించని సమయంలోనే.. సీఎం చంద్రబాబు నాయుడు శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై దృష్టి పెట్టారు.
ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టేనని పెద్దలు అంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.