హస్తినలో గాలి విషం!

Publish Date:Nov 7, 2023

Advertisement

దేశ రాజధాని నగరం హస్తినలో  మనిషికి ప్రాణాధారమైన గాలే విషంగా మారిపోయిన పరిస్థితి. హస్తినలో వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. హస్తినలో వాయు కాలుష్యం అన్నది కొత్తేమీ కాకపోయినా.. ఈ సారి అది ప్రమాద స్థాయిని దాటిపోయింది. వాయునాణ్యతా  సూచీ ఇంతగా పడిపోవడమన్నది ఇటీవలి కాలంలో ఇదే  ప్రథమం. హస్తినలో వాయికాలుష్యం అత్యంత తీవ్ర స్థాయికి చేరుకోవడానికి కారణంగా ఢిల్లీకి పొరుగున ఉన్న రాష్ట్రాలలో పంట వ్యర్థాలను ఇష్టానుసారం దగ్ధం చేయడమే కారణమని అంటున్నారు.

 ముఖ్యంగా హర్యానా, పంజాబ్ లలో శీతాకాలంలో పంట వ్యర్థాలను దగ్ధం చేయడం ద్వారా వచ్చే పొగ కారణంగా వాయుకాలుష్యం తీవ్ర స్థాయికి  చేరుకుంటోందని అంటున్నారు. సాక్షాత్తూ ఢిల్లీ హైకోర్టు ఢిల్లీలో ఉంటే గ్యాస్ ఛాంబర్ లో ఉన్నట్లేనని వ్యాఖ్యనించడమే హస్తినలో వాయు కాలుష్యం తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.  అయితే పర్యావరణవేత్తలు చెబుతున్నట్లుగా పంట వ్యర్థాల దగ్థం ఒక్కటే వాయు కాలుష్యం పెరిగిపోవడానికి కారణం కాదని చెప్పాలి. గ్రీన్ హౌస్ ఉద్గారాలు కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు. 

వాయుకాలుష్యం బెడద ఒక్క ఢిల్లీకి మాత్రమే పరిమితమైందని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ద్వారా భారత్ లోని ఇతర నగరాలు, పట్టణాలు సురక్షితంగా ఉన్నాయని నమ్మించేందుకు ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని దాదాపు ప్రతి నగరంలోనూ వాయుకాలుష్యం తీవ్రంగానే ఉందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. వాయు కాలుష్యం మానవుల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులపై అది చూపే ప్రతికూల ప్రభావం ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. 

 వాయుకాలుష్యం కారణంగా హస్తినలో సగటు ఆయుర్ధాయం పది సంవత్సరాలు తగ్గుతున్నదని ఒక  అధ్యయనం ఇటీవల వెల్లడించిందంటే  హస్తినలో  వాయు కాలుష్య తీవ్రత ఎంత దారుణంగా ఉందో అర్ధం అవుతుంది.  వాయు కాలుష్యాన్ని తగ్గించడం అంటే చిన్న విషయం కాదు. ఇది ఒక సమష్టి కృషి. ముందుగా  పర్యావరణ పరిరక్షణపై ఒక అవగాహన ఉండాలి. వాయుకాలుష్యం మానవ మనుగడకు ఎంత హానికరమన్న విషయంపై ప్రజలలో చైతన్యం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. సరి బేసి వంటివి తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే అవుతాయని గుర్తించాలి.   ప్రజా రవాణాను ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటే అంతగా కాలుష్యానికి చెక్ పెట్టడానికి వీలు అవుతుంది.  అలాగే పెద్ద ఎత్తున చెట్లు నాటడం కూడా వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు దోహదపడతాయి. అభివృద్ధి ముసుగులో సాగుతున్నపర్యావరణ విధ్వంసాన్ని ఆపాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అడవుల నరికివేతకు ఫుల్ స్టాప్ పెట్టాలి. అడవుల సంరక్షణకు చట్టాలు ఉన్నా వాటిని   పట్టించుకోకుండా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అభివృద్ధి పేర పర్యావరణ విధ్వంసం పెను ముప్పునకు కారణమౌతుంది. అయినా పర్యావరణం, అభివృద్ధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉందన్న విషయాన్ని గుర్తించాలి.  ప్రగతి ముసుగులో దీర్ఘకాలంలో వినాశనానికి దారితీసే అభివృద్ధి ఎంత మాత్రం సమర్థనీయం కాదు. పర్యావరణ అనుకూల అభివృద్ధిపై దృష్టిపెట్టడం ద్వారా మాత్రమే వాయు కాలుష్యం అరికట్టేందుకు వీలవుతుందన్న విషయాన్ని పాలకులు గుర్తించాల్సిన అవసరం ఉంది. 

By
en-us Political News

  
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
బంగారం ప్రియులకు ఇది నిజంగానే ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పవచ్చు
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హానీట్రాప్ ఉచ్చులో పడిన వాయుసేన అధికారి.. షాకింగ్ నిజాలు వెల్లడించిన ఛార్జ్‌షీట్.!
మినీ బస్‌ను ఢీకొన్న ట్రక్కు.. 23 మంది మృతి.!
రాష్ట్రంలో 25 పారిశ్రామిక ఎకోసిస్టమ్ లను అభివృద్ధి చేస్తాం: లోకేష్
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
1999లో ఎయిర్‌పోర్టుల గురించి ఎవరూ పెద్దగా ఆలోచించని సమయంలోనే.. సీఎం చంద్రబాబు నాయుడు శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై దృష్టి పెట్టారు.
ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టేనని పెద్దలు అంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.