తెలంగాణ‌లో తీన్మార్‌.. ఆ ముగ్గురి మైండ్‌గేమ్‌..

Publish Date:Apr 19, 2022

Advertisement


తెలంగాణలో తెరాస, బీజేపీ, కాంగ్రెస్ మూడూ కూడా మైండ్ గేమ్ రాజకీయాలపైనే ఆధారపడి ముందుకు సాగుతున్నాయి. అంటే స్వంత బలంపై కన్నా, ప్రత్యర్థి పార్టీల బలహీనతలను సొమ్ము చేసుకోవాలన్న యావతోనే ముందుకు సాగుతున్నాయి.   ఇప్పటి నుంచే ఎన్నికల హీట్ రగిలించి....దానిని అసెంబ్లీ ఎన్నికల వరకూ   చల్లారకుండా కొనసాగించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి.  ముందస్తు ఎన్నికల ప్రచారం, జంపు జిలానీలంటూ హడావుడీ,  కేసీఆర్  జైలుకెళ్ళడం ఖాయం అంటూ బీజేపీ అధ్యక్షుడు బండి ప్రకటనలూ, సర్వేలు చెబుతున్నాయి 95-105 సీట్లు గెలుస్తున్నామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేయడం...రానున్నది మా ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ గంభీర ప్రకటనలూ ఇవన్నీ మైండ్ గేమ్ రాజకీయాలలో భాగమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మైండ్ గేమ్ పాలిట్రిక్స్ లో తెరాస, బీజేపీ, కాంగ్రెస్ ఒకదానికి మించి మరొకటి తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాయి. ఇందుకు కారణం ఆ మూడు పార్టీలకూ  కూడా ఎటువంటి రాజకీయ అంశం, విధానపరమైన స్పష్టతా లేకపోవడమేనని చెప్పవచ్చు. అందుకే మూడు పార్టీలూ కూడా 
ఒకదానిని మించిన మరొకటి పలు రకాల ఆరోపణలను తెరపైకి తీసుకొచ్చి ప్రజల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేపుతున్నారు. వాస్తవానికి గతంలో రాజకీయ పార్టీలు పోటా పోటీగా అభివృద్దిని, సంక్షేమం, సేవలను ప్రచారం చేసుకునేవి. హామీలు, వాగ్ధానాలు, భవిష్యత్ ప్రణాళికలను ప్రజలకు వివరించేవి. ఎవరికివారు విస్తృతంగా పోటాపోటీగా ప్రచారం చేసుకునేవి. ఇక విమర్శలు, ఆరోపణలు, అవినీతి వంటివి పూర్తిగా ఇష్యూ బేస్డ్ గా ఉండేవి.  అయితే ఇప్పడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.  అధికారంలో ఉన్నతెరాస సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడమే ధ్యేయంగా విపక్ష పార్టీలపై విమర్శలకు తెరతీసి పరిస్థితిని నిత్య పోరాటమన్నట్లుగా మార్చేసింది. 

కేంద్ర బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా భారత రాజ్యాంగాన్ని తిరిగి లిఖించాలంటే కేసీఆర్ ఉద్ఘాటన ఇందులో భాగమేననిపరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.   మాది రాజకీయ పార్టీ... పథకాలు పెట్టేది ప్రజల్లో గెలిచేందుకు, కేంద్రమంత్రితో, ప్రధాన మంత్రితో నేనే స్వయంగా మాట్లాడాను. జాతీయ స్థాయిలో పార్టీ పెట్టాలా...? అనేది ఒక ఆలోచన. ప్రాంతీయ పార్టీలతో కలిసి ముందుకు వెళ్తాం. బిజెపికి వ్యతిరేకంగా జట్టుకడుతాం. డిల్లీలో ముఖ్యమంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. 95 - 105 సీట్లను గెలుస్తున్నాం. మా సర్వే తేల్చింది. ఓ ముఖ్య సలహాదారుడితో కలిసి పనిచేస్తున్నాం... అంటూ తెలంగాణ అధికార పక్షం స్పష్టం చేసింది.  రెచ్చగొట్టి బీజేపీ, కాంగ్రెస్ లను ముగ్గులోకి దింపి ప్రజలలో వాటి ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా తెరాస అధినేత తీరు ఉంది. ఇక బీజేపీ కూడా తానేమీ తీసిపోలేదన్నట్లుగా
వేరే సమస్యలేమీ లేవన్నట్లు సీఎం అవినీతి అంటూ పల్లవి ఎత్తుకుంది. ప్రతి సభలోనూ, సమావేశంలోనూ,  అతి త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి జైలు కెళ్ళడం ఖాయం. అంటూ బండి సంజయ్ పదేపదే ప్రస్తావిస్తున్నారు. సిఎంకు ఓటమి భయం పట్టుకున్నది. తెలంగాణలో రానున్నది మా ప్రభుత్వమే. మేము అధికారంలోకి వస్తే హైదరాబాద్ ను భాగ్యనగరంగా మార్చేస్తాం.. అంటూ ప్రకటనలు గుప్పిస్తూ పార్టీ క్యాడర్ లో  ఉత్సాహాన్నీ, ప్రజలలో కేసీఆర్ పట్ల సందేహాన్నీరేకేత్తించేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.  దాదాపు గత ఏడాది కాలంగా  బండి కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమంటూ చెబుతూ వస్తున్నారు. దుబ్మాకలో గెలిచాం. జిహెచ్ఎంసిలో విజయం సాధించాం. హుజూరాబాద్ లో జయకేతనం ఎగురవేశాం. ఇక తెలంగాణలో అధికారంలోకి రావడమే మిగిలింది. అని బిజెపి చెప్పుకొస్తోంది.  
కాంగ్రెస్ కూడా అదే దారిలో అతి త్వరలోనే ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి. మరి కొద్దిరోజులు బూత్ స్థాయి నుంచి కష్టపడితే అధికారం మనదే. ఇప్పుడు రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అంటూ టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తూ మైండ్ గేమ్ ఆడుతోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్, కేటీఆర్ అవినీతి అనే ప్రచారానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.  ఇలా రాష్ట్రంలో రాజకీయపార్టీలన్నీ మైండ్ గేమ్ పాలటిక్స్ కు ఇస్తున్న ప్రాధాన్యం ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఇవ్వడం లేదు. రాజకీయ వాతావరణం  వేడిగా ఉంటేనే కేడర్ ను నిలబెట్టుకోవడానికి వీలవుతుందని విపక్షాలు భావిస్తుంటే...ఆ వేడే విపక్షాల దూకుడుకు అడ్డుకట్ట వేస్తుందనీ, ప్రజలలో తెలంగాణ సెంటిమెంట్ ను  సజీవంగా ఉంచుతుందనీ కేసీఆర్ నమ్ముతున్నారు. స్పష్టమైన రాజకీయ నినాదం, అజెండా లేకుండానే సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయ పార్టీలు రాష్ట్రంలో రాజకీయ హీట్ ను పెంచేస్తున్నాయి. 

By
en-us Political News

  
జాతీయ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడెక్కుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కాంగ్రెస్ న్యాయపోరాటానికి దిగింది.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ బైపాస్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
ప్రస్తుతం మార్కెట్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి
అర్థశాస్త్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి విజేతల ప్రకటన వెలువడింది.
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ
సికింద్రాబాద్‌లోని బొల్లారం చిన్నారి మోజెస్ అరెలియా కిడ్నాప్, హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.