ప్రజలు ఏం కోల్పోయారో తెలుసుకున్నారు. బిఆర్ఎస్ నేతలు హైరానా పడాల్సిన పని లేదు. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది అని మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ ప్రెసిడెంట్ కెసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎర్రవెల్లి ఫాం హౌజ్ లో ఆయన పాలకుర్తి నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. చాలా రోజుల తర్వాత కెసీఆర్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే కెసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణంలో దర్యాప్తు తుది దశకు వచ్చిన నేపథ్యంలో కెసీఆర్ అరెస్ట్ ఖాయం అని ప్రచారం జరుగుతుంది. ఫార్ములా ఈ రేస్ కుంభకోణంలో కొడుకు కెటీఆర్ అరెస్ట్ అవుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. తన గారాల పట్టి కవిత ఇటీవల బెయిల్ పై విడుదలైనప్పటికీ కెటీఆర్ అరెస్ట్ వార్తలు కెసీఆర్ కి తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి. ఈ కారణంగానే ఫ్రస్టేషన్ లో రేవంత్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చి 11 నెలలు అయ్యింది. అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పింది. ఈ పిచ్చి మాటలు మాకు రావా? ఈ రోజు మాట్లాడటం ప్రారంభిస్తే రేపటివరకు ఆగకుండా మాట్లాడగలం. ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వం భయపెడుతుందని ఘాటుగా వ్యాఖ్యానించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-mass-warning-to-revanth-reddy-25-188140.html
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.